హైదరాబాద్‌లో అమెరికా తరహా రెస్టారెంట్... జస్ట్ రూ.59 నుంచే ఫుడ్ ఐటమ్స్

హైదరాబాద్ నగరవాసులు ఆరోగ్యం పట్ల అప్రమత్తం అవుతున్నారు. రోజువారి దినచర్యలో మంచి పౌష్టిక ఆహారం ఉండేలా చూసుకుంటున్నారు. ఒకరోజు ముందుగానే తయారు చేసుకున్న మొలకలను తింటున్నారు. వీటిని తినడం వల్ల మొలకల్లో ఉన్న విటమిన్లు నేరుగా వారి శరీరంలోకి వెళ్లేలా చూసుకుంటున్నారు. అయితే ఇలాంటి ఆహారం ఇంట్లోనే కాకుండా హైదరాబాదులోని కెఫేస్, రెస్టారెంట్స్ లో కూడా నగరవాసుల కోసం వివిధ రకాల ఆరోగ్యకరమైన వంటలను తయారు చేసి ఇస్తున్నారు.

అయితే హైదరాబాద్ నగరంలో అమెరికా దేశం తరహా రెస్టారెంట్ వచ్చేసింది. ఆ రెస్టారెంట్ లో ఉన్న వాతావరణం చూస్తే అచ్చం అమెరికాలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి రెస్టారెంట్ కి వెళ్లి అమెరికా వాతావరణం ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నారా....! అంతేకాకుండా అక్కడున్న పౌష్టిక ఆహార విలువల గల వివిధ రకాల వంటలను టేస్ట్ చేద్దాం అని అనుకుంటున్నారా?

60 గజాల స్థలంలో జస్ట్ రూ. 6 లక్షలకే లగ్జరీ ఇల్లు

అదేనండి ఈ రెస్టారెంట్ ఎక్కడో కాదు హైదరాబాదులోని హిమాయత్ నగర్ లో ఓల్డ్ ముంబాయి ఐస్ క్రీమ్ షాప్ ఎదురుగా ఉంటుంది. ఈ అమెరికా తరహా రెస్టారెంట్ పేరు కాలిఫోర్నియా బురిట్టో. ఈ రెస్టారెంట్లో ఎన్నో రకాల అమెరికా వంటకాలు మన కళ్ళముందే తయారుచేసి ఇస్తున్నారు. ఈ కాలిఫోర్నియా బురిట్టో రెస్టారెంట్ లో ఎన్నో వివిధ రకాల వంటలతో పాటు మంచి ఆఫర్లు కూడా ఉన్నాయి.

ఈ వేసవి కాలంలో అలసిపోయే వారికోసం కేవలం 79 రూపాయలకే అన్లిమిటెడ్ రీఫిల్స్ ఇస్తున్నారు. వీరి దగ్గర మూడు రకాల జ్యూసెస్ లభిస్తున్నాయి. అంతేకాకుండా ఈ రెస్టారెంట్ స్పెషల్ టాకోస్ కేవలం 59 రూపాయలకే లభిస్తున్న టాకోస్ ని టాకో ట్యూస్డే బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్లో ఇస్తున్నారు. అలానే వీరి దగ్గర ఎంతో స్పెషల్ డిష్ బురిట్టో కేవలం 300 రూపాయలు లోపే అందిస్తున్నారు.

Tirupati Tour: జస్ట్ రూ.3,500 కే తిరుపతి టూర్ ప్యాకేజీ... తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, బస ఉచితం

ఈ కాలిఫోర్నియా బురిట్టో రెస్టారెంట్లో జిమ్ పర్సన్స్ కోసం ప్రో బౌల్ అనే స్పెషల్ డిష్ ని అందిస్తున్నారు. దీనిని తినడం వల్ల జిమ్ పర్సన్స్ శరీరానికి కావలసిన పౌష్టిక ఆహారం అందుతుందని కాలిఫోర్నియా బురిట్టో మేనేజర్ రాకేష్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా వీరి దగ్గర ఉన్న సాసెస్ హైదరాబాదులో ఎక్కడ దొరకదు అని అంటున్నారు. ఆ సాసుల రుచి చాలా ప్రత్యేకమని తెలిపారు. ప్రత్యేకంగా తాజాగా ఫామ్ నుంచి వచ్చిన అవకాడోస్ ని వారి వంటకాలలో ఉపయోగించడం వల్ల వారి వంటకాలకు మంచి రుచి వస్తుందని కాలిఫోర్నియా బురిట్టో మేనేజర్ రాకేష్ తెలిపారు.

2024-03-29T05:45:40Z dg43tfdfdgfd