Trending:


Vinayaka Chavithi | ఈ గణపతిని పూజిస్తే.. 40 రోజుల్లోనే కోరికలు తీరుతాయట..!

Vinayaka Chavithi | వినాయక చవితి వచ్చిందంటే చాలు.. ఎక్కడ చూసినా గణనాథుల సందడి కనిపిస్తుంది. భిన్న ఆకృతులు, ప్రత్యేక రూపాల్లో గణేషుడి విగ్రహాలు కనువిందు చేస్తుంటాయి. అయితే వినాయకుడికి సంబంధి ఓ ఆలయానికి ప్రత్యేకత ఉన్నది. అక్కడి గణేషుడికి పది చేతులు ఉంటాయి. కుడివైపున తొండం ఉండి.. పక్కన ఒక చేత్తో భార్య సిద్ధిని ఆలింగనం చేసుకొని ఉంటారు ఆ విఘ్నాల అధిపతి. అదే ఆంధ్రప్రదేశ్‌లోని రాయదుర్గం దశభుజ గణపతి ఆలయం.


గరకపోస పైన గణపతి విగ్రహం.. సూక్ష్మ కళాకారుడి అద్భుత సృష్టి..

గరకపోస పైన గణపతి విగ్రహం.. సూక్ష్మ కళాకారుడి అద్భుత సృష్టి.. భారతీయ పండుగల్లో భక్తితో పాటు కళాత్మకతకు కూడా సముచిత స్థానం ఉంటుంది. ముఖ్యంగా వినాయక చవితి పండుగలో కళాత్మకతకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. పండుగ రోజు ప్రతిష్టింపజేసే గణనాధుని విగ్రహాలు, మండపాలు ఇందుకు నిదర్శనం.. భక్తికి, కళాత్మకతకు తనదైన సృజనాత్మకత జోడించి అద్భుతాన్ని సృష్టించాడు ఓ సూక్ష్మ ...


హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ రిస్క్‌ల గురించి తెలుసుకోండి

Hair Transplant: ఈ రోజుల్లో జుట్టు రాలే (Hair fall) సమస్య చాలా మందిని వేధిస్తోంది. హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్‌ తలెత్తితే చాలామంది ఆందోళన చెందుతారు. బట్టతల వచ్చి అంద విహీనంగా మారుతామేమో అని భయపడతారు. ఈ సమస్యను అధిగమించడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలోనే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలకు డిమాండ్ పెరిగిపోయింది. 2010-2021 మధ్యకాలంలో యూరప్‌లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు చేయించుకునేవారి సంఖ్య 240 శాతం పెరిగింది. ఇప్పుడు టర్కీలో ఈ రకం...


సెప్టెంబర్ 8 ధన జ్యోతిష్యం. వారికి అకస్మాత్తుగా భారీ మొత్తంలో డబ్బు అందుతుంది

(Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology (ధన జ్యోతిషం): ప్రముఖ జ్యోతిష్కులు భూమికా కలాం.. ప్రతి రోజూ ధన రాశి ఫలాలు ఇస్తున్నారు. ఏ రాశి వారికి ఎలాంటి ఆర్థిక ఫలాలు ఉంటాయో చెబుతున్నారు. సెప్టెంబర్ 8వ తేదీ, ఆదివారం నాడు అన్ని రాశుల ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):కొన్ని వ్యాపార పనుల కారణంగా, మీరు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు వ్యాపారానికి సంబంధించి కొంత ప్రయాణం కూడా చేయవచ్చు. ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. పరిహారం: లక్ష్మీదేవికి ఖీర్ సమర్పించండి. వృషభం (Taurus):ఈ రోజు మీరు దాతృత్వ పనుల కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు. దీని కారణంగా మీ కీర్తి ప్రతిచోటా వ్యాపిస్తుంది. అనవసర ఖర్చులకు, వివాదాలకు దూరంగా ఉండాలి. పరిహారం: ప్రతి రాత్రి నల్ల కుక్కకు చివరి రొట్టె పెట్టండి. మిథునం (Gemini):ఈరోజు అకస్మాత్తుగా భారీ మొత్తంలో డబ్బు అందుతుంది. దీని కారణంగా నైతికత పెరుగుతుంది. మీరు మీ జీవిత భాగస్వామి కోసం కొంత షాపింగ్ కూడా చేయవచ్చు. మీరు ఆదాయం, వ్యయం రెండింటినీ నియంత్రించాలి, లేకుంటే ఆర్థిక పరిస్థితి దెబ్బతినవచ్చు. ఈ రోజు మీరు ఏ పని చేసినా, దాని ఫలితాలను పొందే సమయం మీకు లభిస్తుంది. పరిహారం: మంగళవారం నాడు ఉపవాసం ఉండి, ఆంజనేయస్వామికి తమలపాకులు సమర్పించండి. కర్కాటకం (Cancer):ఈ రోజు వ్యాపారంలో కొన్ని కొత్త ప్రయత్నాలు చేస్తారు. అందులో విజయం సాధిస్తారు, మీ కీర్తి పెరుగుతుంది. సాయంత్రం అతిథుల రాక కారణంగా మీ ఖర్చు పెరుగుతుంది. వ్యాపారంలో ఉన్న సమస్యలను దూరం చేసుకోవచ్చు. పరిహారం: ఆంజనేయస్వామికి చోళాన్ని సమర్పించి, హనుమాన్ చాలీసా పఠించండి. సింహం (Leo):ఈ రోజు మీ రోజువారీ అవసరాలకు కొంత డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారంలో జరుగుతున్న సమస్యలు సోదరుడితో పంచుకుంటారు. ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఉద్యోగస్తులు పార్ట్ టైమ్ పని చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అందుకు ఈ రోజు తగిన సమయాన్ని కనుగొంటారు. వ్యాపారం చేసే వ్యక్తులు కొన్ని కొత్త ఒప్పందాలు పొందవచ్చు. పరిహారం: మంగళవారం నాడు ఉపవాసం ఉండి, ఆంజనేయస్వామికి పచ్చిమిర్చి సమర్పించండి. కన్య (Virgo):వ్యాపారంలో అధిక లాభాలు పొందడం ద్వారా మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. ఈరోజు మీరు మీ ఆదాయానికి మించి ఖర్చు చేస్తే, అది భవిష్యత్తులో ఇబ్బందిని కలిగిస్తుంది. కాబట్టి తెలివిగా డబ్బు ఖర్చు చేయండి. పరిహారం: బజరంగ్ బాన్ పఠించండి. ఆంజనేయస్వామికి బూందీని సమర్పించండి. తుల (Libra):ఈరోజు మీరు ఏ పని చేసినా అందులో పూర్తి విజయం సాధిస్తారు. ఉద్యోగంలో, మీకు అనుగుణంగా పని లభిస్తుంది. దాని కారణంగా మీరు సంతోషంగా ఉంటారు. మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ అధికారులు కూడా మిమ్మల్ని ప్రశంసించడం కనిపిస్తుంది. మీరు ఈరోజు ఆస్తిని కొనుగోలు చేయబోతుంటే, స్థిర, చర రెండు అంశాలను పరిశీలించండి. లేకుంటే నష్టం ఉండవచ్చు. పరిహారం: చీమలకు పిండి పోయండి. రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించండి. వృశ్చికం (Scorpio):ఈ రోజు శత్రువులు ఉద్యోగం, వ్యాపారంలో ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. మీరు జాగ్రత్తగా ఉండాలి. అందుకే కళ్లు, చెవులు తెరుచుకుని పని చేయాలి. వ్యాపారంలో లాభం కంటే ఎక్కువ ఖర్చుల కారణంగా మీరు ఆందోళన చెందుతారు. స్థానచలనం వాయిదా పడుతుంది. పరిహారం: ఆంజనేయ స్వామిని పూజించండి. ఐదు జాస్మిన్‌ ఆయిల్‌ ల్యాంప్స్‌ వెలిగించండి. ధనస్సు (Sagittarius):ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఈ రోజు మీరు శారీరక, ఆర్థిక బలాన్ని పొందుతారు. మీ ఆగిపోయిన పనులన్నింటినీ పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల అవసరాలు తీరుస్తారు, ఇది మీ ఖర్చులను మరింత పెంచుతుంది. వ్యాపారంలో ఒకరి సలహా అవసరం. ఉద్యోగస్తులు ఈరోజు ఇతర ఉపాధి కోసం చూస్తారు. పరిహారం: పేదలకు బట్టలు, ఆహారాన్ని దానం చేయండి. మకరం (Capricorn):ఈ రోజు సోదరులు, వ్యాపార సహచరుల మధ్య వైరం కారణంగా, అసౌకర్యంగా ఉంటుంది. మీరు దుకాణం లేదా ఇల్లు కొనాలని ఆలోచిస్తుంటే, మీ జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది. శత్రువులు మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు, వారు మీ పురోగతి చూసి కలత చెందుతారు. విద్యార్థులు ఈరోజు చదువులో కొంత డబ్బు కొరతను ఎదుర్కోవలసి ఉంటుంది. పరిహారం: హనుమాన్ చాలీసా 11 సార్లు పఠించండి. కుంభం (Aquarius):ఈరోజు వ్యాపారంలో లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది. కొన్ని వ్యాపార పర్యటనలు కూడా చేస్తారు. దీని వలన మీరు ప్రయోజనం పొందుతారు. విదేశాల నుంచి వ్యాపారం చేస్తున్న స్థానికులకు కొన్ని శుభవార్తలు అందుతాయి. స్నేహితుని సహాయంతో, మీరు నిలిచిపోయిన డబ్బులు పొందవచ్చు. ఇది ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది. పరిహారం: ఆంజనేయస్వామికి లడ్డూలను సమర్పించండి. మీనం (Pisces):ఈ రోజు ఉద్యోగస్తులకు పనిభారం, బాధ్యతలు పెరుగుతాయి. దీని కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తెలివితేటలు, గౌరవంతో, మీరు సాయంత్రం వరకు అన్ని పనులు పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు. మీకు ఏదైనా ఆస్తి సంబంధిత వివాదం ఉంటే, అది చట్టబద్ధం కావచ్చు. పరిహారం: మంగళవారం ఉపవాసం ఉండి, సుందరకాండ పఠించండి. Disclaimer:ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


