రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి?

బాదం పప్పులు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేసత్ాయి. వీటిని తినడం వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాలు అందుతాయి. అయితే ఆరోగ్యంగా ఉండేందుకు రోజుకు ఎన్ని బాదం పప్పులను తినాలో తెలుసా? 

బాదం గింజలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బాదం పప్పుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ ఇ, రాగి, మాంగనీస్,భాస్వరం పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా ఎంతో సహాయపడతాయి. 

 

మనం బాదం పప్పులను ఎన్నో రకాలుగా తినొచ్చు. వీటిని స్నాక్స్ గా లేదా నానబెట్టి తినొచ్చు. చాలా మంది బాదం పప్పులను డెజర్ట్లు, ఫుడ్ లో వేసి తింటుంటారు. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం వీటిని మోతాదుకు మించి అస్సలు తినకూడదు. అసలు హెల్తీగా ఉండాలంటే రోజుకు ఎన్ని బాదం పప్పులను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

 

హెల్త్ లైన్ నివేదిక ప్రకారం.. ఒక ఔన్సు బాదంలో 165 కేలరీలు, 6 గ్రాముల ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. అంటే గుప్పెడు బాదం పప్పులను రోజంతా తినొచ్చు. ఈ పరిమాణం ఒక రోజుకు సరిపోతుంది. అలాగే ఇది మన శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలను అందిస్తుంది. ఇంత మొత్తంలో బాదం పప్పులను తినడం వల్ల అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

 

హెల్త్ లైన్ నివేదిక ప్రకారం.. బాదం పప్పుల్లో మెగ్నీషియం కూడా మంచి మొత్తంలో ఉంటుంది. ఈ మెగ్నీషియం మెటబాలిక్ సిండ్రోమ్, టైప్ 2 డయాబెటిస్ ను మెరుగుపర్చడానికి ఎంతో అవసరపడుతుంది. నిజానికి మెగ్నీషియం ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. రోజూ 56 గ్రాముల బాదం పప్పులను తినడం వల్ల మెగ్నీషియం రోజువారీ మోతాదులో సగం ఉంటుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

 

మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగినప్పుడు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయితే బాదం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ మొత్తాన్ని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. రోజూ 42 గ్రాముల బాదం పప్పులను తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని అధ్యయనంలో తేలింది. రోజూ ఒకటి నుంచి రెండు గుప్పెడు బాదం పప్పులు తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇంతకు మించి బాదం పప్పులను తింటే ప్రయోజనాలకు బదులుగా నష్టాలను చూస్తారు.

2024-05-02T10:10:43Z dg43tfdfdgfd