బొప్పాయిలో ఇది కలుపుకుని తింటే తొందరగా బరువు తగ్గుతారు

బరువు తగ్గడానికి బొప్పాయి పండు కూడా సహాయపడుతుందన్న ముచ్చట ఎవ్వరికీ తెలియకపోవచ్చు. కానీ ఈ పండులో రెండింటిని కలుపుకుని తింటే మీరు చాలా తొందరగా బరువు తగ్గుతారు. 

 

ప్రస్తుత కాలంలో అధిక బరువు సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ అధిక బరువుతో బాధపడుతున్నారు. ఈ ఓవర్ వెయిట్ ఒక అనారోగ్య సమస్యలా అనిపించకపోవచ్చు. కానీ ఇది మీకు డయాబెటీస్ నుంచి గుండెపోటు వరకు ఎన్నో రోగాలొచ్చేలా చేస్తుంది. 

బరువు తగ్గాలంటే మీరు  రోజూ వ్యాయామం చేయడంతో పాటుగా సరైన ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం. ఇవే మీరు ఆరోగ్యంగా ఉండేందుకు, బరువు తగ్గేందుకు ఎంతగానో సహాయపడతాయి. బరువు ఎక్కువగా ఉండే సాయంత్రం పూట స్నాక్స్ లో కడుపును నింపే, బరువు పెరగకుండా ఉండే ఆహారాలను తినాలనుకుంటారు. 

మీరు కూడా బరువు తగ్గాలని ట్రై చేస్తూ.. బరువును కంట్రోల్ చేసే ఆహారాలకోసమే ఎదురుచూస్తున్నారా? అయితే బొప్పాయి పండు మీకు బాగా సరిపోతుంది.

అవును ఈ పండు మీ కడుపును తొందరగా నింపడానికి, మీ బరువును తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. అయితే ఇందుకోసం బొప్పాయిలో రెండు పదార్థాలను కలుపుకుని తినాలి. అప్పుడే మీరు ప్రయోజనం పొందుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

చియా విత్తనాలు, బొప్పాయి

చియా విత్తనాలు, బొప్పాయి కాంబినేషన్ మీరు ఈజీగా బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. ఎందుకంటే చియా విత్తనాలలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ుంటుంది. ఇది మీ కడుపును తొందరగా నింపుతుంది. అలాగే మీకు ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉంచుతుంది. 

అలాగే దీనిలో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. దీనిలోని ఈ ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే మీ శరీరంలో  కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడానికి బాగా సహాయపడుతుంది. అందుకే బొప్పాయి, చియా విత్తనాలు వెయిట్ లాస్ కు బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు అంటున్నారు. 

చియా విత్తనాలు, బొప్పాయిని ఎలా తినాలి?

ముందుగా ఒక కప్పు బొప్పాయి ముక్కలను తీసుకోండి. దీనిలో ఒక టీస్పూన్ చియా విత్తనాలను వేసి బాగా కలపండి. దీన్ని డైరెక్ట్ గా తినొచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి ఈ కాంబినేషన్ బాగా ఉపయోగకరంగా ఉంటుంది. 

అవిసె గింజలు, బొప్పాయి

బొప్పాయి, చియా సీడ్స్ తో పాటుగా మీరు బొప్పాయి,  అవిసె గింజలను కూడా తినొచ్చు. ఈ రెండూ కూడా మీరు బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. మీకు ఇదొక హెల్తీ స్నాక్స్ అవుతుంది. అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ కంటెంట్ మెండుగా ఉంటాయి. ఇవి  బొప్పాయిలో కూడా ఉంటాయి. ఈ రెండింటి కాంబినేషన్ మీరు సులువుగా బరువు తగ్గడానికి బాగా సహాయపడతాయి.

 

అవిసె గింజలు, బొప్పాయిని ఎలా తినాలి?

ఇందుకోసం ఒక కప్పు బొప్పాయి ముక్కలను తీసుకోండి. దీనిలో ఒక స్పూన్ అవిసె గింజలను వేసి బాగా మిక్స్ చేయండి. దీన్ని మీరు స్నాక్స్ గా తినొచ్చు. 

వీటితో పాటు మీరు బరువు తగ్గాలంటే చేయాల్సినవి చాలా ఉన్నాయి. మీరు క్రమం తప్పకుండా వాకింగ్ చేయాలి. అలాగే రెగ్యులర్ గా శారీరక శ్రమ చేయాలి. ఈ శారీరక శ్రమే మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

ఒకేదగ్గర కూర్చొని తింటే మీరు మరింత బరువు పెరుగుతారు తప్ప తగ్గరు. అలాగే బరువు తగ్గడానికి మీరు చేయాల్సిన ముఖ్యమైన పని.. బయటి ఫుడ్ ను అసలే తినకూడదు. బయటి ఫుడ్ వల్లే చాలా మంది విపరీతంగా బరువు పెరిగిపోతారు. కాబట్టి ఇంట్లో వండిన హెల్తీ ఫుడ్ ను మాత్రమే తినండి. ఫ్యాట్స్ ను ఎక్కువగా తీసుకోకండి.

2024-09-07T08:56:24Z dg43tfdfdgfd