భార్య పేరు మీద ఇల్లు కొంటే ఇన్ని లాభాలా? భారీ మొత్తంలో డబ్బు మిగలడం ఖాయం

House Buying: అందరికీ ఓ ఇంటి యజమాని అనిపించుకోవాలనే కోరిక ఉంటుంది. అయితే ఈ రోజుల్లో ఇంటిని కొనుగోలు చేయడం ఖరీదైన వ్యవహారం. ఇంటి ధరతో పాటు, ఇల్లు రిజిస్టర్ చేయించడం, స్టాంప్ డ్యూటీ కట్టడం, ప్రాపర్టీ ట్యాక్స్ వంటి అదనపు ఖర్చులూ ఉంటాయి. ఈ ఖర్చులను తగ్గించుకోవాలంటే ఇంటిని భార్య (Wife) పేరు మీద కొనాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే భారత ప్రభుత్వం, మహిళలు (Women) అన్ని రంగాల్లో భాగం కావాలని, సమాజంలో చురుగ్గా పాల్గొనాలని ప్రోత్సహిస్తోంది.

మహిళలకు ప్రభుత్వాలు చాలా రకాల రాయితీలు అందిస్తున్నాయి. ఇల్లు కొనే విషయంలో కూడా మహిళలకు ప్రత్యేక నిబంధనలు, ప్రయోజనాలు ఉన్నాయి. ఇంటిపై పన్ను కట్టేటప్పుడు మహిళలకు రాయితీలు లభిస్తాయి. కాబట్టి, కొత్త ఇంటిని కొనుగోలు చేయాలనుకుంటే, దాన్ని మీ భార్య పేరు మీద కొనేలాగా చూసుకోవాలి. దీనివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

హోమ్ లోన్‌పై తక్కువ వడ్డీ

మహిళలకు రుణాలు ఇవ్వడంలో కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. పురుషులతో పోలిస్తే మహిళలకు అధిక ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే లోన్ తీసుకుని ఇల్లు కొనాలనుకుంటే భార్య పేరు మీద కొనడం చాలా మంచిది. చాలా బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు మహిళలకు పురుషుల కంటే తక్కువ వడ్డీ రేటుతో లోన్లు ఇస్తున్నాయి. ఈ బ్యాంకులు, కంపెనీలు మహిళల కోసం ప్రత్యేకమైన స్కీములు కూడా ఆఫర్ చేస్తున్నాయి. భర్త తన భార్య పేరు మీద హోమ్ లోన్‌కు అప్లై చేస్తే, తక్కువ వడ్డీ రేటుకే లోన్ లభిస్తుంది. దీంతో డబ్బు ఆదా చేయవచ్చు. కొన్ని బ్యాంకులు మహిళా దరఖాస్తుదారులకు 1% వరకు ఎక్స్‌ట్రా డిస్కౌంట్ ఆఫర్ చేస్తాయి. మహిళలకు లోన్లు సులభంగా మంజూరు అవుతాయి.

స్టాంప్ డ్యూటీలో ఎగ్జమ్షన్

ఇల్లు కొనడానికి చాలా డాక్యుమెంట్స్‌ అవసరం. ఆ ఇంటిని యజమాని పేరు మీద రిజిస్టర్ చేయాలి. హౌస్ రిజిస్టర్ చేయాలంటే స్టాంప్ డ్యూటీ అనేది చెల్లించాలి. ఈ స్టాంప్ డ్యూటీ అమౌంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో మహిళలు పురుషుల కంటే తక్కువ స్టాంప్ డ్యూటీ చెల్లిస్తే సరిపోతుంది. సాధారణంగా మహిళలకు పురుషుల కంటే 2 నుంచి 3 శాతం వరకు తక్కువ స్టాంప్ డ్యూటీ ఉంటుంది. ఉదాహరణకు, ఢిల్లీలో పురుషులు 6 శాతం స్టాంప్ డ్యూటీ చెల్లించాలి, అయితే మహిళలు కేవలం 4 శాతం మాత్రమే చెలిస్తే చాలు. అదే విధంగా, ఉత్తరప్రదేశ్‌లో పురుషులు 7 శాతం చెల్లించాలి, మహిళలు మాత్రం 5 శాతం చెల్లించాలి. మహిళలు ఇల్లు కొని అందులోనే నివసిస్తే వారికి ఎక్స్‌ట్రా ట్యాక్స్ డిడక్షన్స్ లభిస్తాయి. ఇల్లు కొనడానికి తీసుకున్న లోన్ మీద ఏటా చెల్లించే వడ్డీపై ఏడాదికి రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ డిడక్షన్స్ పొందవచ్చు. సెక్షన్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి.

2024-09-07T11:33:01Z dg43tfdfdgfd