ముసలోనికి దసరా పండగ.. అందమైన యువతితో పెళ్లి.. ఇక, వీళ్ల వేషాలైతే అసలు భరించలేం!

జంట ఈడుజోడు బాగా కనిపించాలంటే వారి మధ్య వయసు తేడా చాలా తక్కువగా ఉండాలని ఎవరైనా అనుకుంటారు. మనదేశ వివాహ వ్యవస్థలో పురుషుడి కంటే మహిళల వయసు కొద్దిగా తక్కువగా ఉంటుంది. అలా ఉన్నప్పుడే ఆదర్శ జంటగా భావిస్తారు. అయితే ఈమధ్య కాలంలో ఎవరూ వయసు అంతరాలను పట్టించుకోవట్లేదు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియోలోని జంటను పరిశీలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే వారి మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. తాతా, మనవరాలు మాదిరిగా కనిపిస్తున్న ఈ జంటను చూస్తే.. భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ గురించి చర్చకు దారితీసేలా ఉంది.

వైరల్ వీడియోలోని జంటను గమనిస్తే వయసును అసలు పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదు. భర్త 70 ఏళ్ల వృద్ధునిలా కనిపిస్తుంటే, అతని భార్య 20 ఏళ్ల పడుచు పిల్లలా ఉంది. తాత మనవరాలి మాదిరిగా కనిపిస్తున్న ఈ ఇద్దరికి ఏ లెక్కన పెళ్లి చేశారో అర్థం కావడం లేదు. వీడియోను పరిశీలిస్తే.. ఈ జంటను చూడటానికి కంటికి ఇంపుగా ఉన్నప్పటికీ, వారు మాత్రం అన్నోన్యంగా జీవిస్తున్నట్లు తెలుస్తోంది. పెళ్లి చేసుకుని కలిసి జీవించడానికి వయసుతో సంబంధం లేదని, మనసులు కలిస్తే చాలన్నట్లు వారి తీరు ఉంది.

* వీడియోలో ఏముందంటే..?

ఈ వీడియోలో 18-20 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయి నీలిరంగు చీర కట్టుకుని చూడముచ్చటగా కనిపిస్తోంది. ఆమె వెనుక ఒక వ్యక్తి నిలబడ్డాడు. నెరిసిన గడ్డం, బట్టతలతో వృద్ధుడిలా ఉన్నాడు. వాళ్లను చూస్తే మొదట్లో ఎవరైనా తండ్రి-కూతురు లేదా తాత-మనవరాలు అనుకుంటారు. అయితే వీడియోలో ఫ్లే అవుతున్న పాటకు ఆ అమ్మాయి లిప్ సింక్ చేస్తూ పాడటంతో వారు భార్యాభర్తలని అర్థమవుతుంది. ఆమె పాడుతుంటే వెనకున్న ఆమె భర్త మొహంలో ఆనందం కనిపిస్తుంది. వీడియో క్లిప్ మీద హస్బెండ్ అండ్ వైఫ్ అనే టెంప్లేట్ కూడా ఉంటుంది. వారు కపుల్స్ అని చెప్పడానికి ఇది ఒక సంకేతం.

* భారీగా లైక్స్, వ్యూస్

‘ఇట్స్ మి టింకు రాయ్’ (@itz____me_tiku__roy) అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ అయిన ఈ వీడియో తాజాగా వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 11 మిలియన్లకు పైగా వ్యూస్, రెండు లక్షల కంటే ఎక్కువ లైక్స్‌ను సొంతం చేసుకుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆసక్తికరంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరి మధ్య వయసు అంతరం భారీగా ఉండటంతో ఈ జంటకు అన్యాయం జరిగిందని కొందరంటే.. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఈ వీడియోను క్రియేట్ చేశారని, వారు అసలు భార్యాభర్తలే కాదని మరికొందరు కామెంట్ చేశారు.

2024-09-13T12:20:25Z dg43tfdfdgfd