Trending:


కోపాన్ని ఇలా నియంత్రించుకోండి!

కోపాన్ని తగ్గించే సింపుల్ చిట్కాలు గురించి వివరిస్తున్నాం. వీటిని ఫాలో అయితే కోపం నుంచి ఉపశమనం లభిస్తుంది.


Dhaba Style Mutton Curry: సండే మటన్‌ కర్రీని ఇలా ధాబా స్టైల్‌లో చేసుకుని తినండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..

Dhaba Style Mutton Curry Recipe: ధాబా స్టైల్‌లో ఏ రిసిపీ తయారు చేసుకున్న రుచి అదిరిపోతుంది. అందుకే ఈరోజు ధాబా స్టైల్‌లో మటన్‌ కూరను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ రుచికరమైన కూర ఒక్కసారి ప్రయత్నిస్తే మళ్లీ మళ్లీ ట్రై చేస్తారు.


జూన్ ఆఖరి వారం మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశులవారికి అద్భుతంగా ఉంటుంది!

weekly horoscope 23 june 2024 to 29 june 2024 మేష రాశి (Aries Weekly Horoscope) ఈ వారం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారంలో ఆశించిన ఫలితాలను పొందుతారు. కెరీర్ సంబంధిత సమస్యల నుంచి ఈ వారం ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ బాధ్యతల పట్ల విధేయతతో ఉంటారు. వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతుంది. సాహిత్యం , రచనలపై ఆసక్తి పెరుగుతుంది. అయితే మీ ఉద్దేశాలను ఎదుటివారు తప్పుగా అర్థం...


ఈ రాశుల వారు చాలా రొమాంటిక్.. ప్రేమలో కచ్చితంగా సక్సెస్ అవుతారు..!

రొమాంటిక్ పర్సన్స్ పార్ట్‌నర్‌గా దొరకడం ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు. వీరితో జీవితాన్ని చాలా సంతోషంగా గడిచిపోతుంది. జ్యోతిష్యశాస్త్రం (Astrology) ప్రకారం గ్రహాల ఆధారంగా రాశిని బట్టి వ్యక్తుల భవిష్యత్తు, వారి వ్యక్తిత్వాల గురించి తెలుసుకోవచ్చు. పండితులు వివిధ అంశాల ఆధారంగా వ్యక్తుల లవ్, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుందో విశ్లేషిస్తారు. అయితే కొందరు వ్యక్తులు సహజంగానే చాలా రొమాంటిక్‌గా ఉంటారని, వీరి లవ్ సక్సెస్ అవుతుందని జ్యోతిష్యం చెబుతోంది. ఆ రాశులు ఏవో...


Horoscope | 24-06-2024 సోమవారం.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే

Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..


రోజ్ వాటర్ ని ఎలా వాడితే.. మీ అందం పెరుగుతుందో తెలుసా?

ఈ రోజ్ వాటర్ లో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలు ముఖంపై ఎరుపు దనం లేకుండా చేస్తుంది. మొటిమలు లాంటి సమస్య రాకుండా కాపాడుతుంది. చర్మం మీద ఎలాంటి ర్యాషెస్ లాంటివి రాకుండా చేస్తాయి. రోజ్ వాటర్ ని బ్యూటీ కోసం టోనర్ గా ఉపయోగిస్తూ ఉంటారు. నిజానికి రోజ్ వాటర్ ని.. లగ్జరీ ప్రోడక్ట్ గా భావిస్తారు. ఎందుకంటే.. కాస్త ఖరీదు ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ రోజ్ వాటర్ తో... స్కిన్ గ్లోనెస్ మాత్రమే కాదు.. హెయిర్ గ్రోత్ కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి.. ఈ...


Mushrooms: చీకట్లో మెరిసే పుట్టగొడుగులు.. చూడాలంటే అక్కడికి వెళ్లాల్సిందే..!

ప్రకృతిలో అద్భుతాలు ఎప్పుడూ మనని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. తాజాగా ఇలాంటి మరో అద్భుతాన్ని గుర్తించారు. కేరళ కాసరగోడ్ రాణిపురం రిజర్వ్ ఫారెస్ట్‌లో నిర్వహించిన సర్వేలో రాత్రిపూట వెలిగే అరుదైన పుట్టగొడుగు గుర్తించారు. వీటిని అటవీశాఖ అధికారులు రాణిపురం రిజర్వ్ ఫారెస్ట్‌లో గుర్తించారు. ఈ పుట్టగొడుగులు రసాయన చర్యల ద్వారా ఆకుపచ్చ కాంతిని విడుదల చేస్తాయి. ఈ పుట్ట గొడుగుల శాస్త్రీయ నామం Phylloboletus manipularis. ఎలక్ట్రిక్ పుట్టగొడుగులు అని కూడా వీటిని పిలుస్తారు. ఈ పుట్టగొడుగులు చాలా అరుదు ఉంటాయి. రాత్రి సమయంలో దీని నుంచి కాంతి వస్తుంది. ఈ పుట్టగొడుగులను పగటిపూట సాధారణ పుట్టగొడుగుల్లాగా గుర్తించడం కష్టం. వీటి గురించి తెలిసిన వారు మాత్రమే గుర్తించగలరు. లూసిఫేరేస్ అనే ఎంజైమ్ పుట్టగొడుగులు, తుమ్మెదలు మరియు కొన్ని సముద్ర జీవులతో సహా వివిధ రకాల జీవులలో బయోలుమినిసెన్స్‌కు బాధ్యత వహిస్తుంది. ఈ ఎంజైమ్ ఆక్సిజన్ సమక్షంలో ఆక్సీకరణం చెంది కాంతి రూపంలో శక్తిని విడుదల చేస్తుంది. రాణిపురం అటవీ ప్రాంతంలో కేరళ అటవీ శాఖ, మష్రూమ్స్ ఆఫ్ ఇండియా కమ్యూనిటీ నిర్వహించిన సర్వేలో ఈ పుట్టగొడుగులు బయట పడ్డాయి. రాణిపురం అటవీ ప్రాంతంలో నిర్వహించిన సర్వేలో దాదాపు 50 రకాల పుట్టగొడుగులను గుర్తించారు. అయితే ఇవన్నీ రంగు మరియు ఆకృతిలో భిన్నంగా ఉంటాయి. ఇందులో తినదగిన, తినలేని పుట్టగొడుగులు రెండూ ఉన్నాయి. రాణిపురం సర్వేలో దాదాపు యాభై రకాల పుట్టగొడుగులు నమోదయ్యాయి. టమాటా ఆకారంలో ఉండే పుట్టగొడుగులు, పువ్వులాంటి పొరోనియా నాగరాహోలెన్సిస్, గూడు ఆకారంలో ఉండే సియాథస్ పొడుగు పుట్టగొడుగులు ఇక్కడ ఉన్నాయి. పుట్టగొడుగుల పరాగసంపర్కానికి సంబంధించిన అందమైన దృశ్యాలను కూడా సర్వే బృందం గుర్తించింది. ఇక ఈ ప్రాంతంలో మరిన్ని ప్రాంతాలకు సర్వేను విస్తరించాలని అటవీశాఖ నిర్ణయించింది. ఈ అరుదైన పుట్టగొడుగుల గురించి, సమాచారం సేకరించి వాటి పరిరక్షణకు చర్యలు చేపట్టడమే లక్ష్యాన్ని అటవీశాఖ అధికారులు పెట్టుకున్నారు.


ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ నూనెలతో వంట చేయండి.. కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఆరోగ్యం సరిగా లేకపోతే ఏ పని చేయలేం. అనారోగ్యాల బారిన పడితే ఆర్థికంగా కూడా కుదేలయ్యే ప్రమాదముంది. అందుకే పోషకాహారం తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వంట నూనెల విషయంలోనూ జాగ్రత్త వహించాలి. మార్కెట్లో చాలా రకాల వంట నూనెలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో దేని ప్రత్యేకతలు దానికి ఉంటాయి. అయితే వంట చేయడానికి ఏ ఆయిల్ బెస్ట్? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోండి. రైస్ బ్రాన్ ఆయిల్ : అన్ని నూనెల్లోకెల్లా రైస్ బ్రాన్ ఆయిల్ (Rice bran oil) అత్యంత ఆరోగ్యకరమైనది. ఎందుకంటే ఇందులో కొలెస్ట్రాల్ ఉండదు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గుండెకు మంచి చేసే కొవ్వులు కూడా లభిస్తాయి. రుచికి చాలా లైట్‌గా ఉంటుంది. వేడిని బాగా తట్టుకునే గుణం (High smoke point) ఉండటం వల్ల వేయించడం, గ్రిల్ చేయడం వంటి రెసిపీలకు బాగుంటుంది. ఈ నూనె ఎక్కువ వేడిలో కూడా పోషకాలను నిలుపుకోగలదు. రైస్ బ్రాన్ ఆయిల్ కారణంగా పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. ఈ నూనెను ఏ వంటలు చేయడానికైనా వాడవచ్చు. సన్‌ఫ్లవర్ ఆయిల్‌ : ఈ ఆయిల్‌లో శాచురేటెట్ ఫ్యాట్ తక్కువగా ఉంటుంది, అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్‌లను తగ్గిస్తూ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ నూనెలో విటమిన్ E, K ఉంటాయి. మెదడు నరాల ఆరోగ్యాన్ని కాపాడే సమ్మేళనాలు కూడా సన్‌ఫ్లవర్ ఆయిల్ నుంచి లభిస్తాయి. ఆలివ్ నూనె : ఆలివ్ నూనె గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో మోనోశాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్ (Monounsaturated fats) ఎక్కువగా ఉంటాయి. ఈ కొవ్వులు బ్యాడ్ కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL)ను పెంచుతాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి, గుండె జబ్బులు, ఇతర వ్యాధుల ముప్పును తగ్గించేస్తాయి. అవకాడో ఆయిల్ : ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. అవకాడో ఆయిల్‌లో శాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్ (Monounsaturated fats), వివిధ రకాల విటమిన్లు ఉంటాయి. దీనికి హై స్మోక్ పాయింట్ ఉంటుంది. అంటే ఎక్కువ వేడి చేసినా పోషకాలు నశించవు. కొబ్బరి నూనె : కొబ్బరి నూనెలో మీడియం-చెయిన్ ట్రైగ్లిజరైడ్లు (Medium-chain triglycerides) ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని త్వరగా అందిస్తాయి. బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, ఇందులో శాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని వంటల్లో పరిమితంగా వాడాలి. కనోలా ఆయిల్ : కనోలా ఆయిల్‌లో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తూ మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. సోయాబీన్, సన్‌ఫ్లవర్ వంటి ఇతర నూనెల్లోనూ పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఏది బెస్ట్ : అయితే వీటిలో ఏది బెస్ట్ అనేది ఆహార అవసరాలు, వంట పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. ఎప్పుడూ ఒకే ఆయిల్ వాడకూడదని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన హెల్తీ ఆయిల్స్‌ ర్యాండమ్‌గా వాడటం మంచిదని సూచిస్తున్నారు.


పంతులు లేకుంటే పాఠాలెలా?

పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా మారింది సర్కారు బడుల పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ను తలదన్నేలా వసతులు, వి ద్యాబోధన అందుతుందని బడిబాట పేరుతో గొప్పలు చెప్పి తీరా ఆచరణలో మాత్రం వసతుల సంగతి అ టుంచితే కనీసం చదువు చెప్పేందుకు పంతులు లేని ప రిస్థితులు నెలకొన్నాయి.


ఈ మొక్కలు ఇంట్లోనే పెంచుకోవచ్చని మీకు తెలుసా?

చాలా మందికి మొక్కలు అంటే ఇష్టం. కానీ ఈ మొక్కలు పెంచే స్థలం లేక ఆ ఆలోచనని మానుకుంటారు. అలాంటి వారికోసమే ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. తక్కువ ప్రదేశంలో ఇమిడిపోయే ఆ మొక్కలు ఏంటో చుసేద్ధామా….


Rasi Phalalu: జూన్ 14న త్రిపుష్కర యోగం.. ఈ రాశుల వారికి ధనమే ధనం..

Rasi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ 24వ తేదీన ఎంతో శక్తివంతమైన మూడు యోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అయితే ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో లాభాలు పొందబోయే రాశుల వారెవరో తెలుసుకోండి.


గిన్నెలకు గుడ్ల వాసన పోవాలంటే ఏం చేయాలి?

వెల్లుల్లి తొక్కలను చాలా ఫాస్ట్ గా, సులువుగా ఎలా తీయాలి? దోష పాన్ ను ఈజీగా ఎలా క్లీన్ చేయాలి? గిన్నెలకు పట్టిన గుడ్ల వానను ఎలా పోగొట్టాలి? వంటి కొన్ని వంటింటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఆడవాళ్లు ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. కుటుంబ బాధ్యతతో ఆడవాళ్లకు తీరిక కూడా ఉండదు. దీనివల్ల కొన్ని పనులు చేయడం ఆడవాళ్లకు కష్టంగా ఉంటుంది. అందుకే కష్టమయ్యే, లేటయ్యే కొన్ని పనులను సులువుగా ఎలా ఫాస్ట్ గా...


డ్రగ్స్ను అరికట్టేందుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తాం: భట్టి

డ్రగ్స్ను అరికట్టేందుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తాం: భట్టి డ్రగ్స్ మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిందన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.  డ్రగ్స్ మత్తులో విద్యార్థుల బంగారు భవిష్యత్ నాశనం అవుతుందన్నారు. ఎంతోమంది అమాయకులు డ్రగ్స్ కు బానిసలవుతున్నారని చెప్పారు. దేశాన్ని నాశనం చేయడానికి డ్రగ్స్ వాడుతున్నారని విమర్శించారు. దేశంలో మా...


టూల్స్ గాడ్జెట్స్ : ఏఐ కుకింగ్ అసిస్టెంట్‌‌

టూల్స్ గాడ్జెట్స్ : ఏఐ కుకింగ్ అసిస్టెంట్‌‌ బ్యాచిలర్స్‌‌ చాలామంది వారంలో మూడు రోజులు వంట చేసుకుంటే మరో నాలుగు రోజులు బయటి ఫుడ్​ తింటారు. అలాంటి వాళ్లకు ఈ కుకింగ్ అసిస్టెంట్‌‌ బెస్ట్‌‌ ఛాయిస్‌‌. దీన్ని అప్‌‌లియన్స్‌‌ స్టోర్ అనే కంపెనీ తయారుచేసింది. ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​తో పనిచేసే ఈ గాడ్జెట్‌‌ వంట చేయడంలో చాలా సాయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ...