రాత్రి పూట కీరా తింటే ఆరోగ్యమే

కీరదోసలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కీరదోసను రాత్రిపూట తింటే కలిగే లాభాల గురించి ఇక్కడ వివరించాం.


ఈ పచ్చి పెసర పప్పును 15 రోజులు రెగ్యులర్ గా తింటే ఏమౌతుందో తెలుసా?

పచ్చి పెసరపప్పును చాలా మంది మొలకలుగా ఉదయాన్నే తింటుంటారు. ఇది మన శరీరానికి అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా.. ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. మనం తినే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తింటే ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు. అదే మీరు చెడు ఆహారాలను తింటే గనుక లేనిపోని రోగాలు వస్తాయి. మన శరీరాన్ని ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచడానికి ఆరోగ్యకరమైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే మీరు మీ ఆహారంలో 15 రోజుల పాటు పచ్చి కాయధాన్యాలను చేర్చుకుంటే...


శాశ్వతంగా వంటగది నుండి బొద్దింకలను తరిమికొట్టండిలా..

ప్రతి వంటింట్లో బొద్దింకలు ఉండటం చాలా కామన్. కానీ ఇవి ఏం చేసినా బయటకు పోనే పోవు. అందుకే చాలా మంది వీటిని చూసి చూడనట్టుగా వదిలేస్తుంటారు. కానీ వీటివల్ల లేనిపోని రోగాలు వస్తాయి. అందుకే వీటిని చాలా సింపుల్ గా ఎలా తరిమికొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.. బొద్దింకలు లేని ఇల్లంటూ లేదు అని అంటే వినడానికి ఆశ్యర్యంగా అనిపించవచ్చు. కానీ ఇది నిజం. వంటగదుల్లో చీమలు,ఈగలతో పాటుగా బొద్దింకల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. బొద్దింకలే కదా వీటివల్ల ఏం జరుగుతుంది అని...


21 vegetable curry: గణేషునికి నివేదించే 21 కూరగాయలతో కూర తయారీ.. ఏమేం కూరగాయలు వాడతారంటే

21 vegetable curry: వినాయక చవితి రోజున చాలా చోట్ల 21 కూరగాయలతో చేసిన కూరను వినాయకునికి నైవేద్యంగా పెడతారు. దాని తయారీ విధానం ఏంటో వివరంగా చూసేయండి.


Vinayaka Chavithi Slokas: వినాయకుడి పూజ సమయంలో తప్పక పఠించాల్సిన మంత్రాలు..!

Ganesh Slokas: వినాయక చవితి రోజు వినాయకుడికి పూజ చేసేటప్పుడు ఈ మంత్రాలు జపించడం తప్పనిసరి.. ఇది మనస్ఫూర్తితో జపించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.. మరి ఆ మంత్రాలు ఏవో ఒకసారి చూద్దాం..


Rice Water: బియ్యం క‌డిగిన నీళ్ల‌తో ఇన్ని లాభాలు ఉన్నాయా.. తెలుస్తే అలసు వదిలిపెట్టరు..

Rice Water Benefits: బియ్యం నీళ్లు అంటే బియ్యాన్ని కడిగిన తర్వాత వచ్చే నీరు. ఈ నీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటుంది. వేల సంవత్సరాలుగా ఆసియా దేశాల్లో, ముఖ్యంగా జపాన్‌లో అందం కోసం బియ్యం నీటిని ఉపయోగిస్తున్నారు.


కిచెన్ లో వంట నూనెను ఆ చోట ఉంచితే.. మీరు త్వరగా ముసలి వాళ్లు అవడం గ్యారంటీ..!

చాలా మంది మహిళలు తరచూ వంట గదిలో స్టవ్ పక్కనే వంట సామానును పెడుతుంటారు. దాదాపు ప్రతి ఇంటిలోనూ ఇలానే చేస్తుంటారు. త్వరగా వంట పని పూర్తికావడానికి.. వస్తువులన్నీ అందుబాటులో ఉండాలని చకచకా వంట పూర్తి చేయడానికి ఇలా చేస్తుంటారు. ఇక ప్రస్తుతం చిన్న చిన్న ఇల్లులు కావడం.. వంటిల్లు కూడా చాలా ఇరుగ్గా ఉండటంతో అన్నిటినీ దగ్గరే పెట్టుకుంటున్నారు. ఇక స్టవ్ కు దగ్గర్లోనే పోపు దినుసుల బాక్స్, ఆయిల్ బాటిల్, మసాలాలు, పసుపు తదితర సామాన్లను అమర్చుకుంటారు. అయితే వారు స్టవ్ దగ్గర వాటిని నీటిగా అమర్చుకున్నా అది మంచిది కాదని ఓ అధ్యయనం చెపుతోంది. ముఖ్యంగా స్టవ్ పక్కన వంటనూనె పెట్టుకుని తరచూ ఉపయోగించడం వల్ల ప్రమాదకరమైన వ్యాధులు సంభవిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆయిల్ సీసాలను స్టవ్ వద్ద పెట్టుకోవడం వల్ల వేడికి నూనెలో ఆక్సీకరణ ప్రక్రియ వేగవంతమవుతుందని అధ్యయనంలో తేలింది. అంతేకాదు పొరపాటున వాడిన తర్వాత నూనె బాటిల్ పై మూతను తెరిచి ఉంచడం వల్ల అందులో కొవ్వు పదార్థాలు క్షీణించి రుచి మారుతుంది. దీంతో నూనె నుంచి దుర్వాసన రావడం ప్రారంభమవుతుందని పరిశోధకులు తెలిపారు. ఈ నూనె వంటల్లో వాడడం వల్ల త్వరగా వృద్ధాప్యం బారిన పడే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. అంతేకాదు దీనిని వాడిన వారిలో ఊబకాయం, జీర్ణ సమస్యల బారిన పడే అవకాశాలు ఉంటాయని అన్నారు. అందువల్ల నూనె బాటిల్ ను స్టవ్ పక్కన అస్సలు ఉంచకూడదని అంటున్నారు. గాలి, వెలుతురు సరిగ్గా తగిలే చోట ఉంచి, దానిపై మూతను గట్టిగా పెట్టి ఉంచాలని అంటున్నారు.


బొప్పాయిలో ఇది కలుపుకుని తింటే తొందరగా బరువు తగ్గుతారు

బరువు తగ్గడానికి బొప్పాయి పండు కూడా సహాయపడుతుందన్న ముచ్చట ఎవ్వరికీ తెలియకపోవచ్చు. కానీ ఈ పండులో రెండింటిని కలుపుకుని తింటే మీరు చాలా తొందరగా బరువు తగ్గుతారు. ప్రస్తుత కాలంలో అధిక బరువు సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ అధిక బరువుతో బాధపడుతున్నారు. ఈ ఓవర్ వెయిట్ ఒక అనారోగ్య సమస్యలా అనిపించకపోవచ్చు. కానీ ఇది మీకు డయాబెటీస్ నుంచి గుండెపోటు వరకు ఎన్నో రోగాలొచ్చేలా చేస్తుంది. బరువు తగ్గాలంటే మీరు రోజూ...


