వయస్సును రివర్స్ చేయొచ్చు - నమ్మడం లేదా? తన ఏజ్‌ను 22 ఏళ్లకు తగ్గించుకున్న ఈ 78 ఏళ్ల డాక్టర్ సీక్రెట్ ఇదే

ప్రపంచ శాస్త్రవేత్తలు దీర్ఘకాలిక యవ్వనంతో పాటు దీర్ఘాయుష్షును ఎలా సాధించవచ్చు అనే అంశం గురించిన ఆలోచనలు, పరిశోధనలలో నిమగ్నమై ఉన్నారు. కానీ క్లీవ్లాండ్ క్లినిక్‌కు చెందిన 78 సంవత్సరాల చీఫ్ వెల్నెస్ ఆఫీసర్ డాక్టర్ మైఖేల్ రోయిజెన్ తన బయోలాజికల్ ఏజ్‌ను 20 ఏళ్ల వరకు తగ్గించుకున్నానని చెబుతున్నారు. ఆయన తన బయోలాజికల్ ఏజ్ కేవలం 57.6 సంవత్సరాలు మాత్రమే అని అంటున్నారు. ఈ క్రెడిట్ తన కఠినమైన పిట్నెస్ నియమాలు, జీవన శైలికే చెందుతుందని కూడా అంటున్నారు.

దీర్ఘాయుష్షు కోసం ప్రయోగాలు చేస్తున్న నిపుణులలో ఒకరు రోయిజెన్. తీరిక లేని జీవనశైలిలో సైతం తప్పనిసరిగా ఆరోగ్యం, ఫిట్నెస్ ను నిర్లక్ష్యం చెయ్యకూడదని చెబుతున్నారు. ఫిట్నెస్‌కు అత్యంత ముఖ్యమైనవి కార్డయోవాస్క్యూలార్ వ్యాయామాలను అత్యంత అంకిత భావంతో క్రమం తప్పకుండా చెయ్యడమేనట. ట్రెడ్మిల్ లేదా ఇండోర్ సైకిల్ పై కార్డియో వర్కవుట్లు వారానికి మూడు సార్లు.. 48 నిమిషాల పాటు చేసేందుకు కేటాయించుకున్నారు. గతంలో ఆయన స్వ్కాష్ కూడా ఇంతే సమయం పాటు ఆడే వారట.

రోయిజెన్ బుధవారం సాయంత్రం, శని, ఆది వారాల్లో తన వర్కవుట్ షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. అయితే ఇవి తన ఇతర సోషల్ ఈవేంట్లను అనుసరించి మార్చుకునే వెసులుబాటు కూడా పెట్టుకున్నారు. ఈ కార్డయో సెషన్ లతో పాటు ప్రతిరోజూ 10,000 అడుగుల నడక కూడా ఆయన లక్ష్యాలలో ఒకటి. దీని కోసం ఆయన ఆఫీసులో కూడా ట్రెడ్మిల్ డెస్క్ ఏర్పాటు చేసుకున్నారట. అంతేకాదు ఆఫీస్ కు ఒక మైలు దూరంలోనే కారు పార్క్ చేసి ఆఫీసు వరకు నడచి రావడం వంటి ప్రణాళికలు కూడా అమలు చేస్తుంటారట.

ఇలాంటి విధానాలు ఆయన్నీ రోజంతా చురుకుగా ఉంచడమే కాదు తీరికలేని రోజుల్లో కూడా తన అడుగుల సంఖ్యకు సంబంధించిన లక్ష్యాన్ని విస్మరించకుండా ఉంచుతాయి. జేరోసైన్స్ లో 2022లో ప్రచురించబడిన ఒక అధ్యయనం నడక ప్రయోజనాలను గురించి రుజువులు కూడా చూపింది. వారానికి 5 రోజుల పాటు 30 నిమిషాల చురుకైన నడక గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడమే కాదు టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. అంతేకాదు నడక మానసిక ఆరోగ్యాన్ని సైతం కాపాడుతుంది. ఆయుష్షు కూడా కచ్చితంగా పెరుగుతుంది.

రోయిజెన్ వారంలో మూడు రోజులు కార్డియో వర్కవుట్లు చేస్తే మరో రెండు రోజుల పాటు వెయిట్ లిఫ్టింగ్ చేస్తారు. కండర నిర్మాణానికి, దీర్గాయువుకు రెసిస్టెన్స్ ట్రెయినింగ్ చాలా అవసరమని ఆయన చెబుతున్నారు. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ లో 2022వ సంవత్సరంలో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం వారానికి 30 నుంచి 60 నిమిషాల పాటు చేసే రెసిస్టెన్స్ ట్రైనింగ్ 17 శాతం మరణ ప్రమాదాన్ని నిరోధిస్తుందట. గుండె జబ్బుల ప్రమాదాన్ని18 శాతం తగ్గిస్తుంది. క్యాన్సర్ బారిన పడే ప్రమాదాన్ని 9 శాతం తగ్గిస్తుంది. రొయిజెన్ చెప్పిన ప్రకారం జీవన శైలిలో మార్పులు చేసుకుని క్రమం తప్పని వ్యాయామాలతో వయసు తగ్గించుకోవచ్చు. దీర్ఘకాలం పాటు ఆయుష్షును పెంచుకోవచ్చు.

Also Read : డిజిటల్ యుగం.. ప్రమాదంలో పిల్లల ‘నిద్ర’ - ఈ పాపం పెద్దవాళ్లదే!

2024-07-27T02:46:31Z dg43tfdfdgfd