టీ, కాఫీ.... ఈ రెండింటిలో ఏది మంచిది..?

 టీలో సహజంగానే కొన్ని రకాల కెమికల్స్ ఉంటాయట. వాటిని  పాలీఫెనాల్స్ అంటారు. వాటి కారణంగానే టీ కమ్మని వాసన అందిస్తుందట.

 

ఉదయం లేవగానే మనలో చాలా మందికి టీ, కాఫీ తాగనిది రోజు మొదలుకాదు. ఎన్నో సంవత్సరాలుగా మన దేశంలో ఈ రెండు పానీయాలు భాగం అయిపోయాయి. అయితే... ఈ రెండింటిలో ఏది మంచిది అనే విషయంలో ఎప్పుడూ పోటీ జరుగుతూనే ఉంటుంది. టీ నే గొప్పదని.. టీ మంచిదని టీ లవర్స్ అంటే... కాదు, కాదు... మా కాఫీనే మంచిది అని కాఫీ ప్రియులు వాదిస్తూ ఉంటారు. మరి వీరిద్దరి వాదనలో ఎవరు చెప్పింది నిజం. ఈ రెండింటిలో ఏది తాగడం ఉత్తమం అనే విషయాన్ని నిపుణుల సహాయంతో తెలుసుకుందాం..

టీ సాధారణంగా మనం ఎండిపోయిన టీ ఆకులతో తయారు చేస్తాం. టీ ఆకులను నీటిలో మరిగించి.. పాలు కలుపుకోని తాగుతూ ఉంటారు. అయితే.. టీ ఆకులను ఎండ పెట్టి.. పొడి చేసిన తర్వాత వాడతాం. అయితే.. టీలో సహజంగానే కొన్ని రకాల కెమికల్స్ ఉంటాయట. వాటిని  పాలీఫెనాల్స్ అంటారు. వాటి కారణంగానే టీ కమ్మని వాసన అందిస్తుందట.

 

ఇక కాఫీ విషయానికి వస్తే... కాఫీ గింజలతో పౌడర్ చేసి.. దానితో తయారు చేస్తారు. కాఫీలోనూ సహజంగానే కెమికల్స్ ఉంటాయట. కాఫీ గింజలను వేయించి.. పొడి చేసిన విధానాన్ని బట్టి... ఆ కెమికల్స్ ఉంటాయట. ఇప్పుడు ఈ రెండింటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం...

 

టీ తాగడం వల్ల కలిగే లాభాలు..

రోజూ టీ తాగడం వల్ల....కొలిస్ట్రాల్ ని తగ్గిస్తుందట. బీపీ సమస్య ఉండదు,  మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. టీలో సహజంగా ఉంటే పాలిఫెనాల్స్ లో అమినో యాసిడ్స్ ఉంటాయి.  మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మెమరీ లాస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయట.

 

కాఫీ తాగడం వల్ల కలిగే లాభాలు..

ఇక, కాఫీ తాగడం వల్ల  గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. లివర్ సమస్యలు, బ్రెయిన్ సమస్యలు, టైప్ 2 డయాబెటిక్స్ లాంటివి రాకుండా కాపాడతాయి. రక్తంలో షుగర్ లెవల్స్ ని తగ్గించడంలో, బ్రెయిన్ సెల్స్ ప్రొటెక్ట్ చేయడంలో, ఒత్తిడి తగ్గించడంలోనూ సహాయపడుతుంది.

 

రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది అంటే మాత్రం... రెండూ ఆరోగ్యకరమే.. కానీ అది మితంగా తీసుకున్నప్పుడు మాత్రమే. రోజూ ఒక కప్పు వరకు తీసుకుంటే.. రెండింటి వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. రోజు ఒక కప్పు టీ తాగితే. దానిలోని యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరానికి మేలు చేస్తాయి. ఎక్కువ తాగితే.. మాత్రం నష్టమే కలుగుతుంది. కాఫీ కూడా ఎక్కువ తాగితే.... ఇరిటేషన్, రెస్ట్ లేకపోవడం, యాంక్సైటీ, నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. 

2024-06-11T04:23:47Z dg43tfdfdgfd