Ganesh Chaturthi 2024: పెసర గణేషుడు- ఆవాలు వినాయకుడు- వెరైటీ గణపతి విగ్రహాలకు కేరాఫ్ అడ్రెస్ సిక్కోలులోని ఈ పల్లెటూరు

Vinayaka Chavithi 2024: తొలి పూజలు అందుకునే గణపతి విగ్రహాల ఏర్పాటులో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. తొలి పూజ అయిపోయిన తర్వాత అందరీలోనూ ఒకటే చర్చ నడుస్తుంది. ఏ ఊరి గణపతి ఎలా ఉందంటూ ఆరా తీస్తుంటారు. పూజలోనూ, గణపతి విగ్రహం ఏర్పాటులోనూ తామే బెటర్‌గా ఉండాలని ట్రై చేస్తుంటారు చాలా పూజాకమిటీలు. కొందరు పెద్ద పెద్ద విగ్రహాలు ఏర్పాటులో శ్రద్ధపెడితారు. మరికొందరు చిన్నదైనా వెరైటీగా రూపొందించాలని చూస్తుంటారు. మరికొందరు మట్టిగణపతిని అందంగా తీర్చిదిద్ది బెస్ట్...


వినాయకుని అనుగ్రహం పొందాలంటే ఈ ఒక్కటి చేస్తే చాలు.. మీ కోరిక తీరినట్టే

భారతదేశంలో గొప్ప పండుగలో ఒకటి వినాయక చవితి. వినాయక చవితి తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పత్రి దేవునికి సమర్పించాలి. మన దగ్గర లభించే అటువంటి 21 ఔషధాలు మర్రి, జామ, మారేడు, జూవి ఇటువంటివన్నీ వెదజల్లేటువంటి వాసన ద్వారా ఆరోగ్యం బాగుంటుంది. పూజారి రామలింగయ్య శాస్త్రి లోకల్ 18 ద్వారా తెలియజేశాడు.వివరాల్లోకెళ్తే... భారతదేశం అంతటా వినాయక నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. దీనితో వినాయకుని పూజ సామాగ్రి కి సంబంధించిన పండ్లు, పలాలు, ఔషధ మొక్కలు గురించి మానవునికి...


Black Hair: హెయిర్ డై అవసరం లేదు.. 4 వారాల్లో తెల్లజుట్టు శాశ్వతంగా నల్లగా మార్చేస్తుంది ఈ గింజ.!

Black Hair: హెయిర్ డై అవసరం లేదు.. 4 వారాల్లో తెల్లజుట్టు శాశ్వతంగా నల్లగా మార్చేస్తుంది ఈ గింజ.!


పితృ పక్షం ముందు ఈ సంకేతాలు కనిపిస్తే.. మీ పూర్వీకులు కోపంగా ఉన్నారని అర్థం..!

సనాతన ధర్మంలో పితృపక్షానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం పితృ పక్షం సెప్టెంబర్ 17.. మంగళవారం ప్రారంభమై అక్టోబర్ 2న ముగుస్తుంది. పూర్ణిమ తిథి పితృపక్షం ప్రారంభాన్ని సూచిస్తుంది.. అమావాస్య తిథి ముగింపును సూచిస్తుంది. పితృపక్షంలో ప్రజలు తమ పూర్వీకుల కోసం శ్రాద్ధం, తర్పణాలు చేస్తారు, అయితే మీ ఇంట్లో పూర్వీకులు మీ పై కోపంగా ఉన్నారో లేదో తెలుసుకోడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి ఈరోజు మనం అవేంటో తెలుసుకుందాం.అయోధ్య...


Potato Smiles: పొటాటో స్మైల్స్ రెసిపీ ఐదు నిమిషాల్లో తయారు చేసుకోండి ఇలా!!

Potato Smiles Recipe: పొటాటో స్మైల్స్ కేవలం ఆహారం మాత్రమే కాదు, చిన్నారులను ఆకట్టుకునేలా తయారు చేసిన కళాఖండాలు. బంగాళాదుంపలను ఉపయోగించి వివిధ రకాల ముఖాలు, జంతువులు ఇతర ఆకారాలు తయారు చేస్తారు.


భార్య పేరు మీద ఇల్లు కొంటే ఇన్ని లాభాలా? భారీ మొత్తంలో డబ్బు మిగలడం ఖాయం

House Buying: అందరికీ ఓ ఇంటి యజమాని అనిపించుకోవాలనే కోరిక ఉంటుంది. అయితే ఈ రోజుల్లో ఇంటిని కొనుగోలు చేయడం ఖరీదైన వ్యవహారం. ఇంటి ధరతో పాటు, ఇల్లు రిజిస్టర్ చేయించడం, స్టాంప్ డ్యూటీ కట్టడం, ప్రాపర్టీ ట్యాక్స్ వంటి అదనపు ఖర్చులూ ఉంటాయి. ఈ ఖర్చులను తగ్గించుకోవాలంటే ఇంటిని భార్య (Wife) పేరు మీద కొనాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే భారత ప్రభుత్వం, మహిళలు (Women) అన్ని రంగాల్లో భాగం కావాలని, సమాజంలో చురుగ్గా పాల్గొనాలని...


ఈ రాశుల వారికి అస్సలు సహనం ఉండదు.. వీరిని పెళ్లి చేసుకుంటే చుక్కలు కనిపిస్తాయి!

వివాహం అనేది ప్రతి మనిషి జీవితంలో ముఖ్య ఘట్టం. ఇద్దరు మనుషులు ఒక్కటై ఎన్నో కలలతో దాంపత్య బంధంలోకి అడుగుపెడతారు. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే కొంతమంది కపుల్స్ మధ్య మనస్పర్థలు చోటుచేసుకుంటాయి. దీంతో ఎప్పుడూ గొడవలు పడుతూ వివాహ బంధంలో సమస్యలు కొని తెచ్చుకుంటారు. జంటలో ఎవరో ఒకరికి సహనం, ఓపిక లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పుకోవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్ని రాశులకు చెందిన పురుషులు అస్సలు సహనంతో ఉండరు. వీరిలో కోపం, భావోద్వేగం వంటి లక్షణాలు సంబంధాలు విచ్ఛిన్నమయ్యేందుకు కారణం అవుతాయి. వీరి నడవడిక వైవాహిక జీవితాన్ని మరింత కష్టతరం చేస్తుంది. ఆ రాశులేంటో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం) మేషరాశి : మేషరాశి పురుషులు ఉద్రేకపూరితంగా ఉంటారు. నిర్లక్ష్యంతో వీరు తీసుకునే నిర్ణయాలు గందరగోళానికి దారి తీస్తాయి. వీరు వ్యక్తిగత స్వాతంత్య్రానికి ప్రాధాన్యత ఇస్తారు. భార్య అవసరాలను అస్సలు పట్టించుకోరు. అంతేకాదు, వీరి నుంచి నిబద్ధత ఆశించడం చాలా కష్టం. వీరితో ఎక్కువ కాలం పాటు స్థిరమైన సంబంధాన్ని కొనసాగించడం కష్టమనే చెప్పవచ్చు. ప్రతి విషయంలో పోటీ పడుతూ నిరంతరం భాగస్వామితో ఘర్షణ పడుతుంటారు. (ప్రతీకాత్మక చిత్రం) సింహ రాశి : సింహరాశికి చెందిన పురుషులు భాగస్వామి అవసరాల కంటే తమ సొంత అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. వారి కోరికల కోసం స్వార్థంగా ఆలోచిస్తారు. వీరిలో గర్వం, అహం బాగా ఉంటుంది. ఇది ఇద్దరి మధ్య విభేదాలకు దారి తీస్తుంది. వీరు తమ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడరు. మనసులో నెగిటివ్‌ ఫీలింగ్స్‌పెట్టుకొని భాగస్వామితో తరచూ తగాదా పడుతుంటటారు. వీరు తమ భావోద్వేగాలను, ఆలోచనా విధానాన్ని మెరుగుపర్చుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం) ధనుస్సు రాశి : ధనుస్సు రాశికి చెందిన పురుషులు స్వేచ్ఛగా ఉండేందుకు ఇష్టపడతారు. తమ భాగస్వామి నిబద్ధతతో ఉండాలని ఆలోచిస్తారు. అయితే, భాగస్వామితో నిజాయితీగా వ్యవహరించరు. ఇది భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలకు దారి తీస్తుంది. ధనస్సు రాశి వారు సురక్షితమైన, స్థిరమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడంలో అనేక సవాళ్లు ఎదుర్కొంటారు. వీరు తమ భాగస్వామి అవసరాలకు అనుగుణంగా ఆలోచనా విధానాన్ని మర్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడే, జీవితాంతం సమస్యలు లేకుండా తమ దాంపత్య జీవితాన్ని కొనసాగించగలరు. (ప్రతీకాత్మక చిత్రం) మకర రాశి : మకర రాశి పురుషులు సంబంధాలు, భాందవ్యాల కంటే తమ కెరీర్‌కు ప్రాధాన్యతనిస్తూ వర్క్‌హోలిక్‌గా ఉంటారు. కుటుంబానికి సరైన సమయం కేటాయించరు. ఎప్పుడూ ఆఫీసు పని, తమ సొంత పనులకే ప్రాధాన్యతనిస్తారు. తమ బాధ్యతను బాగా నిర్వహిస్తున్నప్పటికీ.. భాగస్వామితో సమస్యలు తెచ్చి పెడుతుంది. మకర రాశి వారు అత్యంత భావోద్వేగ లక్షణాలను కలిగి ఉంటారు. మకర రాశి వారు భార్య పట్ల ఆప్యాయత చూపిస్తూ పని, కుటుంబ బాధ్యతలను సమతుల్యం చేయడం అలవర్చుకోవాలి. అప్పుడే ఎటువంటి సమస్యలు లేకుండా దాంపత్య జీవితం కలకాలం వర్ధిల్లుతుంది. (ప్రతీకాత్మక చిత్రం) కుంభ రాశి : కుంభ రాశికి చెందిన పురుషులు చీటికీ మాటికీ భార్యతో తగాదా పడుతుంటారు. వారి వ్యక్తిగత స్వేచ్ఛకే ప్రాధాన్యతనిస్తారు. వీరిలో సహనం చాలా తక్కువగా ఉంటుంది. భార్యతో ప్రేమగా కాకుండా కోపంతో మాట్లాడుతుంటారు. తద్వారా ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి వైవాహిక బంధంలో సమస్యలు వస్తాయి. వీరు తమ భాగస్వామితో సురక్షితమైన సంబంధాన్ని నిర్మించడం సవాలుగా మారుతుంది. కుంభ రాశికి చెందిన పురుషులు తమ భాగస్వామి పట్ల ప్రేమ కురిపించాలి. అంతేకాదు, సహనంతో వ్యవహరించాలి. అప్పుడే, వారి మధ్య బంధం కలకాలం దృఢంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం) (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.) (ప్రతీకాత్మక చిత్రం).


