మగవారికి ఈ లక్షణాలు ఉంటే ఆడవారికి చాలా ఇష్టం

ఒకరిని ఇష్టపడేందుకు వారి గుణాలే ముఖ్య కారణం. కొంతమంది మహిళలు ఓ పురుషుడిని ఇష్టపడేందుకు వారిలోని గుణాలు కారణం. అవి ఎలా ఉంటే నచ్చుతాయో తెలుసుకోండి.

కొంతమంది మొదటిచూపులోనే ప్రేమలో పడతారు. మరికొంతమంది అలా కాదు పరిచయమై ఎక్కువ రోజులు అయ్యాక వారి గురించి అర్థం చేసుకుని వారి గుణగణాలు తెలుసుకుని ఇష్టపడతారు. అలా మగవారిలో ఎలాంటి గుణాలని చూసి ఆడవారు ఇష్టపడతారో తెలుసుకోండి. టైమ్ స్పెండ్ చేయడం..

ఏ రిలేషన్‌లో అయినా సమస్యలు రావడానికి ముఖ్య కారణం వారితో సరైన సమయాన్ని స్పెండ్ చేయకపోవడం. ముఖ్యంగా ఆడవారు తమ ఫ్రెండ్, లవర్, భర్త ఎవరైనా సరే వారితో టైమ్ స్పెండ్ చేయాలని కోరుకుంటారు. మగవారు ఎంత బిజీగా ఉన్నా సరే.. వారికోసం టైమ్ స్పెండ్ చేసే మగవారిని ఎక్కువగా ఇష్టపడతారు.

సాయం చేసేవారిని..

ఇంటిపనులైనా, వేరే పనులైనా సరే ఏవైనా సరే అన్నీ పనులని సొంతంగా చేసుకునే తెలివితేటలు ఆడవారికి ఉంటాయి. అయితే, వారు చేసే పనులని మగవారు గౌరవించాలని ఆడవారు కోరుకుంటారు. వారు చేసే పనుల్లో ఏవైనా సమస్యలొస్తే వాటన్నింటినీ దగ్గరుండి మేనేజ్ చేసే మగవారిని ఎక్కువగా ఇష్టపడతారు ఆడవారు.

లీడర్‌షిప్..

మహిళలు వారి పనులకి బాధ్యత వహించే, వారు నమ్మిన ఏ విషయాన్నైనా ముందుకు తీసుకెళ్ళే మగవారంటే ఆడవారికి ఎక్కువ ఇష్టం.

వాయిస్..

ఆడవారు ఎంత స్వీట్‌గా మాట్లాడితే మగవారికి ఇష్టమో.. మగవారు కూడా వాయిస్‌పై కూడా ఆడవారికి ఓ రకమైన క్రష్ ఉంటుంది. వారు వినడానికి వినసొంపుగా ఉండే వాయిస్ ఉంటే ఆడవారికి ఇష్టం. ఇందులో వారు మాట్లాడే మాటలు కూడా కలుస్తాయి. వారు మాట్లాడే మాటలు వీరిని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయి.

ప్రతీ విషయాన్ని షేర్ చేసుకోవడం..

సాధారణంగా ఆడవారు చాలా ఓపెన్‌గా ఉంటారు. వారికి సంబంధించిన ప్రతీ విషయం తమ పార్టనర్‌కి తెలియాలనుకుంటారు. అలానే వారి పార్టనర్ కూడా ప్రతీ విషయాన్ని తమకి చెప్పాలని కోరుకుంటారు. ఏ విషయాన్ని దాచొద్దనుకుంటారు. అయితే, ఇది కేవలం ప్రేమ, పెళ్ళికి మాత్రమే కాదు. స్నేహానికి కూడా వర్తిస్తుంది. ఫ్రెండ్స్ కూడా తమతో ఓపెన్‌గా ఉండాలని కోరుకుంటారు.

మాట్లాడి సాల్వ్ చేసుకోవడం..

రిలేషన్‌షిప్ బ్రేక్ అవ్వడానికి ముఖ్య కారణాల్లో ఒకటి ఏదైనా సమస్య వచ్చినప్పుడు గొడవపడి విడిపోవడం. కానీ, చిన్న చిన్న గొడవలకే విడిపోవడం సరికాదు. సమస్య చిన్నదైనా, పెద్దదైనా కూర్చుని మాట్లాడి సాల్వ్ చేసే మగవారంటే ఆడవారికి ఇష్టం. అలాంటి మగవారిని ఎక్కువగా ఇష్టపడతారు.

​Read More : Relationship News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-09-10T13:09:29Z dg43tfdfdgfd