Today Horoscope In Telugu: జూన్ 25 రాశి ఫలాలు – ఈ రాశి వారికి శత్రువులే మిత్రులుగా మారి సాయం చేస్తారు

Daily Horoscope for June 25th 2024: మేష రాశిఈ రాశి వారు ఈరోజు ముఖ్యమైన పత్రాలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్యలను సంప్రదించవలసి వస్తుంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగాలు కొంత మందకొడిగా సాగుతాయి. వృషభ రాశి ఈరోజు ఈ రాశి వారు వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. దూర...


ఈ అలవాట్లు బాధకు గురి చేస్తాయి తెలుసా?

మనలో ప్రతి ఒక్కరం అనందంగా ఉండాలనే కోరుకుంటాం. కానీ కొన్ని కొన్ని కారణాలతో బాధ వస్తుంది. అసలు బాధ రావడానికి గల కారణాలను ఇక్కడ వివరించాం.


Zodiac Sign 2024: జూలైలో రాహువు - శని కలయిక.. ఈ 3 రాశుల వారికి తిరుగులేదు.. డబ్బే డబ్బు..

Rahu and Saturn Conjunction: రాశుల సంచారాల పరంగా జూలై నెల ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అయితే ఈ నెలలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన కొన్ని గ్రహాలు నక్షత్ర సంచారం, సంయోగం చేయబోతున్నాయి దీనికి కారణంగా ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.


వర్షాకాలంలో బట్టలు సరిగా ఆరట్లేదా..? 5 అద్భుత చిట్కాలు మీ కోసమే!

భారతదేశంలో ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ సీజన్‌లో ప్రజలకు కొన్ని సాధారణ ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా ఉతికిన బట్టలు సరిగా ఆరక ముక్కిపోయిన వాసన వస్తుంది. ఎక్కువ తేమ కారణంగా, బట్టలు ఆరడానికి చాలా టైమ్ పడుతుంది. అయితే ఈ సమస్యకు ఐదు టిప్స్‌తో చెక్ పెట్టవచ్చు. అవేంటంటే.. పొడి టవల్‌తో నీళ్లు పిండడందుస్తులు ఉతికిన తర్వాత, వాటిని ఒక పొడి టవల్ మీద చుట్టి మెలితిప్పాలి. గట్టిగా పిండితే తడి బట్టల నుంచి నీళ్లు బయటకు వస్తాయి. దీంతో తక్కువ సమయంలోనే ఆరిపోతాయి. స్వెటర్లు, జీన్స్ వంటి మందపాటి బట్టలకు ఈ టిప్ బాగా పని చేస్తుంది. స్పిన్ సైకిల్ మోడ్‌వాషింగ్ మెషీన్లలో "స్పిన్ సైకిల్" అనే ఫీచర్ ఉంటుంది. ఇది బట్టల నుంచి ఎక్స్‌ట్రా వాటర్‌ను తొలగించగలదు. ఈ ఎక్స్‌ట్రా స్పిన్ మరింత నీటిని తొలగిస్తుంది. తద్వారా ఆరబెట్టే సమయం తగ్గుతుంది. వాషింగ్ మెషీన్‌లో స్పిన్ స్పీడ్ అడ్జస్ట్ చేయగలిగితే, హై-సెట్టింగ్‌ను ఎంచుకోవాలి. వాషింగ్ మెషీన్ నుంచి బయటకు తీసినప్పుడు బట్టలు ఎంత ఎక్కువగా పొడిగా ఉంటే, ఆరుబయట గాలిలో అవి అంత త్వరగా ఆరతాయి. హెయిర్ డ్రైయర్ఏవైనా దుస్తులను త్వరగా ఆరబెట్టాల్సిన అవసరం వస్తే, హెయిర్ డ్రయర్ వాడటం మంచిది. దీన్ని తడి బట్టలకు కొన్ని అంగుళాల దూరంలో ఉంచి వార్మ్ (Warm) సెట్టింగ్‌కు అడ్జస్ట్ చేయాలి. దీంతో బట్టలు పూర్తిగా ఆరిపోతాయి. ఈ పద్ధతి చిన్న బట్టలకు, ముఖ్యంగా హ్యాండ్ కర్చీఫ్ వంటి వాటికి లేదా ఒక చొక్కా కాలర్ లేదా స్లీవ్స్ వంటి వాటికి చాలా బాగా పని చేస్తుంది. డీహ్యుమిడిఫైయర్, ఫ్యాన్లువర్షాకాలంలో ఇంటి లోపల వస్త్రాలు ఆరబెట్టడం కష్టంగా ఉంటుంది. కానీ డీ హ్యుమిడిఫైయర్, ఫ్యాన్ల ద్వారా బట్టలను త్వరగా ఆరబెట్టవచ్చు. గాలిలోని తేమను తొలగించే యంత్రాన్ని డీహ్యుమిడిఫైయర్ అంటారు. దీన్ని దుస్తులు ఆరబెట్టిన గదిలో పెట్టి ఆన్ చేస్తే, గాలి పొడిగా మారుతుంది. దీంతో అవి త్వరగా ఆరిపోతాయి. గాలి బాగా వీచే ఫ్యాన్‌ కింద ఆరబెడితే, తక్కువ సమయంలోనే దుస్తులు డ్రై అవుతాయి. ఇండోర్ డ్రైయింగ్ ర్యాక్స్‌వానాకాలంలో ఇండోర్ డ్రైయింగ్ ర్యాక్స్‌ (Indoor Drying Racks) చాలా అవసరం. గాలి బాగా వీచే ఓపెన్ విండోల దగ్గర లేదా సీలింగ్ ఫ్యాన్ల కింద వీటిని ఉంచాలి. బట్టలు త్వరగా ఆరబెట్టడానికి డీహ్యుమిడిఫైయర్ ఉన్న గదిలో ర్యాక్స్ పెట్టడం మరొక మార్గం. డ్రైయింగ్ ర్యాక్స్ వాడకంతో వర్షాకాలపు బయటి వాతావరణంలో కూడా బట్టలు త్వరగా ఆరేలా ఒక వాతావరణాన్ని సృష్టించవచ్చు. ర్యాక్‌లోని ప్రతి క్లాత్ చుట్టూ తగినంత గాలి తగిలేలా చూస్తే, అవి త్వరగా ఆరతాయి.


Skin Care: అన్నంతో అందం.. ఇలా ముఖానికి రాస్తే చాలు.. మెరవడం గ్యారంటీ

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకు భారీగా డబ్బు కూడా ఖర్చు చేస్తారు. కానీ ఖరీదైన సౌందర్య సాధనాలు తరచుగా పనికిరావు. అయితే ఖరీదైన కాస్మోటిక్స్ వాడకుండా కేవలం బియ్యపు పిండినే వాడుతున్నారు. ఈ హోం రెమెడీ చర్మంలో పోయిన అందాన్ని తిరిగి తెస్తుంది. సౌందర్య నిపుణురాలు సంగీతా గుహా రాయ్ స్థానిక 18తో మాట్లాడుతూ, చాలా మంది మహిళలు మార్కెట్లో లభించే సౌందర్య సాధనాలను ఉపయోగిస్తున్నారు, అయితే ఈ ఉత్పత్తులు చాలా కొత్త సమస్యలను సృష్టించడం తప్ప మరేమీ చేయలేవు. కాబట్టి, ఖరీదైన సౌందర్య సాధనాలను ఉపయోగించకుండా, మీరు బియ్యం సారాన్ని ఉపయోగించవచ్చు. ముందుగా అన్నం ఉడకబెట్టాలి. బియ్యం రేకులు చల్లబడిన తర్వాత, వాటిని 12 నుండి 24 గంటలు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచండి. తర్వాత ముఖానికి రాసుకుంటే చర్మ సౌందర్యం పెరుగుతుంది. బియ్యంలో ఉన్న అన్ని గుణాలు చర్మంపై మంచి ప్రభావం చూపే విధంగా ఉపయోగించాలి. మీరు నాల్గవదాన్ని టోనర్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఉడికించిన అన్నాన్ని 10 నుండి 15 నిమిషాలు వేయించాలి. తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇది కాకుండా మీరు ఉడకబెట్టిన అన్నంతో కలబంద జెల్ , విటమిన్ ఇ క్యాప్సూల్‌ను చూర్ణం చేయండి. తర్వాత కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక సీసాలో నింపి, ఉపయోగించే ముందు మిశ్రమాన్ని బాగా షేక్ చేసి, ఆపై ముఖమంతా అప్లై చేయండి. ఈ హోం రెమెడీ మీకు కావలసిన క్లియర్ గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది. ఇలా చేయడం వల్ల మీ చర్మం మరింత మెరుస్తూ అందంగా తయారవుతుంది.


