మీ టైమ్ బాలేదా? ఈ అమ్మవారికి దర్శిస్తే.. మీకు తిరుగుండదు, అనుకున్నవన్నీ నెరవేరాల్సిందే!

విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం కేంద్రంలో చీపురుపల్లి గ్రామ దేవతగా పేరు పొందిన శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు గురించి లోకల్18 ప్రత్యేక కథనం. పూర్వం ఒక భక్తురాలు కలలో కనిపించిన అమ్మవారు ''రైలు పట్టాలు పక్కన పొలాల్లో ఉన్నాను. ఎద్దుల బండిపై తీసుకెళ్లి ఎద్దుల బండి ఎక్కడ ఆగితే అక్కడ నాకు ఆలయం నిర్మాణం చేపట్టమని'' భక్తురాలతో చెప్పారు. అప్పటి గ్రామ పెద్దలు చొరవతో గ్రామ ప్రజలు అమ్మవారికి ఆలయం నిర్మాణం చేపట్టారు. అప్పటి నుండి గ్రామానికి మంచి జరుగుతుంది అని గ్రామ ప్రజలు నమ్మకం.

ప్రతి ఆదివారం, మంగళవారం ఈ ఆలయంకు భక్తులు పోటెత్తుతారు. ఇక్కడ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం దాటిన తర్వాత ఆదివారం, సోమవారం, మంగళవారం మూడు రోజులు పెద్ద ఎత్తున భారీ జాతర జరుగుతుంది. ఈ జాతర ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు గ్రామస్తులు సాకారంతో జరుపుతారు. ఈ జాతరను ''శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర''గా పిలుస్తారు. ''ఉత్తర ఆంధ్ర జాతర''గా పిలుస్తారు.

కష్టపడకుండా ఈజీగా రోజుకు రూ.2,000 సంపాదించండిలా!

---- Polls module would be displayed here ----

విశాఖపట్నం జిల్లా నుండి, శ్రీకాకుళం జిల్లా నుండి భక్తులు, ప్రజలు ఈ జాతరకు వస్తారు. రోజు నిత్య అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తారు అని ఆలయ అర్చకులు లోకల్18 తో చెప్పారు. భక్తులు తాము కోరుకున్న కోరికలు నెరవేరటంతో ఇక్కడ పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకుంటారన్నారు. సంతానం లేని వారికి పిల్లలు, పెళ్లికాని వారికి పెళ్లిళ్లు.. ఇతర సమస్యలతో బాధ పడుతున్న వారికి వారి సమస్యలు పరిష్కారం అవుతున్నాయని భక్తులు చెబుతున్నారు. మరేందుకు ఆలస్యం మీరు కూడా మీ సమస్యను అమ్మవారికి చెప్పుకోండి.. సమస్యను తీర్చుకుని హాయిగా ఉండండి అని అర్చకులు చెబుతున్నారు.

2024-09-15T07:51:14Z dg43tfdfdgfd