మహిళల అందానికి ఇంటి చిట్కాలు.. ఈ 5 జాగ్రత్తలు పాటిస్తే అద్భుతాలే..!

ఆడవాళ్లు మొటిమల తర్వాత ఎక్కువగా ఇబ్బంది పడే సమస్య అవాంఛిత రోమాలు. కొంతమందికి ముఖంపై, పెదవుల పైన, గడ్డం మీద వెంట్రుకలు (Facial hair) పెరుగుతాయి. దీంతో మగువల అందం దెబ్బతింటుంది. వాటిని తొలగించుకున్నా మళ్లీ పెరుగుతాయి. వంశపారంపర్య లక్షణాలు, హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఆడవాళ్లకు ముఖం మీద వెంట్రుకలు రావచ్చు. సాధారణంగా వీటిని తొలగించడానికి త్రెడింగ్, వాక్సింగ్, లేజర్ ట్రీట్‌మెంట్స్ వంటి మార్గాలు ఉన్నాయి. కానీ ఇవి ట్రై చేస్తే బాగా నొప్పి ఉంటుంది. ఇవి కాకుండా కొన్ని ఇంటి చిట్కాలతోనే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆ నేచురల్ హోమ్ రెమిడీస్ ఏవో చూద్దాం.

టర్మరిక్ పేస్ట్

పసుపు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఫేషియల్ హెయిర్‌ను తొలగించగలదు. ఒక గిన్నెలో కొద్దిగా పసుపు, నీళ్లు లేదా పాలు కలిపి మెత్తని పేస్ట్‌లా తయారు చేయాలి. దీన్ని ముఖంపై వెంట్రుకలు ఉన్న చోట సున్నితంగా రుద్ది మర్దన చేయాలి. 15-20 నిమిషాలు అలానే ఉంచాలి. పొడిగా మారిన తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. రెగ్యులర్‌గా ఇలా చేస్తే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.

నిమ్మరసం, చక్కెర

నిమ్మరసంలో చక్కెర కలిపి, దాన్ని ముఖంపై అవాంఛిత రోమాలపై అప్లై చేయాలి. అది బాగా ఆరిన తర్వాత తీసేస్తే, ఫేషియల్ హెయిర్ కూడా ఊడిపోతుంది. ముందు చక్కెర వెంట్రుకలకు అతుక్కుపోతుంది. ఈ మిశ్రమాన్ని తీసేటప్పుడు వెంట్రుకలు కూడా వెంటనే ఊడి వస్తాయి.

శనగపిండి, రోజ్ వాటర్ మాస్క్

శనగపిండిలో రోజ్ వాటర్ మిక్స్ చేసి, దాన్ని ముఖానికి మాస్క్‌లా వేసుకోవచ్చు. ముఖ్యంగా ఫేషియల్ హెయిర్‌ ఉన్న చోట దీన్ని అప్లై చేసి, 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి. తరచుగా ఇలా చేస్తే ముఖంపైన వెంట్రుకలు మాయమవుతాయి, అంతేకాదు స్కిన్‌ చాలా బ్రైట్‌గా తయారవుతుంది.

బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్: ఆగస్టు నెలలో బోలెడన్ని హాలిడేస్.. ఇదిగో లిస్ట్

అరటి, ఓట్స్‌

అరటి, ఓట్స్ రెండూ చర్మ ఆరోగ్యానికి మంచివి. ఈ రెండింటిని కలిపి ఫేస్ ప్యాక్ చేసుకుంటే చర్మం అందంగా తయారవుతుంది. ఓట్‌మీల్ చర్మాన్ని సాఫ్ట్‌గా చేసి, ఎక్స్‌ట్రా ఆయిల్‌ను తొలగిస్తుంది. ఓట్స్ ఒక రకమైన స్క్రబ్‌లాగా పనిచేస్తూ చర్మం మీద ఉన్న డెడ్ సెల్స్‌ను తొలగిస్తాయి. ఓట్స్‌లో సపోనిన్లు ముఖం మీద ఉన్న చిన్న వెంట్రుకలను రిమూవ్ చేస్తాయి. ఇది మంచి స్కిన్ ఎక్స్‌ఫోలియేటర్‌గా పని చేస్తుంది. అరటిపండ్లలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి తేమను ఇచ్చి, స్కిన్‌ను స్మూత్‌గా మార్చేస్తాయి. ఇవి రెండూ కలిపి వాడితే మంచి ప్రయోజనాలు ఉంటాయి.

తేనె, పంచదార

చక్కెర చర్మాన్ని తేమగా ఉంచుతూనే చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. తేనె చర్మానికి పోషణను, తేమను అందిస్తుంది, డెడ్ స్కిన్ సెల్స్, ఫేషియల్ హెయిర్‌ను రిమూవ్ చేస్తుంది. చక్కెర, తేనె కలిపి ఫేస్ ప్యాక్‌గా అప్లై చేసుకుంటే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.

2024-07-27T10:04:05Z dg43tfdfdgfd