దేశంలో అత్యంత అందమైన అమ్మాయిలు.. ఏ రాష్ట్రంలో ఉంటారో తెలుసా..?
అందానికి అనేక నిర్వచనాలు ఉన్నాయి. అందం అంటే శారీరకమైనదే కాదు.. మానసికమైనది కూడా. అలాంటి అందానికి పర్యాయపదం మగువలే. అందానికి నిర్వచనంగా చెప్పుకునే కొందరు మహిళలను రెప్ప వాల్చకుండా చూడాలనిపిస్తుంది. ఆ ఆకర్షణ శక్తి వారికే సొంతం. మన దేశంలో సౌందర్యం, ఆకర్షణ సమపాళ్లలో కలిసి అందం అంటే ఇదే అనిపించేలా ఉండే మహిళలు చాలా రాష్ట్రాల్లో ఉన్నారు. అయితే తెల్లటి రంగు, సన్నని శరీర నిర్మాణం, పొడవాటి జుట్టు, కమలం లాంటి కళ్లు, గులాబీ రేకుల లాంటి పెదవులు, ఎర్రటి బుగ్గలు ఉన్న మహిళలు అత్యంత అందమైన వారిగా భావిస్తుంటారు. వివిధ రాష్ట్రాల ప్రజలకు అందమైన మహిళల విషయంలో వేర్వేరు నిర్వచనాలు ఉన్నాయి. భారత దేశంలో ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో మహిళలు అత్యంత అందంగా ఉంటారు.. ఈ సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది. అయితే ఓ అధ్యయనం ప్రకారం దేశంలో అత్యంత అందగత్తెలు ఉన్న రాష్ట్రం ఏదో ఇప్పుడు తెలుసుకుందాం. భారత దేశంలో ఎంతో మంది సుందరీమణులు ఉన్నారు.. అయితే మహిళల చర్మం, కంటి రంగు, శరీర ఆకృతితో సహా అనేక అంశాలను పరిశీలించారు. అయితే దేశంలోనే అత్యంత అందమైన మహిళలు జమ్ము కశ్మీర్ లో ఉంటారని పలు అధ్యయనాలు చెపుతున్నాయి. ముఖ్యంగా హుంజా కమ్యూనిటీలోని మహిళలు వయసు పెరిగినా అందంగా ఉంటారని అంటున్నారు. ఇక హిమాచల్, ఉత్తరాఖండ్ లోని కొండ ప్రాంతాలకు చెందిన స్త్రీలు కూడా చాలా అందంగా ఉంటారని భావిస్తున్నారు. మణిపూర్, మిజోరంలో నివసిస్తున్న మహిళలు కూడా అందగత్తెల జాబితాలో ఉన్నారు. ఇక్కడ మహిళలతో ప్రేమలో పడని వారు ఉండరంట. వీరి ఆకర్షణీయమైన రూపం కారణంగా దేశంలోనే అందమైన మహిళల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఇక ఇక్కడి మహిళల అందానికి కారణం కాశ్మీర్ లోని పర్యావరణం, కొండ ప్రాంతాల్లో జీవనం అంటున్నారు నిపుణులు. అందుకే కశ్మీర్ కి సుందరీమణుల రాష్ట్రంగా పేరుంది. మరోవైపు ఇక్కడి మహిళలు చిన్నతనం నుంచి అందం విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు.. ముఖ్యంగా చర్మ సౌందర్యం, కేశాలంకరణపై తీసుకునే జాగ్రత్తల వల్ల ఇక్కడి మహిళలు చాలా హాట్, బోల్డ్‌గా కనిపిస్తారంట. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది.. దీనిని న్యూస్ 18 తెలుగు ధృవీకరించడం లేదు.)
2024-10-05T13:03:04Z
సామాన్యులకు బిగ్ షాక్.. కాకరేపుతోన్న వంట నూనె ధరలు!
పండుగల సీజన్ ప్రారంభం అయ్యింది. దసరా, దీపావళి వంటి పెద్ద పండుగలు రానున్నాయి. అయితే పండుగ సీజన్‌లో సామాన్యులకు భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వంట నూనె ధరలు భారీగా పెరిగాయి. దీంతో చాలా మందిపై నేరుగా ప్రభావం పడుతోంది. పండగలకు ముందు వంట నూనెల ధరలు మండుతున్నాయి. దీని వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం సుంకం పెంచటంతో వంట నూనెల ధరలు భగ్గుమంటున్నాయని చెప్పుకోవచ్చు. గత 15 రోజులుగా చూస్తే.. ఒక్కో కంపెనీ లీటరు నూనెపై రూ.10 నుంచి రూ.30 వరకు ధరలు పెంచేశాయి. గత 2 ఏళ్లలో ఎప్పుడూ లేనివిధంగా ధరలు పెరగటం వల్ల ప్రజలపై కోలుకోలేని భారం పడింది. మోదీ సర్కార్ ముడి చమురుపై దిగుమతి సుంకాన్ని 5.50 నుంచి 22 శాతానికి పెంచేసింది. అలాగే శుద్ధి చేసిన వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని 13.75 నుంచి 35.75 శాతానికి చేర్చింది. దీని వల్ల వంట నూనెల ధరలపై ప్రభావం పడింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లో గృహ, వాణిజ్య అవసరాల కోసం ప్రతినెలా సుమారు 4,200 మెట్రిక్ టన్నుల వంట నూనెలు వినియోగిస్తారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పొద్దుతిరుగుడు, పామాయిల్, వేరుసెనగ, రైస్‌బ్రాన్, ఇతర నూనెలు ఉపయోగిస్తారు. అయితే తాజాగా పెరిగిన ధరల కారణంగా ఉభయ జిల్లాల్లో వినియోగదారులపై రూ.కోట్ల భారం పడుతోంది. అయితే దసరా, దీపావళి, ఆ తర్వాత జాతీయ పండగల దృష్ట్యా ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే మరింత భారం మోయాల్సి రావొచ్చు. కాగా నిజామాబాద్‌లో కూడా వంట నూనె ధరలు ప్యాకెట్‌కు రూ.30 వరకు పెరిగాయి. రిటైల్ మార్కెట్‌లో ఆయిల్ ప్యాకెట్ల ధర లీటరుకు రూ.20-30 పెరిగింది. పొద్దుతిరుగుడు, పామోలిన్ మరియు వేరుశెనగ వంటి సాధారణంగా కొనుగోలు చేసిన నూనెలు ఇప్పుడు పెరిగిన ధరలకు అమ్ముడవుతున్నాయి. సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటర్ రూ.130, పామోలిన్ ఆయిల్ రూ.125, రైస్ బ్రాన్ ఆయిల్ రూ.135, వేరుశెనగ ధర రూ.160గా ఉంది. దీంతో పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలు నిత్యావసర వస్తువులను కొనలేక ఇబ్బందులు పడుతున్నారు.
