ఇలా చేస్తే అత్తింట్లో అసలు గొడవలు రావు..

చాలా మంది ఇళ్ళలో కోడళ్ళు అత్తలపై కంప్లైంట్ చేస్తారు. వారిద్దరి మధ్య గొడవలు రావడం కామన్. ఇలా కాకుండా అత్తాకోడళ్ళ రిలేషన్ బాగుండాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.

కుటుంబంలో శాంతి, ప్రశాంతత ఉండాలంటే ఇంట్లోని అత్తమామలతో ఆనందంగా ఉండాలి. అత్తాకోడళ్ళ మధ్య చక్కని రిలేషన్ ఉండాలి. కానీ, నేటి కాలంలో గొడవలు లేని ఇంటిని చూడడం కష్టమే. ఇందులో 90 శాతం గొడవలు అత్తాకోడళ్ళ మధ్యే వస్తాయి. అవి రాకుండా అందరూ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోండి. సంప్రదాయాలు పాటించడం..

ప్రతి ఇంట్లో కూడా సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఉంటాయి. ఆ సాంప్రదాయాలను అందరూ కలిసి హ్యాపీగా జరుపుకునేందుకు మీ వంతు కృషి చేయండి. వారి సాంప్రదాయాలు తెలుసుకోండి. ఒకరి సాంప్రదాయాలని ఒకరు గౌరవించండి. దీంతో మీ అత్తమామలు ఫిదా అవ్వడం ఖాయం.

ఓపెన్ మైండెడ్‌గా..

ప్రతి కుటుంబం, ప్రాంతం, ఆహారం, ఇతర విషయాల్లో ప్రత్యేకంగా ఉంటుంది. మీ అత్తమామల ఇంట్లో మీకు ఏది కొత్త అయితే, దానిని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇది వంట, ఇంటి అలంకరణ ఇలా ఏదైనా సరే.. మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి వారి పనులు నేర్చుకుని అత్తమామల హృదయాలను గెలుచుకోండి. ​Also Read : పెళ్ళయ్యాక మగవారు ఈ అబద్ధాలు చెప్పే మరో స్త్రీకి దగ్గరవుతారు..

టచ్‌లో ఉండడం..

మ్యారేజ్ తర్వాత మీరు అత్తమామలతో కలిసి ఉంటే పర్లేదు. లేదంటే, అందరితో టచ్‌లో ఉండండి. సన్నిహితంగా యోగక్షేమాలను కనుక్కోండి. ఫోన్, వీడియో కాల్ వంటి వాటితో వారితో ఎప్పుడు టచ్‌లో ఉండండి. ​Also Read : ఇలా చెబితే మీ హజ్బెండ్ ఇంటి పనుల్లో సాయం చేస్తారు..

అభిప్రాయాలను గౌరవించడం..

భార్యాభర్తలిద్దరూ తమ అత్తమామల అభిప్రాయాలకు విలువనిస్తూ ఇరు కుటుంబ పెద్దలను గౌరవిస్తారు. దీని ద్వారా సీనియర్లందరితో హ్యాపీగా టచ్‌లో ఉండొచ్చు.వారు ఏదైనా విషయంలో ఏమైనా చెబితే వినండి. వారి మాటలు వినడానికి ఓపిగ్గా ఉండండి. విన్న తర్వాత మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. దీని ద్వారా చాలా వరకూ గొడవలు రాకుండా ఉంటాయి.

​Read More : Relationship News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-06-10T11:53:54Z dg43tfdfdgfd