భార్యాభర్తలు ఇలా చేస్తే డబ్బుకి కొదవే ఉండదు

ప్రతి ఒక్కరికీ డబ్బు అవసరమే. దాని గురించి గొడవలు రాకుండా ఉండాలంటే కపుల్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకోండి.

డబ్బుది ఏముంది అని చాలా మంది దానిని తక్కువ చేసి మాట్లాడతారు. కానీ, డబ్బు ప్రతి ఒక్కరి జీవితంలో కీ రోల్ పోషిస్తుంది. డబ్బు ఉంటేనే ఏ రిలేషన్ అయినా ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. ఆనందంగా బతకడానికి డబ్బు మాత్రమే కారణం కాకపోయినా.. డబ్బు కూడా ఓ రీజన్. ఈ డబ్బు లేకపోవడం వల్ల చాలా సార్లు గొడవలు వస్తాయి. మరి అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కపుల్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి. గోల్స్ గురించి మాట్లాడండి..

డబ్బు విషయంలో ముందుగా పార్టనర్‌తో కూర్చుని మీ డ్రీమ్స్ గురించి మాట్లాడండి. ఇల్లు, భూమి, కారు, జ్యువెలరీ ఇలాంటి విషయాల గురించి ముందుగానే మాట్లాడి వాటిని సాకారం చేసుకోవాలంటే డబ్బుని ఎలా ఆదా చేయాలో ప్లాన్ చేసుకోండి.

బడ్జెట్..

మనకి వచ్చే ఆదాయం, అయ్యే ఖర్చుల గురించి నెలవారీ బడ్జెట్ వేసుకోండి. దేనికి ఎంత ఖర్చు చేయాలో ముందుగానే ప్లాన్ చేసుకోండి. రెంట్, కరెంట్, ఈఎమ్ఐ ఇలా ప్రతినెల మీకు ఉన్న ఖర్చులని తీసి పక్కనపెట్టండి. మిగిలిన డబ్బుని సేవ్ చేసే విధంగా ప్లాన్ చేసుకోండి.

మన ఖర్చుల కోసం..

అయితే పొదుపు చేయమన్నాం కదా అని ఉన్న డబ్బు మొత్తం పొదుపు మాత్రమే చేయొద్దు. కొన్ని వ్యక్తిగత ఖర్చులు వాటిని మీరిద్దరు కూర్చుని మాట్లాడుకుని ఖర్చు చేయండి. దీని వల్ల మీ ఇద్దరి మధ్య నాకేం ఖర్చు చేశావ్ అన్న మాట రాకుండా, గొడవ కాకుండా ఉంటుంది.

ఎమర్జెన్సీ..

అన్ని ఖర్చులు ఉన్నట్లుగానే భవిష్యత్‌లో ఎప్పుడు ఏం సమస్య వస్తుందో తెలియదు. అలాంటి అవసరాలను ముందుగానే గుర్తించి ప్రతి నెల కొంత డబ్బుని సేవ్ చేసుకోండి. దీనిని ఏ కారణం చేత ఆపొద్దు.. మధ్యలో ఏ సమస్య వచ్చినా ఈ డబ్బు మీకు ధైర్యాన్నిస్తుందని గుర్తుపెట్టుకోండి.

ఇద్దరి బాధ్యత..

రిలేషన్‌షిప్ అంటే ఇద్దరి బాధ్యత.. హ్యాపీ లైఫ్ కోసం ఇద్దరు కలిసి కష్టపడాలి. అంతేకానీ, ఒక్కరే బ్రతుకు బండిని లాగాలనుకోవద్దు. కుటుంబ బాధ్యతలను పంచుకోండి. దీని వల్ల ఇద్దరి మధ్య రిలేషన్ బాగుంటుంది.

​​Read More : Relationship News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-09-16T13:11:44Z dg43tfdfdgfd