వెండి ఉంగరాలు పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

చాలా మంది బంగారు ఉంగరాలనే పెట్టుకుంటుంటారు. ఎక్కడో కొంతమంది మాత్రమే వెండి ఉంగరాలను పెట్టుకుంటారు. కానీ ఈ వెండి ఉంగరాలను పెట్టుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా? బంగారం కంటే వెండి ఆభరణాలకే ధర తక్కువగా ఉంటుంది. కానీ వెండికంటే బంగారు ఆభరణాలనే చాలా మంది ధరిస్తారు. కానీ వెండి ఆభరణాలు కూడా మీరు అందంగా కనిపించేలా చేస్తాయి. అంతకు మించి మీకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా వెండి ఉంగరాలను వేళ్లకు ధరించడం వల్ల మీరు నమ్మలేని ప్రయోజనాలను...


పిల్లలు ఎక్కువ సేపు ఫోన్ చూడకూడదంటే ఇలా చేయండి

ఈ రోజుల్లో పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లకు బానిసలుగా మారిపోయారు. నిజానికి పిల్లలు ఇలా కావడానికి అసలు కారణం తల్లిదండ్రులనే చెప్పాలి. కానీ ఈ అలవాటు పిల్లల్ని ఎన్నో రోగాల బారిన పడేస్తాయి. ఈ అలవాటు మాన్పియ్యాలంటే తల్లిదండ్రులు ఏం చేయ్యాలో తెలుసా? ఎంతో మంది గంజాయి, మద్యం, సిగరెట్ వంటి చెడు అలవాట్లు బానిసలవుతున్నారు. బంగారం లాంటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కేవలం ఇవే కాదు ఫోన్ వాడకం కూడా ఒక వ్యసనం లాంటిదే. ఇది మందు, సిగరెట్ల కంటే ఈ డిజిటల్ వ్యసనమే చాలా...


Yoga for Leg strength: కాళ్లలో సత్తువ, బలం పెంచే 5 అద్భుత ఆసనాలు, రోజూ 10 నిమిషాలు కేటాయించినా చాలు

Yoga for Leg strength: నటరాజ భంగిమ నుండి వృక్షాసనం వరకు, కాళ్లో బలం, ఫ్లెక్సిబిలిటీ పెంచడంలో సహాయపడే ఐదు యోగా ఆసనాలు ఇక్కడ ఉన్నాయి. వాటిని ప్రతి రోజూ అభ్యసించే ప్రయత్నం చేయండి.


దీపికా పదుకొనె బనారస్ చీర తయారీకి 6 నెలలా? అంత ప్రత్యేకత ఏంటి..?

ఇటీవల సిద్ధివినాయక ఆలయంలో దీపికా పదుకొణె పచ్చని రంగులో మెరిసే చీరలో కనిపించింది. ఆరు గజాల అందమైన ఈ చీర అందరిని ఆకట్టుకుంటుంది. ఈ చీరను ప్రముఖ డిజైనర్ ఒకరు త్వరలో తల్లి కాబోతున్న దీపికకు బహుమతిగా ఇచ్చారు. సిద్ధివినాయక ఆలయంలో తన భర్త రణ్వీర్ సింగ్ తో కలిసి దీపికా పదుకొణె పచ్చని బనారస్ చీరలో మెరిసిపోయింది. బంగారు రంగు అంచుతో పాటు పల్లూలోని అందమైన టసెల్స్ ఆకట్టుకున్నాయి. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా ఈ చీరను బనారసి బైఠక్ బ్రాండ్ నుండి...


శ్రీశైలం మల్లన్నకు భక్తుడి ఖరీదైన కానుక.. ఏకంగా 108 బంగారు పుష్పాలు

Kurnool Devotee Donated 108 Golden Flowers: ప్రముఖ శ్రీశైలం మల్లన్న ఆలయానికి ఓ భక్తుడు 108 బంగారు పుష్పాలను విరాళంగా అందజేశారు. కర్నూలు జిల్లాకు చెందిన బీసీ శివకుమార్‌ అనే భక్తుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో 19 గ్రాముల 108 బంగారు పుష్పాలను ఆలయంలో అందజేశారు. దాతకు వేద ఆశీర్వచనంతో స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలను అందజేశారు.


Horoscope: సెప్టెంబర్ 8 రాశిఫలాలు. వారి పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి

