హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ రిస్క్‌ల గురించి తెలుసుకోండి

Hair Transplant: ఈ రోజుల్లో జుట్టు రాలే (Hair fall) సమస్య చాలా మందిని వేధిస్తోంది. హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్‌ తలెత్తితే చాలామంది ఆందోళన చెందుతారు. బట్టతల వచ్చి అంద విహీనంగా మారుతామేమో అని భయపడతారు. ఈ సమస్యను అధిగమించడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలోనే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలకు డిమాండ్ పెరిగిపోయింది. 2010-2021 మధ్యకాలంలో యూరప్‌లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు చేయించుకునేవారి సంఖ్య 240 శాతం పెరిగింది. ఇప్పుడు టర్కీలో ఈ రకం సర్జరీలు ఎక్కువగా జరుగుతున్నాయి.

సాధారణంగా రోజూ 50-100 వెంట్రుకలు రాలుతాయి. వాటి స్థానంలో కొత్త వెంట్రుకలు వస్తాయి. వయసు పెరిగే కొద్దీ జుట్టు పెరుగుదల నెమ్మదిస్తుంది. స్కాల్ప్ కింద ఉండే సెబేషియస్ గ్లాండ్స్‌ హెల్తీ ఎయిర్ కోసం కావాల్సిన ఆయిల్ ఉత్పత్తి చేస్తాయి. ఈ గ్రంథులు సరిగ్గా పని చేయకపోతే, హెయిర్ పల్చగా తయారవుతుంది. జుట్టు కుదుళ్లు బలహీనపడిపోతాయి. జుట్టు సన్నగా మారుతుంది. హెయిర్ ఫాల్ సమస్య తలెత్తుతుంది. వెంట్రుకలు పల్చగా తయారు కావడం, బట్టతల రావడం వంటివి చాలా మందికి నచ్చదు. అందుకే వైద్య చికిత్సలు చేయించుకుంటున్నారు.

జుట్టు రాలే సమస్య ఎవరికి ఎక్కువ?

బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలను ఫ్రీగా చేయదు. ఇక్కడ ఈ కాస్మోటిక్ సర్జరీలకు చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి చాలామంది ఇతర దేశాలకు వెళుతున్నారు. అక్కడ కూడా మంచి ఫలితాలు వచ్చాయని చెబుతున్నారు. ఈ ఆపరేషన్ చేయించుకోవాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. అవి లేకుండా చేయించుకుంటే ఉపయోగం ఉండదు. ఆండ్రోజెనిక్ అలోపెసియా అనే జెనెటిక్ హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడేవారికి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ బెస్ట్‌గా నిలుస్తుంది.

ఈ సమస్య ఆడ, మగ ఇద్దరిలో ఉంటుంది. 40 ఏళ్ల కంటే తక్కువ వయస్సు గల మహిళల్లో దాదాపు 10% మందికి, 70 ఏళ్ల వయస్సు గల మహిళల్లో దాదాపు 50% మందికి హెయిర్ ఫాల్ సమస్య వస్తుంది. పురుషుల విషయానికి వస్తే, 50 ఏళ్లకు 30-50% మందికి ఈ సమస్య ఉంటుంది. పురుషుల్లో జుట్టు రాలడం సాధారణంగా ముందు భాగం నుంచి ప్రారంభమై, ‘M’ ఆకారంలో ఉంటుంది. దీన్ని నార్వుడ్ ప్యాటర్న్ అంటారు. ఆడవాళ్లలో తల వెనుక భాగం నుంచి, ముందు భాగం నుంచి జుట్టు పలుచన కావడం జరుగుతుంది. దీన్ని లూడిగ్ ప్యాటర్న్ అంటారు.

అందుబాటులోని చికిత్సలు ఇవే

ఫినాస్టరైడ్ (Finasteride) మెడిసిన్ మగవారిలో హెయిర్ ఫాల్‌కు చెక్ పెడుతుంది. ఫలితం కనిపించడానికి 3-6 నెలల పాటు ఈ మెడిసిన్ వాడాలి. ఈ మందు వాడటం మానేసిన 6-12 నెలల్లోనే ఫలితాలు తగ్గిపోతాయి. మినాక్సిడిల్ (Minoxidil) మెడిసిన్ కూడా జుట్టు రాలే సమస్యకు బెస్ట్ సొల్యూషన్ అవుతుంది. కానీ స్పెషల్ టోపీ ఉపయోగించి లేజర్ చికిత్స చేస్తే ఫలితాలు పెద్దగా ఉండవు.

ఈ ట్రీట్‌మెంట్స్‌ పని చేయకపోతే, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్స్‌ చేయించుకోవచ్చు. ఫోలిక్యులర్ యూనిట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (FUT) లేదా ఫోలిక్యులర్ యూనిట్ స్ట్రిప్ సర్జరీ (FUSS), ఫోలిక్యులర్ యూనిట్ ఎక్సిషన్ (FUE) అనే పద్ధతులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ శస్త్రచికిత్స చేయాలంటే, తల వెనుక భాగం లేదా సైడ్స్ నుంచి హెల్తీ హెయిర్ తీసుకోవాలి.

FUT పద్ధతిలో 1-1.5cm వెడల్పు గల చర్మాన్ని నెత్తిమీద నుంచి తీస్తారు. వెంట్రుకలు, వాటి నిర్మాణాలు ఈ స్కిన్ స్ట్రిప్ నుంచి కలెక్ట్ చేస్తారు. వీటిని బట్టతల ఉన్న ప్రాంతంలో అతికిస్తారు. తర్వాత, తీసిన చర్మం ఉన్న ప్రాంతాన్ని కుట్లు వేసి మూసివేస్తారు. తల వెనుక భాగంలో మచ్చ ఏర్పడుతుంది. ఇది కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది.

FUE సర్జరీ తక్కువ సమయంలో పూర్తవుతుంది. మచ్చలు ఏర్పడే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఎక్కువ హెయిర్ గ్రాఫ్ట్‌లను సేకరించవచ్చు. FUE అనేది ‘బ్లేడ్-ఫ్రీ’, ‘స్కార్లెస్’ అని అంటారు. కానీ ఇందులో పదునైన బ్లేడ్లు ఉపయోగిస్తారు. కొన్ని మచ్చలు సంభవించవచ్చు.

ఫలితాలు ఎలా ఉంటాయి? రిజల్ట్స్

సర్జరీ తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు కనిపిస్తాయి అనేది వ్యక్తిని బట్టి మారుతుంటుంది. ఒక స్టడీ ప్రకారం, సర్జరీ చేయించుకున్న వారిలో 90% మందికి ఒక సంవత్సరం తర్వాత మంచి ఫలితం ఉంటుంది. కానీ నాలుగు సంవత్సరాల తర్వాత హెయిర్ అనేది, మొదటి సంవత్సరాల్లో లాగా కవర్ అయి ఉండదు. మళ్లీ బట్టతల సంకేతాలు కనిపిస్తాయి. వయస్సు, ధూమపానం, తలపై ఎక్కువగా సూర్యకాంతి పడటం, షుగర్ వ్యాధి వంటివి ఫలితాలను ప్రభావితం చేస్తాయి. సర్జరీ తర్వాత రికవరీ సమయం ఎక్కువగా ఉంటుంది. తల వాపు నొప్పి కూడా కలుగుతుంది. అసౌకర్యానికి కూడా గురికావాల్సి రావచ్చు. 10-18 నెలల్లో ఫలితాలు కనిపిస్తాయి సర్జరీ తర్వాత రెండు వారాలు రెస్ట్ తీసుకోవాలి.

2024-09-07T10:03:04Z dg43tfdfdgfd