రోజూ పడుకునే ముందు ఈ ప్యాక్ రాస్తే మీ ముఖం మెరిసిపోద్ది..

స్కిన్ కాంతివంతంగా మెరవాలని ఎవరికీ మాత్రం ఉండదు చెప్పండి. అందుకోసం రాత్రిపూట ఓ ఫేస్‌ప్యాక్ వేస్తే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఆ ప్యాక్ గురించి తెలుసుకోండి.

మొటిమలు, మచ్చలు లేని ముఖాన్ని చాలా మంది కోరుకుంటారు. దీని కోసం రాత్రిపూట పడుకునే ముందే కొన్ని పనులు చేయాలి. దీని వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి. అందులో ముఖ్యంగా మేకప్ క్లీన్ చేసి ముఖాన్ని వాష్ చేసుకోవడం వల్ల స్కిన్ రీఫ్రెష్‌గా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత్ ఎక్స్‌ఫోలియేట్ చేసి ఓ మాస్క్ కూడా వేయాలి. ఆ మాస్క్ ఏంటి? ఎలా తయారు చేయాలి? ఏమేం పదార్థాలు కావాలో తెలుసుకోండి. పసుపు..

పసుపుని చాలా మంది ఫేస్‌ప్యాక్స్‌లో వాడతారు. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, కర్కుమిన్ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. దీనిని రాయడం వల్ల చర్మ మంట తగ్గడమే కాకుండా చర్మం యవ్వనంగా మెరుస్తుంది.

చర్మాన్ని మెరిపించే స్క్రబ్..​ ​

రోజ్ వాటర్..

రోజ్ వాటర్ కూడా మంచి టోనర్. దీనిని వాడడం వల్ల చర్మం మెరుస్తుంది. రోజ్ వాటర్‌లో యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి. దీనిని రాత్రిపూట ముఖానికి రాస్తే చర్మం క్లీన్ అవుతుంది. దీని వల్ల నల్లని వలయాలు దూరమవుతాయి. ​Also Read : మొటిమలు, మచ్చలు తగ్గట్లేదా.. ఈ ప్రోడక్ట్స్ వాడండి..

అలోవెరా జెల్..

అలోవెరా జెల్ స్కిన్‌కి కావాల్సిన హైడ్రేషన్‌ని అందిస్తుంది. దీనిని రాయడం వల్ల పొడి చర్మం తగ్గి మొటిమలు కూడా తగ్గుతాయి. చర్మ సమస్యల్ని దూరం చేస్తుంది. అలోవెరా చర్మ రంగుని మెరుగ్గా చేసి సన్ టాన్, నల్ల మచ్చల్ని దూరం చేస్తుంది. ​Also Read : దోసరసంలో వీటిని కలిపి ముఖానికి రాస్తే మచ్చలు తగ్గి మెరుస్తుంది..

ప్యాక్ ఎలా వేయాలంటే..

ముందుగా 2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్‌ని ఓ కప్పులోకి తీసుకుని అందులోనే పావు టీ స్పూన్ పసుపు, అరకప్పు రోజ్ వాటర్ వేసి బాగా కలపండి. దీనిని గాలి చొరబడని కంటెయినర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో స్టోర్ చేయండి. దీనిని రోజు రాత్రి పడుకునే ముందు రాస్తే చర్మంపై ఉన్న మచ్చలు, ముడతలు తగ్గి స్కిన్ మెరుస్తుంది. గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More : Beauty News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-29T07:15:51Z dg43tfdfdgfd