Rasiphalalu today:పన్నెండు రాశుల్లో ఇవాళ (8 సెప్టెంబర్, 2024 ఆదివారం) ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎవరికి అదృష్టం కలిసొస్తుంది? ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి? ఎవరిపై శని ప్రభావం ఉంటుంది? తెలుసుకుందాం. మేష రాశి (Aries):ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్థికంగా కొంత పురోగతికి కూడా అవకాశం ఉంది. స్థిరాస్తి వివాదం ఒకటి ఒక కొలిక్కి వస్తుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. వృత్తిలో కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టి ప్రయోజనం పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్ అందే అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. బంధుమిత్రులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం సజావుగా ఉంటుంది. వృషభ రాశి (Taurus):కొద్దిపాటి అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఆహార, విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరిగినా ఫలితం పొందుతారు. ఆదాయం నిలకడగా కొనసాగుతుంది. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. కొన్ని పనులు, ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. బంధుమిత్రులకు స్తోమతకు మించి సహాయపడతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. మిథున రాశి (Gemini):పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. కొందరు సన్నిహితుల నుంచి కొత్త ఉద్యోగానికి సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండకపోవచ్చు. ఉద్యోగంలో ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఊహించని ఆదాయ వృద్ధి ఉంటుంది. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. కర్కాటక రాశి (Cancer):అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు దాదాపు ఒక కొలిక్కి వస్తాయి. కొద్ది వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటేమీ ఉండదు. ప్రముఖుల నుంచి గుర్తింపు, సత్కారాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారులు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా, హుషారుగా ముందుకు సాగుతాయి. సింహ రాశి (Leo):సొంత పనులను పూర్తి చేయడం మీద, వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడం మీద శ్రద్ధ పెడతారు. పెండింగ్ పనులన్నిటినీ పూర్తి చేస్తారు. బంధువుల నుంచి అందిన శుభవార్త ఒకటి ఉత్సాహం కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ కొందరు స్నేహితులకు సహాయం చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కన్య రాశి (Virgo):ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి కేంద్రీకరిస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద శ్రద్ధ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకోకుండా కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆశించిన శుభవార్తలు వింటారు. తుల రాశి (Libra):కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులకు ఇతోధికంగా సహాయపడతారు. ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండదు. ఖర్చులు తగ్గించుకోవాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. వృశ్చిక రాశి (Scorpio):ఆర్థిక సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఆదాయం పెంచుకునే ప్రయత్నాలను కొనసాగిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు బాగా తగ్గే అవకాశం ఉంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన పనులను త్వరగా పూర్తవుతాయి. బంధువుల రాక వల్ల ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. దూరపు బంధువుల ద్వారా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ధనస్సు రాశి (Sagittarius):ఉద్యోగంలో మీ పనితీరు అధికారులకు సంతృప్తి కలిగిస్తుంది. అధికారులు కొత్త ప్రాజెక్టులను అప్ప గించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేపట్టి విజయాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలను కుటుంబ సభ్యుల సహాయంతో పూర్తి చేస్తారు. బంధువుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. జీవిత భాగస్వామితో కలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. మకర రాశి (Capricorn):వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. మిత్రులతో కలిసి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొందరు బంధువులకు అండగా నిలబడతారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. కొత్త ఉద్యోగావకా శాలు అందివస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుకుంటారు. కుంభ రాశి (Aquarius):వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. బాధ్యతలు బాగా పెరిగే సూచనలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు కాస్తంత నిదానంగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయడం మంచిది. ఉద్యోగపరంగా మంచి కంపెనీల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుకుంటారు. కొందరు స్నేహితుల వల్ల ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. అదనపు బాధ్యతల వల్ల ఒత్తిడి పెరిగి, విశ్రాంతి లభించదు. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. మీన రాశి (Pisces):కొందరు దూరపు బంధువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. పరిచయస్థులతో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. నూతన వస్తు లాభాలకు అవకాశం ఉంది. దీర్ఘకాలిక రుణాలను చాలావరకు తీర్చగలుగుతారు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను అమలు చేస్తారు. ఉద్యోగుల పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Healthy Tea tips: టీ తాగడం మానలేరా? ఇలా టీ చేసుకుంటే మెడిసిన్‌లా పనిచేస్తుంది

Healthy Tea tips: టీ తాగని వారు మన దేశంలో చాలా తక్కువ మంది ఉంటారు. టీ శరీరానికి అనారోగ్యకరమని ఎంత చెప్పినా టీ తాగడం మానలేరు. టీని ఆరోగ్యంగా చేయడానికి కొన్ని చిట్కాలు పాటించారంటే టీ ఆస్వాదిస్తూ ఆరోగ్యం పొందొచ్చు.


Health Tips: మలబద్ధకంతో బాధపడుతున్నారా ? వేయించిన ఈ గింజలు తిన్నారంటే కడుపు మొత్తం క్లీన్

వేయించిన సోపు గింజలు: మీరు ఎక్కడైనా భోజనం తినడానికి రెస్టారెంట్, హోటల్స్ నుండి బయలుదేరినప్పుడు, సిబ్బంది మీకు సొంపు గింజలను తీసుకువస్తారు. మీరు దీన్ని తినవచ్చు, కానీ దాని అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా? ఇది మౌత్ ఫ్రెష్‌నర్‌గా మాత్రమే తెలుసు. కానీ ఇది మీ జీర్ణక్రియకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు తరచుగా టాయిలెట్‌కి వెళ్లినా మీ పొట్టను క్లియర్ చేయలేకపోతే కాల్చిన సోపు తీసుకోవడం సహజమైన సమర్థవంతమైన నివారణ. సోపు జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు...


Venus Transit 2024: సెప్టెంబర్ 18న నీచరాశి నుంచి తులా రాశిలోకి శుక్రుడు ఈ రాశుల వారికి ఊహించని డబ్బు..

Venus Transit In Libra 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 18వ తేదీన శుక్రుడు నీచరాశి అయినా కన్యా నుంచి తులారాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.


Bellam kudumulu: వినాయకునికి నైవేద్యంగా పెట్టే బెల్లం కుడుముల తయారీ ఇదే

Bellam kudumulu: వినాయకుని ప్రసాదం కోసం బెల్లం కుడుములు తయారు చేసేయండి. గణేష్ చతుర్థి రోజు నైవేద్యంగా పెట్టే వీటి తయారీ చాలా సులభం. కావాల్సిన పదార్థాలేంటో, తయారీ విధానమేంటో చూడండి.


Ulli Masala: ఇంట్లో ఏమి కూర చేయాలో తోచనపుడు ఇలా ఉల్లి మసాలా కూర చేసుకోండి

Ulli Masala Recipe: ఉల్లిపాయలు మన భారతీయ వంటకాల్లో ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి ఉల్లిపాయలతో చేసే ఈ మసాలా కూర రుచికి రుచి, ఆరోగ్యానికి మంచిది. రైస్, చపాతి, బిర్యానీ వంటి వాటితో బాగా సరిపోతుంది.


Horoscope | 08-09-2024 ఆదివారం.. మీ రాశి ఫలాలు

Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..


భారీ వినాయక ప్రతిమలు తయారయ్యేది ఇక్కడే..

భారీ వినాయక ప్రతిమలు తయారు చేసేంది ఇక్కడే.. గత కొన్ని సంవత్సరాలుగా మహారాష్ట్ర, సోలాపూర్ కు చెందిన కళాకారులు అన్ని రకాల మోడల్స్ లో వినాయక ప్రతిమలు, దుర్గామాత విగ్రహాలు తయారు చేస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణగా కనువిందు చేస్తున్నాయి. అతి తక్కువ ధరల్లో అన్ని రకాల మోడల్స్ గణేష్ ప్రతిమలు తయారు చేస్తున్నామని మహారాష్ట్ర కళాకారుడు లక్ష్మణ్ లోకల్18 కి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కామారెడ్డి, కరీంనగర్, వేములవాడ రహదారికి అనుకొని ఉన్న కళాకార్ ఆర్ట్ ఆధ్వర్యంలో 5 ఫీట్ల నుంచి 14 ఫిట్ల వరకు మండప నిర్వహకుల అభిరుచికి అనుగుణంగా సకాలంలో తయారు చేసి అందిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. మిగతా దుకాణాలతో పోలిస్తే మా కళాకార్ ఆర్ట్ వద్ద తక్కువ ధరల్లో వినాయక ప్రతిమలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ ఉండటంతో తక్కువ ధరలు అందించడం సాధ్యమవుతుందని, దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి మండప నిర్వహకులు, సభ్యులు వచ్చి గణేష్ ప్రతిమలు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. దీంతో అధిక సంఖ్యలో మండప నిర్వహకులు విగ్రహాలు కొనేందుకు రావడంతో సందడి వాతావరణం నెలకొంది. గత కొన్ని ఏళ్లుగా మహారాష్ట్ర సోలాపూర్ కు చెందిన కళాకారులు ఇక్కడ గణేష్ ప్రతిమలే కాకుండా దుర్గామాత ప్రతిమలు కూడా తయారు చేస్తూ ఉపాధిని పొందుతున్నామని అన్నారు. రెండు మాసాలు పాటు ఇంటివద్ద అంటూ.. మిగతా 10 నెలలు విగ్రహాల తయారీలో నిమగ్నమవుతామని తెలిపారు. భారీ వినాయక ప్రతిమలు చూసేందుకు, కొనుగోలు చేసేందుకు మండప నిర్వహకులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. వినాయక చవితి వచ్చిందంటే చాలు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా.. ఊరు, వాడల్లో భారీ గణనాయకుల ప్రతిమలు మండపాల్లో నెలకొల్పి తొమ్మిది రోజులపాటు మండప నిర్వహకులు, ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్న తరుణంలో.. మండపాలన్నీ సందడిగా పండగ వాతావరణంలో దర్శనమిస్తాయి. ఇప్పటికే చాలా వరకు మండప నిర్వహకులు వినాయక ప్రతిమలను కొనుగోలు చేసి మండపాల్లో నెలకొల్పేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఇప్పటికే చాలా వరకు వినాయక ప్రతిమల అమ్మకాలు జరిపినట్లు కళాకారులు చెబుతున్నారు. మరికొన్ని ఆర్డర్స్ ఉన్నాయని, వాటిని రాత్రి, పగలు శ్రమించి తయారు చేస్తున్నట్లు లోకల్18కి చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మండప నిర్వహకులందరికీ ఎస్పీ అఖిల్ మహాజన్ సిరిసిల్ల పట్టణంతో పాటు వేములవాడ ప్రాంతాల్లో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నవరాత్రులు శాంతి భద్రతల పరిరక్షణకు, అందరూ కృషి చేయాలని కోరారు.