వివాహేత‌ర బంధం బయటపడి వ‌దిన, మ‌రిది ఆత్మ‌హ‌త్య‌

వివాహేత‌ర సంబంధం ఇద్ద‌రి చావు కోర‌కుంది. కుటుంబానికి అన్యాయం చేసి సంబంధం పెట్టుకున్న వ‌దిన, మ‌రిది రిజ‌ర్వాయ‌ర్‌లో దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. వివాహేత‌ర సంబంధం బ‌య‌ట‌ప‌డ‌టంతోనే వారు ఈ చర్యకు పాల్పడ్డారు.


ఉల్లిపాయతో ఇలా హెయిర్‌ప్యాక్ వేస్తే తెల్లజుట్టు తగ్గి పొడుగ్గా పెరుగుతుంది..

జుట్టు రాలడం నేడు చాలా కామన్ ప్రాబ్లమ్. దీనికి ఇంట్లోనే చెక్‌ పెట్టాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.


Dreams: నిద్ర లేవగానే కలలెందుకు మర్చిపోతాం.. కారణం ఏంటంటే..?

చాలా మంది నిద్రలో ఏదో అంటూ ఉలిక్కిపడుతుంటారు కలవరిస్తారు. అయితే వారిని నిద్రలోంచి లేపి.. ఏమైందని అడిగితే మాత్రం ఏ జరుగనట్టు, ఏమీ తెలియనట్టు ప్రవర్తిస్తారు. అసలు వాళ్లకు ఆ కల గుర్తుండదు. అది వాళ్ల తప్పు కాదు. మెదడు ఆ కలను గుర్తు పెట్టుకోలేదన్నమాట. తాజాగా హార్వర్డ్ మెడికల్ స్కూల్ చేసిన రీసెర్చ్ అసలు కలలెందుకు మర్చిపోతామన్న అంశం మీద ఆసక్తికర విషయాలు తెలిపాయి అవేంటో చూద్దాం. నిపుణులు చెప్తున్న అభిప్రాయం ప్రకారం వ్యక్తుల ప్రవర్తనను బట్టి వారి ఆలోచనా విధానాన్ని బట్టి కలలు వస్తాయట. కొన్ని కలలు భవిష్యత్తులో రాబోయే ప్రమాదాలు, పరిస్థితులను ముందే హెచ్చరిస్తాయట. మరికొన్ని కలలేమో మన ఆందోళన, భయం నిజమైతే ఎలా ఉంటుందో అదే కల రూపంలో వచ్చి భయపెడతాయట. అందుకే అలాంటి కలలు చాలావరకు గుర్తుండవు అంటున్నారు. కొన్నిసార్లు ఎప్పుడు వచ్చిన కలలు కూడా చాలాకాలం వరకు గుర్తుండిపోతాయి. కొన్ని కలలు మాత్రం నిద్రలోంచి లేచిన మరుక్షణమే మరిచిపోతాం. అలాంటి కలలే మన జీవితంలో నిజమవుతాయట. ఆ కలలు నిజమైన సందర్భంలో ఆ ఘటన అంతకు ముందే ఎవరికో జరిగినట్టు, ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందంట. కానీ మనకే కల వచ్చిన సంగతి మాత్రం అస్సలు గుర్తు రాదట. దీనికి కారణం మన మెదడు భవిష్యత్తులో రాబోయే కాలంలో ఏం జరగబోతుందో కచ్చితంగా ఊహించలేదు. ఒకవేళ ఊహించినా దాన్ని గుర్తు పెట్టుకోలేదు. అయితే సైన్స్ ప్రకారం ఇది వర్తించదు. మనం ఆలోచించే విషయాలు, మన జీవితం గురించిన అంశాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని అధ్యయనంలో తేలింది. సైన్స్ ప్రకారం కలలు గుర్తుండకపోవడమనేది పెద్ద రహస్యమేమీ కాదు. అదొక మానసిక అచేతన స్థితి. దీన్ని అటోనియా అంటారు. నిద్ర అనేది మనం భావించే దానికన్నా క్లిష్టమైనది. శరీరాన్ని సుప్తచేతనావస్థలోకి చేర్చడం. మెదడును మెలకువగా ఉంచి... శరీరాన్ని నిద్రకు, మెలకువకు ఊగిసలాడించే ఒక ప్రక్రియ. దీన్ని సైన్స్ పరిభాషలో రెమ్ అంటారు. ఈ ప్రక్రియలో కొన్నిసార్లు మెలకువగా ఉన్నట్టే ఉంటుంది. కళ్లు వేగంగా కదులుతాయి. రక్తప్రసరణలో, శ్వాస ప్రక్రియలో గణనీయమైన మార్పులుంటాయి. ఈ సమయంలో తరచుగా మన జీవితంలో జరిగే పరిణామాలను కలల రూపంలో మనం మేల్కొనే సమయం వరకు అంగీకరిస్తాం. నిద్రలోంచి ఉలిక్కిపడి లేచిన మరుక్షణమే శరీరం యాక్టివ్ అవుతుంది. అందుకే ఆ కల ఏమాత్రం గుర్తుండదు. ఎంతటి క్లిష్టమైన విషయాన్నైనా గుర్తు పెట్టుకునేందుకు మెదడులో ఒక కీలకమైన రసాయనం పనిచేస్తూ ఉంటుంది. అది కలల విషయంలో కూడా వర్తిస్తుంది. ఆ రసాయనమే నోరాడ్రినలిన్. శరీరాన్ని, మెదడును క్రియాశీలం చేస్తూ, యాక్టివ్గా ఉంచే హార్మోన్ ఇది. గాఢనిద్రలో ఉన్నప్పుడు ఈ హార్మోన్ తక్కువ స్థాయిలో ఉంటుంది. అందుకే కలలు గుర్తుండవు.


ఈ ఏనుగుల మధ్య ఓ తిమింగలం ఉంది.. 8 సెకన్లలో దాన్ని కనిపెట్టగలరా?

పజిల్, సుడోకు వంటివి మన ఆలోచనా శక్తిని, విశ్లేషణ సామర్థ్యాలను పెంచుతాయి. వీటిలో ఆప్టికల్ ఇల్యూషన్స్ మంచి కిక్ ఇస్తాయి. ఇవి మన కంటిని, మెదడును తప్పుదారి పట్టిస్తాయి. వీటిని సాల్వ్ చేస్తే బ్రెయిన్ పనితీరు ఇంప్రూవ్ అవుతుంది. ఆన్సర్ కోసం ఫోకస్డ్‌గా ఆలోచించాల్సి ఉంటుంది కాబట్టి ఐక్యూ లెవల్స్ కూడా పెరుగుతాయి. అయితే మీ ఐక్యూని టెస్ట్ చేసే ఒక ఆప్టికల్ ఇల్యూషన్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని 8 సెకన్లలో సాల్వ్ చేయగలరేమో టెస్ట్ చేసుకోండి.*...


