మీ పార్టనర్ ఇలా చేస్తే మరో ఎఫైర్ ఉన్నట్లేనట..

ఈ మధ్యకాలంలో చాలా మంది ఎఫైర్స్ పెట్టుకుంటున్నారు. దీని వల్ల చాలా మంది కాపురాలు కూలిపోతున్నాయి. దీని గురించి కొన్ని వివరాలు తెలుసుకోండి.

కొన్నిసార్లు మన పార్టనర్ మన చుట్టూనే ఉంటూ మనకి తెలియకుండా వేరేవారితో క్లోజ్‌గా ఉంటారు. ఇది మరీ విడాకుల వరకూ వచ్చేవరకూ తెలియదు. అలాంటప్పుడు ఏం చేసి సమస్య రాకుండా ముందునుంచి ఏం చేయొచ్చో, అక్రమ సంబంధాలు పెట్టుకున్నవారు ఎలాంటి ప్రవర్తిస్తారో తెలుసుకోండి. ఇంట్రెస్ట్ లేకపోవడం..

ఎఫైర్ పెట్టుకున్నప్పుడు ముందుగా పార్టనర్ చేసేది.. రిలేషన్‌పై ఇంట్రెస్ట్ లేకపోవడం. మన పార్టనర్‌ని ముందుగా చూసినట్లుగా చూసుకోలేరు. వారు ఎంత బాగా ఉన్నా ఏ విషయంలో కూడా పట్టించుకోకపోవడం చేస్తారు.

ఫోన్‌తో గడపడం..

అదే విధంగా, ఎక్కువగా ఫోన్‌తోనే కాలాన్ని గడుపుతారు. చాట్ చేయడం, సోషల్ మీడియాలో ఉండడం ఇలాంటివన్నీ ఫోన్‌లోనే చేస్తూ బిజీగా ఉంటారు. అంతేకాకుండా ఫోన్‌ని కూడా ప్రైవసీగా పెడతారు. మొబైల్ లాక్ చేస్తారు. కాల్, బ్రౌజింగ్ హిస్టరీని డెలీట్ చేస్తారు. ​Also Read : ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటే ఈ సమస్యలు వస్తాయట.. జాగ్రత్త..

పంచుకోకపోవడం..

వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేసుకోరు. ఎప్పుడు ఒంటరిగా ఫోన్‌తో అలానే ఉండిపోతారు. ముక్కుసూటిగా ఏ విషయాన్ని చెప్పరు. అబద్ధాలు చెప్పడం కూడా చేస్తారు. ఏ విషయంలోనూ నిజాలు చెప్పడానికి ఇష్టపడరు.

మేకప్..

అదే విధంగా, వారు ఎప్పుడు కూడా మేకప్ అవ్వడానికి ప్రియారిటీ ఇస్తారు. డ్రెస్సెస్‌ని మార్చడం, దువ్వుకోవడం ఇంతకు ముందు లేనంతగా తయారవ్వడం వంటివి చేస్తారు. ​Also Read : ఈ 5 ఫాలో అయితే భార్యాభర్తల మధ్య గొడవలు చాలావరకూ తగ్గుతాయి..

హడావిడి..

అదే విధంగా, హడావిడిగా ఉంటారు. అప్పటికప్పుడు రెడీ అయి వెళ్ళిపోవడం, ఆలస్యంగా ఇంటికి రావడం, వీకెండ్స్, సెలవుల్లోనూ బిజీబిజీగా ఉండడం చేస్తారు. ​​​గమనిక : ఈ కథనాలు ఆ వ్యక్తులు పంచుకున్న అనుభవాలను మాత్రమే తెలియజేస్తుంది. ఇది ఎవరినీ ఉద్దేశించినది కాదు. పాఠకులు ఈ విషయాన్ని గమనించగలరు.​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​Read More : Relationship News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-28T11:47:06Z dg43tfdfdgfd