Navagrahalu: నవగ్రహాల ప్రదక్షిణలు చేసే వారు ఈ తప్పులు అస్సలు చేయకండి!

దేవాలయాల్లో నవగ్రహాలు ఎందుకు ఉంటాయో చాలామందికి సందేహం కలుగుతుంటుంది. అలాగే చాలా ఆలయాల్లో నవగ్రహాలు చుట్టూ ఎన్ని చుట్టూ తిరగాలో చాలామంది భక్తులకు సందేహం ఉంటుంది. అదేవిధంగా నవగ్రహాల చుట్టు తిరుగుతే ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలీదు. దీనిపై మరిన్ని అపోహల గురించి పార్వతి శంభు లింగేశ్వర ఆలయం అర్చకులు రామలింగయ్య శాస్త్రి లోకల్ 18 న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు. వివరాల్లోకెళ్తే… చాలామంది భక్తులు దేవాలయాలకు వెళ్లినాక మొదటగా గర్భగుడి కి వెళ్ళాలా లేదా నవగ్రహాల చుట్టూ తిరిగి వెళ్ళాలా అనేది రకరకాల సందేహాలు భక్తులకు నెలకొంటుంది. దీనిపై ప్రత్యేక కథనం లోకల్18 న్యూస్ ఛానల్కు అర్చకులు రామలింగయ్య శాస్త్రి తెలిపిన వివరాల ప్రకారం ఈ క్రింది విధంగా ఉన్నాయి. మొదటగా భక్తులు దేవాలయాలకు వచ్చినంక ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేసినంక గర్భగుడిలోని దేవుని దర్శనం చేసుకున్న తర్వాత నవగ్రహాల చుట్టూ తిరిగి వెళ్ళవచ్చు, లేదా మొదటగా నవగ్రహాలు చుట్టూ తిరిగి కాళ్లు కడుక్కున్న తర్వాత గర్భ గుడిలోని దేవాలయానికి దర్శనానికి వెళ్లాలి. అంతేగాని మొదటగా వచ్చి గర్భగుడిలోని దర్శనం చేసుకున్న తర్వాత ఇది మళ్లీ కాళ్లు కడుక్కొని నవగ్రహాలు చుట్టూ తిరగవద్దు ఎందుకంటే ఆల్రెడీ మనం గర్భగుడి లోని దేవుని దర్శనం చేసుకున్నాం కాబట్టి అతని అనుగ్రహం నా మీద ఉంటుంది కాబట్టి కాళ్లు కడవకూడదు. కడుక్కుంటే అతని అనుగ్రహం మన నుండి వెళ్ళిపోతుంది. ఈ విధంగా భక్తులు నవగ్రహాలు చుట్టూ తిరగడం వలన ఎటువంటి ఆరోగ్య సమస్యలైనా దరి చేరవు. ఎటువంటి కుజదోషం గ్రహ దోషాలు ఉన్న నవ గ్రహాలు చుట్టూ ప్రదర్శన చేస్తే వెళ్లిపోతాయి.ప్రదర్శనలు ఎన్ని చేయాలంటే 27 ప్రదర్శన చేయాలి. ఎందుకంటే నవ గ్రహాలు, గ్రహానికి మూడు చొప్పున 27 ప్రదర్శన చేస్తే మంచి జరుగుతుంది. నవగ్రహాలకు అన్నిటికి రాజు సూర్యుడు అని లోకల్ 18 న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశాడు.


ఈ సంవత్సరం ఇలాంటి వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోండి.. అదృష్టం మీ సొంతం

Ganesha Chaturthi 2024:అన్ని కష్టాలను తొలగించే విఘ్నేశ్వరుడిని పూజించే గణేశ చతుర్థి దేశంలో పెద్ద పండుగ. ఈ పండుగ సందర్భంగా భక్తులు తమ ఇళ్లకు వినాయకుని విగ్రహాన్ని తీసుకొచ్చి పది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ ఉత్సవంలో వినాయకుడి విగ్రహం మరో ప్రత్యేకత. కాబట్టి పండుగ రోజున ఉంచే వినాయక విగ్రహాల రకాలు మరియు వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. హిందూ మతం అత్యంత పవిత్రమైన పండుగగా భావించే గణేశ చతుర్థి వేడుకలు ఎక్కడికక్కడే వెలిశాయి. ఈసారి గణేష్ చతుర్థి శనివారం నుంచి ప్రారంభం కానుంది. వినాయకుడికి స్వాగతం పలికేందుకు దేశ వ్యాప్తంగా భక్తులు సిద్ధమవుతున్నారు. అన్ని కష్టాలను తొలగించే విఘ్నేశ్వరుడిని పూజించే గణేశ చతుర్థి దేశంలో పెద్ద పండుగ. ఈ పండుగ సందర్భంగా భక్తులు తమ ఇళ్లకు వినాయకుని విగ్రహాన్ని తీసుకొచ్చి పది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ ఉత్సవంలో గణపతి విగ్రహం మరో ప్రత్యేకత. కాబట్టి పండుగ రోజున ఉంచే వినాయక విగ్రహాల రకాలు మరియు వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. కూర్చున్న భంగిమ: కూర్చున్న గణేశుడు ఆనందం, శాంతి, శ్రేయస్సుకు చిహ్నం. ఇది సానుకూల శక్తిని, శాంతిని,ప్రశాంత వాతావరణాన్ని ఇస్తుంది. పడుకునే భంగిమ: ఆసన లేదా ఆనుకునే భంగిమలో వినాయకుడి విగ్రహం విలాసవంతమైన, సౌలభ్యం , శ్రేయస్సును సూచిస్తుంది. జీవితంలో విలాసమూ సుఖమూ కావాలనుకునేవారు శయన భంగిమలో వినాయకుడిని తీసుకొచ్చి ప్రతిష్ఠించాలి. తొండం ఎడమ వైపు గణేశ్ విగ్రహం: వినాయకుడు తన తొండం ఎడమవైపుకు వంగి ఉంటే అది ప్రశాంతత, శాంతి, సానుకూలతను సూచిస్తుంది. ఎలుక ఆకారం: గణేశుడి వాహనం ఎలుక. ఇది మన అహంకారాలను అధిగమించి జీవితంలో సరైన మార్గంలో రావడాన్ని సూచిస్తుంది. ఈ విగ్రహం వినయాన్ని ప్రోత్సహిస్తుంది. అహంకారాన్ని వీడడాన్ని సూచిస్తుంది. ఎలుక భౌతిక కోరికలు ,మనస్సు విరామం లేని స్వభావాన్ని సూచిస్తుంది. మోదక ఆకారం: గణేశుడికి ఇష్టమైన ట్రీట్, మోదకాలు భగవంతుని ఆనందకరమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. మోదక ఆకారపు విగ్రహంతో పాటు గణేశుడికి మోదకాలను సమర్పించడం ద్వారా భక్తులు అతని అనుగ్రహాన్ని మరింత పొందవచ్చు. గణేశ విగ్రహాన్ని ఎక్కడ ఉంచాలి? వాస్తు నిపుణులు గణేశ విగ్రహాన్ని ఉంచడానికి మీ ఇంటి లోపల పడమర, ఉత్తరం లేదా ఈశాన్య దిశలను సిఫార్సు చేస్తారు. ప్రధాన ద్వారం లోపల విగ్రహాన్ని ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది,


Horoscope: సెప్టెంబర్ 7 రాశిఫలాలు. వినాయక చవితి శుభాకాంక్షలతో!