Varahi Navaratri Dates 2024 : వారాహీ నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభం - విశిష్టత, పూజా విధానం ఇక్కడ తెలుసుకోండి !

Significance of Varahi Navaratri : ఆషాడ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకూ తొమ్మిది రోజుల పాటూ వారాహీ నవరాత్రులు జరుపుకుంటారు. శరన్నరవాత్రులు, మాఘ గుప్త నవరాత్రుల్లో తొమ్మిదిరోజుల పాటూ అమ్మవారిని పూజించినట్టే ఆషాడమాసంలో వచ్చే వారాహీ నవరాత్రుల్లోనూ అమ్మవారికి తొమ్మిదిరోజుల పాటూ ప్రత్యేక పూజలు చేస్తారు. నైవేద్యాలు సమర్పిస్తారు..ఉపవాసాలుంటారు, దీక్షలు చేపడతారు.. ఈ ఏడాది (2024) వారాహీ నవరాత్రుల తేదీలు - జూలై 6 నుంచి జూలై 15 వారాహీ నవరాత్రులు ఎలా...


Potato Roast Recipe : పొటాటో రోస్ట్ ఇలా చేశారంటే అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది

Potato Roast Recipe In Telugu : పొటాటో రోస్ట్ తినేందుకు చాలా బాగుంటుంది. అన్నంలోకి సైడ్ డిష్‌లా పెట్టుకుని దీనిని లాగించేయెుచ్చు.


దోమలు కొంతమందినే ఎందుకు ఎక్కువగా కుడతాయో తెలుసా?

వానాకాలంలో ఈగలు, దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సీజన్ లో దోమలు పొద్దంతా కుడుతూనే ఉంటాయి. అయితే దోమలు కొంతమందినే టార్గెట్ చేసినట్టు వారినే కుడుతుంటాయి. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. రక్తం రకం దోమలు ఎక్కువగా కుట్టడానికి రక్తం రకం కూడా ఒక కారణమే. అవును దోమలు గుడ్లు ఉత్పత్తి చేయడానికి సరైన రక్తం అవసరం. ముఖ్యంగా ‘ఓ ’రక్తానికే దోమలు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాయి. అందుకే దోమలు ఇతర రక్త రకాల కంటే టైప్ ‘ఓ’ ఉన్నవారిని ఎక్కువగా కుట్టతాయి. చెమట...


పంచరామ క్షేత్రంలో మూల విరాట్ దర్శనాలు పునఃప్రారంభం.. పంచారామాలు ఇవే

పంచరామ క్షేత్రంగా ప్ర‌సిద్ధి చెందిన సామర్లకోటలో కుమార చాళుక్య భీమేశ్వర స్వామి ఆలయంలో మూల విరాట్ దర్శనాలు పునఃప్రారంభం అయ్యాయి. దీన్ని భక్తులంతా గమనించి ద‌ర్శ‌నాలకు రావ‌చ్చ‌ని ఆలయ పాలక కమిటీ పేర్కొంది. ‌


Grah Gochar July Rashifal 2024: జూలై నెలలో ఈ ఐదు రాశులవారికి తిరుగుండదు

గ్రహాల , రాశి స్థానాల పరంగా జూలై నెల చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. జూలై నెలలో కొన్ని రాశుల వారు ఆర్థిక, వ్యాపారం ,వృత్తిలో లాభాలను పొందే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తున్నారు. జూలైలో చాలా గ్రహాలు సైన్ మారుతాయి. శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. గ్రహాల రాజు సూర్యుడు కూడా కర్కాటక రాశిని బదిలీ చేస్తాడు. అంగారకుడు, బృహస్పతి , శని యొక్క స్థానం కూడా చాలా ముఖ్యమైనది. ఏ రాశి వారికి గ్రహాల స్థానం వల్ల ప్రయోజనం కలుగుతుందో తెలుసుకోండి- వృషభం - ఈ కాలంలో వృషభ రాశి స్థానికులు ఆర్థిక లాభం కోసం అనేక ఆకర్షణీయమైన అవకాశాలను పొందవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగం కోసం మంచి ఆఫర్‌ను పొందవచ్చు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి, పాత వనరుల నుండి కూడా డబ్బు వస్తుంది. మొత్తంమీద జూలై మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి ఏ కల అయినా జూలై నెలలో నెరవేరుతుంది. ఈ కాలంలో కొత్త జాబ్ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు కార్యాలయంలో ఉన్నతాధికారుల నుండి మద్దతు పొందుతారు. మనసు ఆనందంగా ఉంటుంది. నిలిచిపోయిన పనులు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. కన్య:- కన్యా రాశి వారు జూలై నెలలో తమ వృత్తిలో విజయాన్ని పొందవచ్చు. ఈ సమయంలో మీ అదృష్టం బాగుంటుంది. ఇది కొత్త ఆదాయ వనరుగా మారుతుంది. అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది, దీని కారణంగా మీరు కష్టమైన పనిలో విజయం సాధించగలుగుతారు. కోర్టులో విజయం సాధ్యమవుతుంది. తుల:- తులారాశి వారికి ఈ సమయం వరం కంటే తక్కువ కాదు. వ్యాపారులకు ఉద్యోగంలో ప్రమోషన్ , వ్యాపారంలో లాభం ఉండవచ్చు. ఈ కాలంలో మీ కలలు కొన్ని నిజమవుతాయి. ఆర్థిక పరిస్థితిలో విపరీతమైన మార్పు వచ్చే అవకాశం ఉంది. మకరరాశి:- మకరరాశి వారికి జూలై నెల సుఖసంతోషాలతో ఉంటుంది. మీరు ఈ నెలలో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. సంతోషం పెరుగుతుంది. సంతోషం వస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది.


చిన్న పిల్లలు, మరణించిన వ్యక్తులు దుస్తులను ఇలా వాడుతున్నారా..?

ఏ క్లాత్ పడితే ఆ క్లాత్ వాడకపోవడమే మంచిది కాదట. ఎందుకంటే... వాడకూడని క్లాత్ లు వాడితే.. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగే ప్రమాదం ఉందట. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఇల్లు శుభ్రంగా ఉన్నప్పుడే.. అంటువ్యాధులు లాంటివి రాకుండా ఉంటాయి. అంతేకాదు.. ఇల్లు నీట్ గా ఉంటే.. ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడాపెరుగుతుంది. ఎక్కువ మందిని ఇంటిని శుభ్రంగా ఉంచే క్రమంలో..వస్తువులను క్లాత్ తో తుడుస్తూ ఉంటారు. అప్పుడు.. పడిన దుమ్ము సులభంగా వదులుతుంది. ఇది మంచి పద్దతే....


రోజూ బ్లాక్ టీ తాగితే ఏమౌతుందో తెలుసా?

