వాల్‌నట్స్ రోజూ నానబెట్టి తింటే ఈ లాభాలు అందుతాయి..

డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా వాల్‌నట్స్‌లో చాలా పోషకాలు ఉన్నాయి.

మన ఆరోగ్యం కోసం ఎన్నో వర్కౌట్స్ చేస్తాం. ఎన్నో ఫుడ్స్ తీసుకుంటాం. అందులో భాగంగా ఆరోగ్య నిపుణుల ప్రకారం.. వాల్‌నట్స్‌ని రాత్రంతా నీటిలో నానబెట్టి తింటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే చాలా లాభాలున్నాయి. కాబట్టి, వాల్‌నట్స్‌లో ఎన్నో పోషకాలున్నాయి. దీని వల్ల ఏమేం లాభాలున్నాయో తెలుసుకోండి. బ్రెయిన్ హెల్త్..

వాల్‌నట్స్ తింటే బ్రెయిన్‌పై పాజిటీవ్ ఎఫెక్ట్ ఉంటుంది. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. దీంతో బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది. మానసిక సమస్యలు దూరమవుతాయి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

జీర్ణ వ్యవస్థకి..

నానబెట్టిన వాల్‌నట్స్‌లో ఫైటిక్ యాసిడ్‌ని తగ్గించే గుణాలు ఉన్నాయి. వీటిని తింటే జీర్ణ వ్యవస్థ మెరుగై మలబద్ధకం, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దూరమవుతాయి. పేగు ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా చేస్తుంది. ​Also Read : Dates Benefits : రోజుకో ఖర్జూరం తింటే ఇన్ని లాభాలా..

డ్రై ఫ్రూట్స్, డ్రైడ్ ఫ్రూట్స్.. రెండింటి మధ్య తేడా..

బరువు కంట్రోల్..

వాల్‌నట్స్ తింటే బరువుని మెంటెయిన్ చేయడానికి సాయపడతాయి. ఎక్కువ మొత్తంలో ఫైబర్, ప్రోటీన్ కంటెంట్‌ని కలిగి ఉంటుంది. అవి మనకు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. కేలరీలను తగ్గిస్తాయి. దీంతో శరీర బరువు పెరగదు.

ఎముకల ఆరోగ్యం, ఇమ్యూనిటీ..

వాల్‌‌నట్స్‌లో మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఎముకల సమస్యలు దూరమవుతాయి. దీంతో పాటు..ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్న వీటిని తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. వాల్‌నట్స్‌లో అధిక మొత్తంలో జింక్, విటమిన్ ఇ ఉంటుంది. కాబట్టి, మన ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇన్ఫెక్షన్స్, అనారోగ్యాలను సమర్థవంతంగా దూరం చేస్తాయి. ​Also Read : ఈ ప్రోటీన్ ఫుడ్స్ తింటే షుగర్ వ్యాధి కంట్రోల్ అవుతుందట..

నిద్ర సమస్యలు దూరం..

నానబెట్టిన వాల్‌నట్స్ తింటే నిద్ర నాణ్యత మెరుగవుతుంది. నిద్రలేమి సమస్య దూరమవుతుంది. వాల్‌నట్స్‌లో మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవడానికి సాయపడుతుంది. వాల్‌నట్స్ నానబెట్టి తీసుకుంటే మంచిది. అంతేకాకుండా వీటిని తీసుకుంటే ఆందోళన, ఒత్తిడిని తగ్గిస్తుంది. మన శరీరంలో హ్యాపీ హార్మోన్‌ని విడుదల చేస్తుంది. ఎందుకంటే, వాల్నట్స్‌లో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

గుండె ఆరోగ్యం..

వాల్‌నట్స్‌లో హెల్దీ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మన బాడీలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. దీంతో బీపి కంట్రోల్‌లో ఉండి గుండె సమస్యలు కూడా దూరమవుతాయి.

అందానికి..

వాలనట్స్ మన అందాన్ని కూడా పెంచుతాయి. ఎందుకంటే, వీటిలో విటమిన్ బి5, విటమిన్ ఇ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా చేస్తాయి. ఈ పోషకాలు మన శరీరంలో మంటని తగ్గించి పొడి చర్మ సమస్యని దూరం చేస్తాయి. వృద్ధాప్య ప్రక్రియ నుండి మనల్ని రక్షిస్తుంది. మనకి కాంతివంతమైన చర్మాన్ని అందిస్తుంది. దీంతో పాటు.. బి7 వాల్‌నట్స్‌లో బయోటిన్ రూపంలో లభిస్తుంది. ఇది మన జుట్టు కుదుళ్ళని బలంగా చేసి రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు పెరుగుదలకి హెల్ప్ చేస్తుంది.

వాల్‌నట్స్‌ని ఎలా నానబెట్టాలి?

వాల్‌నట్స్‌లోని పోషకాలు నానబెట్టి తింటే శరీరం ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది. అందుకోసం గ్లాసు నీటిలో వాల్‌నట్స్‌ని నానబెట్టి ఉదయాన్నే కడిగి తీసుకోవాలి. గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More : Health News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-06-10T04:22:57Z dg43tfdfdgfd