Rasiphalalu today:పన్నెండు రాశుల్లో ఇవాళ (7 సెప్టెంబర్, 2024 శనివారం) ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎవరికి అదృష్టం కలిసొస్తుంది? ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి? ఎవరిపై శని ప్రభావం ఉంటుంది? తెలుసుకుందాం. మేష రాశి (Aries):రోజంతా ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. సకాలంలో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. కొద్ది ప్రయత్నంతో కుటుంబ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. వృషభ రాశి (Taurus):వృత్తి, ఉద్యోగాలు ఆశించిన విధంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యల కారణంగా కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. దైవకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. అనుకోకుండా ఒక శుభవార్త వింటారు. మిథున రాశి (Gemini):ఆర్థిక వ్యవహారాలను సంతృప్తికరంగా చక్కబెడతారు. చేపట్టిన ప్రతి పనీ సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతుంది. వృత్తి, ఉద్యోగాల మీద శ్రద్ధ బాగా పెంచుతారు. పిల్లల చదువులు సంతోషం కలిగిస్తాయి. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. కుటుంబ సమేతంగా ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. కుటుంబ సభ్యులు, తల్లితండ్రుల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. కర్కాటక రాశి (Cancer):వృత్తి, ఉద్యోగాల్లో పని భారం, ఒత్తిడి పెరిగినా, ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది కానీ, అనవసర ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాల్లో కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన స్పందన లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సింహ రాశి (Leo):కుటుంబపరమైన వ్యవహారాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఉద్యోగంలో అధికారుల తీరు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. లాభాలకు లోటుండదు. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో మెరుగైన ఫలితాలు అనుభవానికి వస్తాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. సప్తమ శని ప్రభావం వల్ల ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. కొద్దిగా ఒత్తిడి తప్పకపోవచ్చు. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కన్య రాశి (Virgo):వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. నెమ్మదిగా ఆర్థిక సమస్యల్ని పరిష్కరించుకుంటారు. గట్టి ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఉద్యోగ రీత్యా ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉన్నప్పటికీ, ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోక పోవడం మంచిది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. తుల రాశి (Libra):వృత్తి, ఉద్యోగాలకు ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. మీరిచ్చిన సలహాల వల్ల బంధుమిత్రులు ఆశించిన ప్రయోజనం పొందుతారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా ఆటంకాలుంటాయి. వృశ్చిక రాశి (Scorpio):పెండింగ్ పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. కొత్త ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇంటాబయటా అనుకూలతలు పెరుగుతాయి. మిత్రుల వల్ల ఇబ్బందిపడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఊపందుకుంటాయి. ధనస్సు రాశి (Sagittarius):అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆరోగ్యానికి లోటుండదు. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆధ్యాత్మికంగా యాక్టివిటీ పెరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. మకర రాశి (Capricorn):కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. వ్యక్తిగత వ్యవహారాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సి వస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో మీ మాటకు, చేతకు తిరుగుండదు. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. సమాజంలో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో చికాకులుంటాయి. కుంభ రాశి (Aquarius):ఇంటా బయటా పనిభారం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద ఎక్కువగా శ్రమపడతారు. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాలు బిజీగా సాగుతాయి. వ్యాపారాల్లో కూడా శ్రమ బాగా పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. మీన రాశి (Pisces):ప్రతి ప్రయత్నమూ, ప్రతి పనీ సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. గతంలో మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేసే అవకాశం ఉంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఆదాయం పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. బంధువుల నుంచి పెళ్లి సంబంధాల విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. పిల్లల చదువులు సంతృప్తికరంగా సాగిపోతాయి. ప్రేమ వ్యవహారాల్లో అసంతృప్తి ఉంటుంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


యాపిల్, ఆరెంజ్ పళ్లపై ఈ స్టిక్కర్స్ ఎందుకుంటాయో తెలుసా? వెంటనే తెలుసుకొని జాగ్రత్త పడండి

ఆరోగ్యానికి పండ్లు మేలు చేస్తాయని, తరచూ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని తరచూ ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో తాజా పండ్లు లభించడం లేదు. పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు, తాజాగా కనిపించేందుకు, పక్వానికి రావడానికి రసాయనాలు వినియోగిస్తున్నారు. అందుకే పండ్లు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మార్కెట్‌లో కొనుగోలు చేసే కొన్ని రకాల పండ్లపై స్టిక్కర్లు ఉంటాయి. ముఖ్యంగా యాపిల్, నారింజ పండ్లపై వీటిని గమనించవచ్చు. వాటి గురించి పట్టించుకోకుండా కొనుగోలు చేస్తుంటారు. ఇంతకీ స్టిక్కర్లపై ఉన్న నంబర్లు దేనికి సంకేతం? ఇప్పుడు తెలుసుకుందాం. యాపిల్, ఆరెంజ్ పండ్లపై ఉన్న స్టిక్కర్లను పట్టించుకోకుండా వాటిని కొనుగోలు చేసి తినడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. పైగా మనలో చాలామంది స్టిక్కర్ల ఉన్న పండ్లు ఖరీదైనవి, తాజాగా ఉండేవి అని భావిస్తారు. అది వాస్తవం అది కాదు. పండించిన విధానానికి సూచిక : యాపిల్, ఆరెంజ్ పండ్లపై ఉన్న స్టిక్కర్లు వాస్తవానికి మన ఆరోగ్యానికి సంబంధించినవి. స్టిక్కర్లపై ఉండే నంబర్లు ఆ పండ్ల నాణ్యత, పండించిన విధానాన్ని తెలుపుతాయి. అంటే జన్యుమార్పిడి, రసాయనాలు లేదా సేంద్రీయంగా పండిచారా అనే విషయాన్ని సూచిస్తాయి. సాధారణంగా యాపిల్స్, ఆరెంజ్ పండ్లపై ఉండే స్టిక్కర్ల మీద మూడు రకాల నంబర్లు ఉంటాయి. 4 అంకెతో ప్రారంభమైతే రసాయనాలు : కొన్ని పండ్ల స్టిక్కర్ మీద 4889 లేదా 4047 వంటి నాలుగు అంకెల నంబర్ ఉంటుంది. 4 అంకెతో ప్రారంభమైతే ఆ పండ్లు పురుగు మందులు, రసాయనాలతో పడించారని అర్థం. పంట సమయంలో తెగుళ్ల నుంచి రక్షించడానికి పండ్లకు తరచుగా పురుగుమందులను పిచికారి చేసి ఉంటారు. ఈ పండ్లపై రసాయన అవశేషాలు ఉంటాయి. అందుకే ఇవి తక్కువ ధరకు లభిస్తాయి. 8తో ప్రారంభమైతే జన్యుమార్పిడి : మరికొన్ని పండ్లపై ఉండే స్టిస్కర్ మీద 86344 లేదా 80934 వంటి ఐదు అంకెల సంఖ్య ఉంటుంది. ఈ సంఖ్య 8తో ప్రారంభమవుతుంది. దాని అర్థం ఏంటంటే ఈ సంఖ్య ఉండే పండ్లు జన్యుపరంగా మార్పు చెందినవి, సహజమైనవి కావు. ఈ రకమైన పండ్లు సాధారణంగా పురుగుమందులతో పిచికారి చేసిన పండ్ల కంటే ఖరీదైనవి. వీటి వల్ల కొన్ని ప్రత్యేక లాభాలు, నష్టాలు కూడా ఉంటాయి. నంబర్‌ 9తో ప్రారంభమైతే? : మరికొన్ని పండ్లపై కూడా 5 అంకెల సంఖ్యతో స్టిస్కర్ ఉంటుంది. అయితే అది 9 అంకెతో ప్రారంభమవుతుంది. ఉదాహరణగా 98364 మాదిరి ఉంటుంది. 9 అంకెతో ప్రారంభమై ఐదు అంకెల సంఖ్య ఉన్న పండ్లు పురుగుమందులు లేదా రసాయనాలు ఉపయోగించకుండా సేంద్రియ పద్ధతిలో పండించారని అర్థం చేసుకోవాలి. వీటిని సహజసిద్ధంగా పండిస్తారు. తినడానికి సురక్షితమైనవి. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. వాటి ధర కూడా చాలా అధికంగా ఉండవచ్చు.


తలస్నానం ముందు ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గి పొడుగ్గా పెరుగుతుంది

జుట్టు పొడుగ్గా పెరగాలని చాలా మందికి ఉంటుంది. కానీ, నేటికాలంలో కొన్ని సమస్యల కారణంగా జుట్టు రాలుతుంది. వాటికి చెక్ పెట్టి జుట్టు పొడుగ్గా పెరగాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.


Corn flour: కార్న్‌ఫ్లోర్ చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుందంటే నమ్ముతారా? ఇలా వాడితే సాధ్యమంటున్న సర్వే

Bad cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రించడంలో మొక్కజొన్న పిండి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయమనిఇటీవలి అధ్యయనం చెబుతోంది. దీని ప్రకారం ఊహించని ఫలితాలు బయటపడ్డాయి. దాని ప్రభావం ఎలాగుంటుందో తెల్సుకోండి.