2024-10-06T01:48:02Z
Lucky Rasiphalalu: ఆ రాశిలోకి బుధుడు.. వీళ్లకు ఇక తిరుగుండదు.. మీ రాశేనెమో చెక్ చేసుకోండి!
Lucky Rasiphalalu: ఈ నెల 11 నుంచి 29 వరకూ బుధుడు తులా రాశిలో సంచరించడం జరుగుతుంది. తులా రాశి బుధుడికి మిత్ర క్షేత్రం. వ్యాపారాలకు, సంపాదనకు, నైపుణ్యాలకు,తెలివితేటలకు, ప్లానింగుకు కారకుడైన బుధుడు ఈ రాశిలో సంచారం చేయడం వల్లకొన్ని రాశులకు అనేక విధాలుగా సంపాదన పెంచుతాడు. ఉద్యోగ, వ్యాపార, ఆర్థికస్థిరత్వాలను కలిగిస్తాడు. వ్యక్తిగత, ఆర్థిక, కుటుంబ సమస్యల నుంచిగట్టెక్కించడం కూడా జరుగుతుంది. మిథునం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు,మకర రాశులకు అనేక విధాలైన లాభాలను అందిస్తాడు. మిథునం ఈ రాశికి అధిపతి అయిన బుధుడు తులా రాశిలో సంచారం చేయడం ఈ రాశికి అనేక విధాలుగా మేలు చేకూరుస్తుంది. సరికొత్త ఆదాయ ప్రయత్నాలను చేపట్టి ఆశించిన విజయాలు సాధిస్తారు. అదనపు ఆదాయాన్ని షేర్లు, ఆర్థిక లావాదేవీల్లో మదుపు చేసి విశేషమైన లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి కనీ వినీ ఎరుగని రీతిలో చక్కబడుతుంది. వృత్తి, వ్యాపారాలను కొద్ది మార్పులతో లాభాల బాట పట్టిస్తారు. ఉద్యోగాల్లో సమర్థతను నిరూపించుకుని లబ్ధి పొందడం జరుగుతుంది. కర్కాటకం ఈ రాశికి నాలుగవ స్థానంలో బుధ సంచారం జరుగుతున్నంత కాలం సుఖ సంతోషాలకు, మన శ్శాంతికి కొదవ ఉండదు. ఆస్తి వివాదాలు, వ్యవహారాలు చక్కబడతారు. ఆస్తిపాస్తులను పెంచు కుంటారు. సొంత ఇంటి కోసం ప్రయత్నాలు సాగిస్తారు. ఉద్యోగంలోనే కాక సామాజికంగా కూడా హోదా పెరు గుతుంది. మంచి గుర్తింపు లభిస్తుంది. మాతృ సౌఖ్యం లభిస్తుంది. తల్లి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి లాభాల బాట పడతాయి. కన్య రాశ్యధిపతి బుధుడు ధన స్థాన సంచారం వల్ల ఆర్థికంగా అనేక ప్రయోజనాలు, లాభాలు పొందుతారు. ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరు స్తాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి, అప్రయత్న ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతాల పెరుగుదలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు కొద్ది మార్పులతో లాభాల బాటపడతాయి. పేరు ప్రతిష్ఠలు బాగా పెరుగుతాయి. తుల ఈ రాశిలో బుధ సంచారం వల్ల వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి కనీ వినీ ఎరుగని రీతిలో మెరుగుపడుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలకు, సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆస్తి వివాదం పరిష్కారమై, విలువైన ఆస్తి కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు బాగా వృద్ధి చెందుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ధనుస్సు ఈ రాశికి లాభ స్థానంలో బుధ సంచారం వల్ల లాభదాయక వ్యవహారాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగు తుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడ తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఉద్యోగంలో పదోన్నతులతో పాటు జీతభత్యాలు పెరిగే అవకాశం కూడా ఉంది. రావలసిన సొమ్ము తప్పకుండా చేతికి అందుతుంది. మకరం ఈ రాశికి దశమంలో బుధ సంచారం వల్ల ఉద్యోగ సంబంధమైన ప్రతి ప్రయత్నమూ విజయ వంతం అవుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడా నికి అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. పేరు ప్రతిష్ఠలు వృద్ధి చెందుతాయి. ఆస్తి సమ స్యలు, వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం).
2024-10-05T22:32:46Z