సీజన్లతో సంబంధం లేకుండా టీ ప్రియులు టీ ని ప్రతిరోజూ తాగుతూనే ఉంటారు. కానీ మిల్క్ టీని తాగడం మాత్రం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది మన ఆరోగ్యానికి విషం లాంటిది. కానీ బ్లాక్ టీ ఇలా కాదు. మిల్క్ టీకి బదులుగా బ్లాక్ టీని తాగితే ఏమౌతుందో తెలుసా? టీ రకాలలో బ్లాక్ టీ ఒకటి. ఈ బ్లాక్ టీలో గ్రీన్ టీ, పసుపు టీ లేదా వైట్ టీ కంటే టీ ఆకులు ఎక్కువగా ఆక్సీకరణం చెందుతాయి. అందుకే ఇది ఇతర టీ లకంటే బలంగా ఉంటుంది. అలాగే మంచి ప్రాచుర్యం కూడా పొందింది. నిజానికి...


డచ్‌‌‌‌ నుంచి వచ్చిన డాల్డా

డచ్‌‌‌‌ నుంచి వచ్చిన డాల్డా వనస్పతి నూనె, వెజిటబుల్‌‌‌‌ నెయ్యి అంటే చాలామందికి తెలియకపోవచ్చు. కానీ.. ‘డాల్డా’ అంటే మాత్రం తెలియనవాళ్లు ఉండరు. ఈ బ్రాండ్‌‌‌‌ పేరు అంత పాపులర్ మరి. ఒకప్పుడు ఏ దావత్‌‌‌‌లో చూసినా వనస్పతితో వండిన వంటలు కనిపించేవి. అంతెందుకు పెద్ద రెస్టారెంట్లలో కూడా డాల్డా వాడేవాళ్లు. అందుకే 1980ల వరకు అమ్మకాల్లో డాల్డాకు పోటీనే లేదు. కా...


సంయుక్త సింప్లీ లుక్స్.. గోల్డెన్ లెగ్ అంటూ క్రెడిట్!

సంయుక్త మీనన్ చాలా సింపుల్‌గా తయారయింది. ఈ భామ అందాలకు నెటిజన్లు ఫిదా అయ్యారు.


Egg Pulusu : నిమిషాల్లో ప్రత్యేక రుచితో ఉండేలా గుడ్డు పులుసు తయారు చేయండి.. చాలా సింపుల్

Egg Pulusu Recipe In Telugu : ఎగ్ కర్రీని చాలా రకాలుగా చేసుకోవచ్చు. అయితే గుడ్డు పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ చేసేందుకు చాలా సింపుల్.


Facepack : ఈ ఫేస్‌ప్యాక్స్‌తో ముఖంపై ముడతలు తగ్గిపోతాయి..

Facepack : ఫేస్‌ప్యాక్స్ వాడడం వల్ల చర్మ సమస్యలు చాలా దూరమవుతాయి. చర్మం యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అందుకోసం ఏ ప్యాక్ వేయాలో తెలుసుకోండి.


Good Sleep ఈ పరిహారాలు పాటిస్తే.. చెడు కలలు రాకుండా హాయిగా నిద్రపోవచ్చు..!

Good Sleep మనలో చాలా మందికి రాత్రిళ్లు ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టదు. తరచుగా చెడు కలలు లేదా పీడ కలలొస్తుంటాయి. అయితే ఇలాంటి వాటిని విముక్తి పొందేందుకు కొన్ని పరిహారాలు పాటించాలి. ఇలా చేయడం వల్ల హాయిగా నిద్ర పడుతుందని పండితులు చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...


Money Horoscope: జూన్ 23 ధన జ్యోతిష్యం. వాళ్లు ఈ రోజును మర్చిపోలేరు!

(Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology (ధన జ్యోతిషం): ప్రముఖ జ్యోతిష్కులు భూమికా కలాం.. ప్రతి రోజూ ధన రాశి ఫలాలు ఇస్తున్నారు. ఏ రాశి వారికి ఎలాంటి ఆర్థిక ఫలాలు ఉంటాయో చెబుతున్నారు. జూన్ 23వ తేదీ, ఆదివారం నాడు అన్ని రాశుల ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):ఉద్యోగస్తులకు ఈరోజు చాలా మంచి రోజు. ఉద్యోగస్తులు ఈరోజు ఆఫీస్‌లో కొన్ని కొత్త బాధ్యతలు పొందుతారు, ప్రమోషన్ కూడా రావచ్చు. పరిహారం: చేపలకు పిండి మాత్రలు ఆహారంగా వేయండి. వృషభం (Taurus):ఈరోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. కానీ ఈ రోజు వ్యాపారంలో కొత్త ఒప్పందాన్ని ఖరారు చేయబోతున్నట్లయితే, అది మీకు మంచిది కాదు. ఆ డీల్ డేంజర్ అని తెలుసుకుంటారు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పరిహారం: శివ చాలీసా పఠించండి. మిథునం (Gemini):మిథున రాశి వారు ఈరోజు ఇల్లు లేదా దుకాణం కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటే, అందులో విజయం సాధిస్తారు. భవిష్యత్తులో దాని నుండి చాలా ప్రయోజనాలు పొందుతారు. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బును ఈ రోజు పొందవచ్చు, దీని కారణంగా మీ సంపద పెరుగుతుంది, మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఈరోజు మీరు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి, లేకుంటే నష్టపోవాల్సి ఉంటుంది. కొంతమంది శత్రువులు ఈరోజు ఉద్యోగస్తులను ఇబ్బందులకు గురిచేయవచ్చు, కాబట్టి తొందరపాటు చూపకుండా జాగ్రత్తగా వ్యవహరించండి, ఓర్పుతో పని చేయండి. అతి ఉత్సాహం ఏమాత్రం మంచిది కాదు. పరిహారం: సోమవారం నాడు ఉపవాసం ఉండి ప్రదోష కాలంలో శివుడిని పూజించండి. కర్కాటకం (Cancer):ఈ రోజు పెద్దల సలహాతో మీ వ్యాపారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. విదేశాలలో వ్యాపారం చేసే వారికి ఈరోజు శుభవార్తలు అందుతాయి. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. మీ సోషల్ సర్కిల్‌లో కూడా మీ పరిధి పెరుగుతుంది. దీని కోసం మీరు ప్రయాణం చేస్తూ ఉండండి. ఎలాంటి అపార్థాలు తలెత్తకుండా చూసుకోండి. మీరు పార్ట్ టైమ్ వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే, దాని నుండి ప్రయోజనం పొందుతారు. ఈ రోజు మీ ఇంటికి అవసరమైన కొన్ని వస్తువులను కొనుగోలు చేయవచ్చు. పరిహారం: విష్ణుమూర్తిని ఆరాధించండి. సింహం (Leo):సింహ రాశి వారు ఈరోజు తమ కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలను వింటారు. దీని వల్ల మీ ఆర్థిక భారం తగ్గి, మీ మనసు సంతోషంగా ఉంటుంది. వస్త్ర వ్యాపారం చేసే వ్యాపారులు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు, ఈ రోజు ఆఫీస్‌లో మీ శత్రువులు ఎవరైనా మీ పురోగతిని చూసి అసూయపడవచ్చు, కాబట్టి అందరితో మంచిగా ప్రవర్తించండి, లేకపోతే వారు మీకు హాని కలిగించే ప్రయత్నం చేయవచ్చు. పరిహారం: శివ కుటుంబాన్ని ఆరాధించండి, శివలింగానికి బిల్వ పత్రాలను సమర్పించండి. కన్య (Virgo):కుటుంబ ఆస్తికి సంబంధించి ఏదైనా వివాదం కొనసాగితే, అది ఈరోజుతో ముగుస్తుంది. నేడు మహిళా సహోద్యోగులు, అధికారులు ప్రభుత్వ ఉద్యోగులకు సహకరించాలి. పరిహారం: రుద్రాక్ష మాలతో మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. తుల (Libra):ఉద్యోగులకు గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సమస్యలు నేటితో తీరనున్నాయి. వ్యాపారస్తులు ఈరోజు ఆఫీస్‌లో ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు. పరిహారం: ప్రదోష కాలంలో శివలింగాన్ని పూజించండి. వృశ్చికం (Scorpio):మీ ఫీల్డ్‌లో కొత్త అవకాశాలు ఉంటాయి, ఇది మీ భవిష్యత్తును బలోపేతం చేస్తుంది. ఈరోజు మీరు ఆఫీస్‌లో అన్ని బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు. పరిహారం: శివలింగానికి తెల్ల చందనం రాయండి. ధనస్సు (Sagittarius):ఈరోజు వ్యాపారంలో కొత్త పనులు చేయడం వల్ల పరిస్థితి అనుకూలంగా కనిపిస్తుంది. మీరు పాత బాధ్యతల నుండి విముక్తి పొందవచ్చు. ఇంటికి అవసరమైన కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు, అయితే ముందుగా మీ జేబును జాగ్రత్తగా చూసుకోవాలి. ఆఫీస్‌లో కొత్త ప్రాజెక్ట్‌లపై మీ సూచనలను స్వాగతిస్తారు. వాటికి నాయకత్వం వహించమని కూడా మిమ్మల్ని అడగవచ్చు. పరిహారం: తల్లి ఆవుకు పచ్చి మేత తినిపించండి. మకరం (Capricorn):ఆఫీస్‌లో పెండింగ్‌లో ఉన్న పనులను ఈ రోజు పూర్తి చేస్తారు. దీనికి మీ అధికారులు కూడా మీకు సహాయం చేయగలరు. మీరు న్యాయపరమైన సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, ఈ రోజు పరిస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది. మీ మాటలతో అందరినీ సంతృప్తి పరచగలరు. కానీ ఈ రోజు మీ బంధువులు, స్నేహితులకు డబ్బు ఇవ్వకూడదు, లేకపోతే డబ్బు రాదు. పరిహారం: శివుని పూజించి, శివ చాలీసా పఠించండి. కుంభం (Aquarius):ఈ రోజు మీరు ఆఫీస్‌ నుంచి మంచి గౌరవం పొందుతారు. సహోద్యోగులతో మంచి సమయం గడుపుతారు, వారికి కొన్ని పనుల్లో సహాయం కూడా చేస్తారు. వారి వర్క్‌లో మీ సహకారం లభించడం వల్ల మీ కీర్తి పెరుగుతుంది. పరిహారం: ఈరోజు శివలింగానికి పాలు సమర్పించి పేదలకు దానం చేయండి. మీనం (Pisces):ఈరోజు వ్యాపారంలో పోటీ ఎదుర్కోవలసి రావచ్చు. పోయిన వస్తువులు, ధనాన్ని ఈరోజు పొందడం వల్ల మీ మనసు ఆనందంగా ఉంటుంది. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, ఈ రోజు బాగానే ఉంటుంది. అయితే ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు, మీ జీవిత భాగస్వామిని తప్పకుండా సంప్రదించండి. నేడు మీ ఆదాయం, ఖర్చులను బ్యాలెన్స్ చేసుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో అది కష్టం కావచ్చు. పరిహారం: సోమవారం నాడు ఉపవాసం పాటించండి, శివలింగానికి 21 బిల్వ పత్రాలను సమర్పించండి. Disclaimer:ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Vastu Tips: మీ రాశి ప్రకారం మీరు ఎలాంటి మొక్కలు పెంచితే మంచిదో తెలుసా?