యాదగిరిగుట్ట శివాలయంలో గణపతి ఉత్సవాలు

యాదగిరిగుట్ట శివాలయంలో గణపతి ఉత్సవాలు యాదాద్రిభువనగిరి:యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహా స్వామి ఆలయ అనుబంధ శివాలయంలో గణపతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాల ను పురస్కరించుకొని శివాలయంలో పుణ్య హవాచనం, రక్షాబంధనం, కలశస్థాపన, గణపతి పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో భాస్కర్ రావు , అనువంశిక ధర్మకర్త నరసింహ మూర్తి ఈ పూజలు నిర్వహించారు. ALSO READ |...


వానలు పోవాలని చిలుకూరులో ప్రదక్షిణలు

వానలు పోవాలని చిలుకూరులో ప్రదక్షిణలు రంగారెడ్డి : గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు నీట మునిగాయి.  భారీగా ఆస్టి, ప్రాణ నష్టం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో శనివారం ( సెప్టెంబర్ 7, 2024) నాడు వర్షాలు ఆగిపోవాలని రంగారెడ్డి జిల్లా చిలుకూరులో బాలాజీ టెంపుల్ లో భక్తులు స్వామివారికి ప్రదక్ష...


Tulsi Ginger Water: ఖాళీ కడుపుతో ఈ రెండిటిని కలిపి తింటే బోలెడు లాభాలు మీసొంతం!

Tulsi Ginger Water Uses: తులసి, అల్లం రెండూ ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఔషధ మూలికలు. ఈ రెండింటిని కలిపి తయారు చేసిన నీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.


Weekly Horoscope | ( 8.9.2024 నుంచి 14.9.2024 వరకు )

తలపెట్టిన కార్యాలు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.


రాశిఫలాలు 08 సెప్టెంబర్ 2024:ఈరోజు బుధాదిత్య యోగం వేళ మకరం, కుంభం సహా ఈ రాశులకు అదృష్టం పెరగనుంది..!

horoscope today 08 September 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు బుధాదిత్య యోగం, శుక్ల పంచమి సందర్భంగా మకరం, కుంభం సహా ఈ రాశులకు అదృష్టం పెరగనుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...


Mint Leaves: ప‌ర‌గ‌డుపునే పుదీనా ఆకుల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసుకోండి!!

Mint Leaves Health Benefits: పుదీనా ఆకులు ఎంతో ప్రసిద్ధి చెందినవి. వీటిని మనం తరుచుగా ఆహారంలో ఉపయోగిస్తాము. కానీ ఇవి వంటలు రుచిగా మార్చడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీని వల్ల ఆరోగ్యలాభాలు ఏంటో తెలుసుకుందాం.


Ganesh Visarjan 2024 గణపతి నిమజ్జనం వెనకున్న రహస్యాలేంటో తెలుసా...

Ganesh Visarjan 2024 వినాయక విగ్రహాలను నీటిలోనే ఎందుకు నిమజ్జనం చేస్తారు.. ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి.. దీని వెనుక ఉన్న రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...


Parwal: ఈ కూర‌గాయ మీకు తెలుసా.. లాభాలు తెలుస్తే షాక్‌ అవుతారు!

Parwal Health Benefits: పర్వాల్ వేసవి కాలంలో మనకు లభించే అద్భుతమైన కూరగాయ. దీనిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.


Skin Care: ముల్తానీ మిట్టీ ఈ విధంగా రాశారంటే.. మీ ముఖం మరింత యంగ్‌గా మెరుస్తుంది..!

ముల్తానీ మిట్టి అనేది ఖనిజాలతో సమృద్ధిగా ఉండే మట్టి లాంటి పదార్థం. ముఖ్యంగా సహజ శోషక లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది చర్మంలోని జిడ్డును గ్రహించి, ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. తరచుగా ఎక్స్‌ఫోలియేటర్ లేదా ఫేస్ ప్యాక్‌గా ఉపయోగిస్తారు. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది చర్మం నుండి మలినాలను ,అదనపు నూనెను తొలగిస్తుంది, మీ చర్మం రిఫ్రెష్ అవుతుంది. ముల్తానీ మిట్టిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. పొడి చర్మం కోసం... ఒక గిన్నెలో 1 టీస్పూన్ ముల్తానీ మిట్టిని తీసుకోండి. పేస్ట్ చేయడానికి దీనికి కొద్దిగా పాలు జోడించండి. దీన్ని మీ ముఖం , మెడ అంతటా రాయండి. 10 నిమిషాలు ఆరనివ్వండి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మం మెరుస్తుంది. జిడ్డు చర్మం కోసం... ముల్తానీ మిట్టిని తీసుకుని దానికి కొన్ని చుక్కల రోజ్ వాటర్ వేయండి. ఒక పేస్ట్ తయారు చేసి, ఆపై మీ ముఖం మొత్తం అప్లై చేయండి. దీన్ని 10 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత కడిగేస్తే మీ ముఖంపై జిడ్డును నియంత్రిస్తుంది . బ్రేక్‌అవుట్‌లను తగ్గిస్తుంది. నల్ల మచ్చలను వదిలించుకోండి. 1 టీస్పూన్ ముల్తానీ మిట్టిని గ్లిజరిన్‌తో కలిపి పేస్ట్ చేయండి. దీన్ని మీ ముఖం మెడ అంతటా రాయండి. ఇప్పుడు, 10 నిమిషాలు ఆరనివ్వండి . చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేస్తే ముఖంపై ఉన్న నల్ల మచ్చలు పోయి చర్మం అందంగా మారుతుంది. మొటిమలను నివారించడానికి... ఒక గిన్నెలో 2 టీస్పూన్ల ముల్తానీ మేతి, 2 టీస్పూన్ల చందనం పొడి కొద్దిగా రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. దీన్ని మీ ముఖం , మెడ ప్రాంతంలో అప్లై చేసి 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. వారానికోసారి ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి . వృద్ధాప్య రూపాన్ని నివారించడానికి... ఒక గిన్నెలో సుమారు 4 టేబుల్ స్పూన్ల ముల్తానీ మిట్టిని తీసుకుని, 6 టేబుల్ స్పూన్ల మెంతి పొడి , 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం జోడించండి. ఈ పేస్ట్‌ని మీ ముఖం , మెడ ప్రాంతంలో అప్లై చేసి బాగా కడగాలి. ఇలా వారానికోసారి చేస్తే పాత రూపం మారి చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. గమనిక: సున్నితమైన చర్మం ఉన్నవారు ముల్తానీ మిట్టిని నీటితో భర్తీ చేయండి , పాలు, గ్లిజరిన్, కొబ్బరి నూనె లేదా రోజ్ వాటర్ వంటి మాయిశ్చరైజర్‌ను జోడించండి.


తమలపాకులతో 10 అడుగుల ఎత్తైన గణపతి

10 feet tall Ganapati with Betel Leaves


21 ముఖాల రుద్రాక్ష గురించి విన్నారా? ధర, లాభాలు తెలిస్తే షాక్ అవుతారు

మీకు తెలుసా.. పరమ శివుడికి ఎంతో ఇష్టమైనవి రుద్రాక్షలు. ఇవి ఆ రుద్రుడి కళ్ల(అక్షాలు) నుంచి ఉద్భవించాయట. అందుకే వీటిని రుద్రాక్షలు అంటారు. ఇవి అనేక రకాల ముఖాలను కలిగి ఉంటాయి. మనందరం ఎక్కువగా పంచముఖి రుద్రాక్షలను ఎక్కువగా చూస్తుంటాం. అయితే 21 ముఖాలున్న రుద్రాక్ష కూడా ఉందని మీకు తెలుసా? ఆ రుద్రాక్ష గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. అత్యంత అరుదైన రుద్రాక్షలలో ఒకటి. దీనికి అద్భుతమైన ఆధ్యాత్మిక, ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ రుద్రాక్షను ధరించడం వల్ల...


whiskey ice cream | విస్కీ ఐస్ క్రీమ్

విస్కీతో తయారు చేసిన ఐస్ క్రీమ్ విక్రయిస్తున్న ఐస్ క్రీమ్ దుకాణం యజమానులు దయాకర్ రెడ్డి, శోభన్ లను ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ఐస్ క్రీమ్ తయారీదారులు 60 గ్రాముల ఐస్ క్రీంలో 100 ఎంఎల్ విస్కీ కలుపుతున్నట్లు అధికారులు తమ తనిఖీల్లో గుర్తించారు.