రెండో పెళ్లి చేసుకున్నందుకు నాకు ఇలా జరగాల్సిందే.. స్వప్న దెబ్బకు తలపట్టుకున్న శ్రీధర్!

Karthika Deepam 2 September 7th: ఈరోజు ఎపిసోడ్‌లో... జ్యోత్స్న వచ్చి కార్తీక్ కు తనకు పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయినట్టు దీపకు చెప్తుంది. మంచి విషయం చెప్పావు అని దీప అంటే నీ గుండెల్లో మండుతున్నట్టు నాకు తెలుసు అని మనసులో అనుకుంటుంది. నా పెళ్లి నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అని అంటే నేనే వంట చేస్తానని అంటుంది. ఆమాటకు మీరు శ్రేయోభిలాషిలా రావాలి వంటమనిషిలా కాదు అని చెప్పి అక్కడనుంచి వెళ్ళిపోతాడు.. మరో సీన్ లో స్వప్నకు శ్రీకాంత్ కు పెళ్లి ఫిక్స్ చేస్తే ఆమె శ్రీధర్ తో ససేమీరా చేసుకోనని చెప్పేస్తుంది. నేను ప్రేమించినవాడిని తప్ప మరెవరిని పెళ్లి చేసుకోనని చెప్తుంది.

ఆ మాటకు శ్రీధర్ ససేమీరా కుదరదు అని అనడంతో స్వప్న అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అందుకు కావేరి కూడా నా కూతురుకు నేను చెయ్యలేని పని చెప్పలేను అని వెళ్ళిపోతుంది.. రెండో పెళ్లి చేసుకున్నందుకు నాకు ఇలా జరగాల్సిందే అని అనుకుంటూ మీరు ఎవరు ఏం అనుకున్నా సరే.. స్వప్న జీవితం బాగుండాలంటే శ్రీకాంత్ తోనే పెళ్లి చెయ్యాలి అని ఖచ్చితంగా చేస్తాను అని అనుకుంటాడు. ఆతర్వాత జ్యోత్స్న బ్యాచిలర్ పార్టీ చేసుకుంటుండగా వాళ్ళ ఫ్రెండ్స్ కార్తీక్ ని పార్టీకి పిలవాలి అని అతను రాలేదంటే నువ్వంటే కార్తీక్ కు ఇష్టం లేదని అర్ధం అని అనడంతో ఆమె ఏం చెయ్యలేక కార్తీక్ ను పిలుస్తుంది.

మరోవైపు నరసింహ ఒక ఆమెను దీప ఇంటికి పంపించి వాళ్ళ ఇంట్లో ఓ ఫంక్షన్ జరుగుతున్నట్టు ఆ ఫంక్షన్ కు వంట చెయ్యడానికి రావాలని చెప్తుంది.. అక్కడే ఉన్న అనసూయ కాస్త అనుమానం వ్యక్తం చెయ్యడంతో ఆమె దీపకు అడ్వాన్స్ ఇచ్చి వెళ్తుంది.. దాంతో దీప శౌర్య, అనసూయకు ఆ డబ్బులు ఇచ్చి బట్టలు కొనుక్కోమని చెప్పి వెళ్తుంది.. మరోవైపు కార్తీక్ కూడా జ్యోత్స్న బ్యాచిలర్ పార్టీకి బయల్దేరగా అదే దారిలో వెళ్తున్న వంటలక్కను చూసి ఆమె చెప్పిన అడ్రెస్ కు తీసుకెళ్లి డ్రాప్ చేస్తాడు.

అక్కడకు వెళ్లిన దీపకు ఫంక్షన్ ఏర్పాట్లు కనిపిస్తాయి కానీ అక్కడ మనుషులు ఎవరు కనిపించరు. దాంతో ఎవరు లేరు ఏంటి అంటే ఫంక్షన్ ఇక్కడ కాదమ్మా అని ఇక్కడ వంటలు చేసి తీసుకెళ్లాలి అని చెప్తుంది. దాంతో కన్విన్స్ అయినా దీప వంట చెయ్యడానికి సిద్ధపడుతుంది. మరోవైపు జ్యోత్స్న ఫ్రెండ్స్ నీ బావ ఇంకా రాలేదని అనడంతో తప్పక కార్తీక్ కు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు బావ అని అడుగుతుంది. పది నిమిషాల్లో అక్కడ ఉంటాను అని చెప్తాడు. అయితే కారులో వంటలక్క ఫోన్ మర్చిపోయింటుంది. అప్పుడే ఫోన్ రావడంతో ఎవరి ఫోన్ ఇది అని చూస్తే దీప ఫోన్ అని గుర్తించిన కార్తీక్ ఆ ఫోన్ ఇవ్వడానికి వెనక్కు వెళ్తాడు.. అంతటితో సీరియల్ ఎపిసోడ్ పూర్తవుతుంది.

2024-09-07T01:47:52Z dg43tfdfdgfd