ప్రతి రాశికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం , అంచనాలు అవసరాలు ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, వివిధ రకాల మొక్కలను నాటడం వల్ల జీవితంలో అదృష్టం , పర్యావరణాన్ని శుద్ధి చేయవచ్చు. సనాతన ధర్మంలో చెట్లను దేవతలుగా పూజిస్తారు. మేషం నుండి కన్యారాశి వరకు: ఈ 6 రాశుల వారు సంతోషకరమైన జీవితం కోసం ఈ మొక్కలను పెంచాలి. మేషం: ఈ రాశికి అధిపతి కుజుడు. వైబ్రెంట్ మేషం ఒక మనోహరమైన అగ్ని సంకేతం. మేషరాశి వారు మంగళవారం నాడు దానిమ్మ, నిమ్మ, తులసి, ఉసిరి, మామిడితో పాటు...


Aloe Vera Hair Mask: ఈ మాస్క్‌ ఒక్కటి జుట్టుకు పట్టించారంటే వద్దన్నా ఆరోగ్యంగా పెరుగుతూనే ఉంటుంది..

Aloe Vera Hair Mask: కలబందతో హెయిర్ మాస్క్‌ తయారు చేసుకోవడం వల్ల ఇది ఎఫెక్ట్ గా పని చేస్తుంది. జుట్టుని పొడుగ్గా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సమస్యలు రాకుండా నివారించి జుట్టును డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.


Adulterated Ghee | డీమార్ట్‌లో కల్తీ నెయ్యి అమ్మకాలు.. సీజ్‌ చేసిన ఫుడ్‌సేఫ్టీ అధికారులు

Adulterated Ghee | పేద, మధ్యతరగతి వినియోగదారులు ఎక్కువగా ఆదరించే డీమార్ట్‌ స్టోర్‌లో కల్తీ నెయ్యి అమ్మకాలు జరుగుతున్నాయి. నెయ్యి నాణ్యతపై అనుమానం వచ్చిన వచ్చిన ఓ వినియోగదారు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లోని ఓ డిమార్ట్‌ స్టోర్‌లో కల్తీ నెయ్యి పట్టుబడింది.


బుద్ధిగా బడికి పోకుండా ఏంటీ పనులు.. ఏదో చేద్దామనుకుంటే నడుము విరిగింది..!

ఇటీవల కాలంలో ప్రజలు తమ టాలెంట్ బయటపెట్టడానికి సోషల్ మీడియాను ఓ వేదికగా యూజ్ చేస్తున్నారు. కొందరు పాపులారిటీ, ఫాలోయింగ్‌తో పాటు డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. కొంతమంది మాత్రం లైక్స్ కోసం ప్రాణాలను రిస్క్‌ చేస్తున్నారు. రీల్స్ మోజులో కొందరు ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ వీడియోలు షూట్ చేసి, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. ఇలాంటివి చాలాసార్లు తేడా కొట్టాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం ఇద్దరు అమ్మాయిలు చేసిన స్టంట్ ఇలాగే రివర్స్...


జూట్‌ జోలే సచ్చాయీ

పావుకిలో పచ్చిమిర్చి కొంటే కవర్‌. అరకిలో టమాటాలకు ఇంకో కవర్‌. పాలిథిన్‌ సంచులు ముంచుతాయని హెచ్చరిస్తున్నా.. పట్టించుకోవడం లేదు. ఇదిలాగే కొనసాగితే.. నేలలో కరగని ప్లాస్టిక్‌ వ్యర్థాలు.. మనిషి శరీరంలోకి చేరిపోవడం ఖాయం. ఈ దుస్థితి దాపురించొద్దని పర్యావరణహిత ఆంత్రప్రెన్యూర్‌ అవతారమెత్తారు వైశెట్టి సునీతారాణి.


జూలై 19 రాశిఫలాలు: ఈ రోజు ఈ రాశివారు ఇతరుల లోపాలపై కాకుండా మీపై మీరు దృష్టి సారించడం మంచిది!

Daily Horoscope Predictions in Telugu మేష రాశి ఈ రోజు మీరు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కనబరుస్తారు. వైవాహిక జీవితంలో అశాంతి ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా అలసటను అనుభవిస్తారు. ఇతరుల లోపాలపై కాకుండా మీపై మీరు దృష్టి సారించండి. వృషభ రాశి ఈ రోజు మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ పని తీరు మెరుగుపడుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో...


Mushroom Fry: మష్రూమ్ ఫ్రై ఇలా చేసుకుంటే దీని ముందు చికెన్ ఫ్రై కూడా దిగదుడుపే

Mushroom Fry: పుట్టగొడుగులతో కర్రీ, బిర్యానీ, వేపుడు... ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ ఫ్రై కి పోటీ ఇచ్చేలా పుట్టగొడుగుల ఫ్రై చేయవచ్చు. ఆ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.


దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయకూడనిది ఏంటో తెలుసా?

ఇద్దరి మధ్య చిన్న మనస్పర్థలు పెద్ద అగాధానికి దారితీస్తాయి. ప్రేమలో ఉన్నవారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. పొరపాటున కూడా వారి నోటి నుంచి ఆ విషయాలు రాకుండా చూసుకోవాలి. వైవాహిక జీవితంలో ప్రతికూల , సానుకూల సంభాషణలను అంగీకరించడం తప్పనిసరి. భాగస్వామి చేసే పనిని రోజులు గడుస్తున్న కొద్దీ సానుకూలం నుంచి ప్రతికూలంగా మారుతూ వస్తుంది. మొదట్లో భాగస్వామి మంచి పనులు మాత్రమే మనకు కనిపిస్తాయి. రానురాను.. వారిలో మంచి తగ్గిపోయి.. వారిలోని చెడు అలవాట్లు, తప్పులు...


సండే ట్రై చేయండి : ఇంట్లోనే రెస్టారెంట్ స్టయిల్ మంచూరియా ఇలా తయారు చేసుకోవచ్చు..!

సండే ట్రై చేయండి : ఇంట్లోనే రెస్టారెంట్ స్టయిల్ మంచూరియా ఇలా తయారు చేసుకోవచ్చు..! మన్చాహె మంచూరియా ఏదైనా రెస్టారెంటికి వెళ్తే పిల్లల నుంచి పెద్దళ్లదాకా అందరూ ఇష్టంగా ఆర్డర్ చేసే స్టార్టర్ వెజ్ మంచూరియా. ఎంత తిన్నా 'నో' చెప్పకుండా తింటారు. కారం కారంగా ఎంత టేస్టీగా ఉంటుందే.. ఆ టేస్టీ వంటకాన్ని మీ వంటింట్లో కూడా టై చేయొచ్చు. హాయిగా ఇంట్లోనే రెస్టారెంట...


నవ గ్రహ ప్రభుత్వం!

జీవితంలో ప్రతి వ్యక్తీ అన్నీ ఉన్నా ఏదో కొరతతో బాధపడుతూంటారు. కొందరు సకల సౌభాగ్యాలున్నా కీర్తి దాహంతో బాధపడుతూంటారు.


ఇంటిని తుడవడానికి ఈ దుస్తులను వాడకూడదు తెలుసా?

మనలో చాలా మంది ఇంటిని శుభ్రం చేయడానికి ఇంట్లో ఉన్న పాత, పనికి రాని దుస్తులను ఉపయోగిస్తుంటారు. అయితే వాస్తు ప్రకారం.. ఇంటిని తుడవడానికి కొన్ని దుస్తులను అస్సలు ఉపయోగించకూడదు. అవేంటంటే? ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అలాగే ఇళ్లు కూడా నీట్ గా కనిపిస్తుంది. అయితే చాలా మంది ఇంటిని శుభ్రం చేయడానికి ఎక్కువగా మోప్ లకు బదులుగా ఇంట్లో ఉన్న పనికిరాని, పాత దుస్తులను ఉపయోగిస్తుంటారు. కానీ ఇంటిని శుభ్రం చేయడానికి కొన్ని రకాల దుస్తులను అస్సలు...


Nellore Style Chepala Pulusu: హోటల్ స్టైల్ నెల్లూరు చేపల పులుసు తయారీ.. ఒక్కసారి తింటే వదలరింక..

Nellore Style Chepala Pulusu: అందరికీ ఎంతో ఇష్టమైన చేపల రెసిపీల్లో నెల్లూరు చేపల పులుసు ఒకటి చాలామంది వారంలో ఒకసారైనా దీనిని తయారు చేసుకుంటారు. అయితే మీరు కూడా ఇంట్లోనే ఈ రెసిపీని తయారు చేసుకోవాలనుకుంటున్నారా.? ఇది మీకోసమే..


మార్కెట్‌లో కొద్ది రోజులు మాత్రమే దొరికే ఈ పండులో ఔషధ గుణాలెన్నో.. తింటే ఏం లాభమో తెలుసా

వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో లభించే ఖరెక్ ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. ఖరేక్ అని పిలువబడే ఈ పండును తినడానికి ప్రజలు ఏడాది పొడవునా వేచి ఉంటారు. ఈ పండు తినడానికి చాలా రుచిగా, అద్భుతంగా ఉంటుంది.దీన్ని కొన్ని ప్రాంతాల్లో ఈతకాయ అని కూడా అంటారు. ఈ పండులో వివిధ పోషకాలు,పోషక లక్షణాలు ఉన్నాయి. పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ మరియు విటమిన్లు వంటివి. ఇందులో విటమిన్ బి, కాల్షియం,ఐరన్ పుష్కలంగా ఉన్నాయి, ఇవి శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ పండు శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడుతుంది. ఖరెక్‌లోని విటమిన్లు,ఖనిజాలు హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతాయి. ఈ పండు శారీరక దృఢత్వాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఈ పండు కండరాలను బలపరుస్తుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ పండు పండినప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఏది తీపి మరియు అద్భుతమైన రుచి. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ పండును ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ పండు నగరాల్లోని మార్కెట్లలో చెట్లపై పెద్ద మొత్తంలో కనిపించడం ప్రారంభించింది. వీటిని ప్రజలు చాలా ఇష్టంగా తింటారు. ఈ పండు వేసవిలో కొన్ని రోజులు మాత్రమే మార్కెట్‌లో దొరుకుతుంది.


Tea: టీ తాగడానికి ఎన్ని నిమిషాల ముందు నీరు తాగాలో తెలుసా?

Drinking Water Before Tea is Right: భారతదేశంలోని ప్రతి సందర్భంలో టీ సిప్ లేకుండా చేయలేం. ఆఫీస్, ఇంట్లో, బయట ఎక్కడైనా సరే.. నలుగురు కలిస్తే.. టీ తాగాల్సిందే. కొన్నేళ్లుగా భారతదేశంలో టీ సంప్రదాయంగా మారింది. అతిథులు వస్తే ముందుగా టీ అందిస్తారు. అయితే టీ వల్ల కలిగే హాని గురించి అందరికీ తెలిసిందే. అతిగా టీ తాగడం ఆరోగ్యానికి హానికరం. టీలో కెఫిన్ , టానిన్లు అనే సమ్మేళనాలు ఉన్నాయి, ఇవి జీర్ణవ్యవస్థలో ఒత్తిడిని కలిగిస్తాయి. టానిన్లు మరింత ప్రమాదకరమైనవి....