Trending:


వర్షంలో తడిస్తే ఏమౌతుందో తెలుసా?

కొంతమందికి వానలో తడవడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ కొంతమందికి మాత్రం వానలో తడవడమంటే చాలా ఇష్టం. మీకు ఇష్టం ఉన్నా.. ఇష్టం లేకున్నా.. వానలో తడిస్తే గనకు ఏమౌతుందో తెలుసా? ఆశాడంలోనే వాన గ్యాప్ ఇవ్వకుండా పడుతోంది. ఇక శ్రావణ మాసంలో ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వర్షాకాలంలో.. వర్షంలో తడిచే అలవాటు చాలా మందికి ఉంటుంది. కొంతమంది అనుకోకుండా వానలో తడవాల్సి వస్తుంది. నిజానికి వానలో తడవడం సరదాగా ఉంటుంది. వర్షంలో తడవకూడదు, దగ్గు, జలుబు,...


Herbal Tea : ఈ హెర్బల్ టీ తాగితే జలుబు, దగ్గు దూరం..

Herbal Tea : వర్షాకాలం వచ్చిందంటే చాలా మందికి జలుబు, దగ్గు సమస్యలు మొదలవుతాయి. దీనిని తగ్గించుకుపోతే అది ఫ్లూగా మారుతుంది. దీనిని తగ్గించేందుకు ఆయుర్వేద టీ హెల్ప్ చేస్తుంది. అదేంటో తెలుసుకోండి.


Today Rasi Phalalu: ఈ రాశి వారికి ధనలక్ష్మి తలుపు తడుతుంది, కీర్తి పెరుగుతుంది!

Today Rasi Phalalu: ఈ రాశి వారికి ధనలక్ష్మి తలుపు తడుతుంది, కీర్తి పెరుగుతుంది!


జుట్టుకు ఆరోగ్యం పట్టిద్దాం

కాలం ఏదైనా జుట్టు సమస్యలు సర్వసాధారణం. అయితే, వర్షాకాలం ఆ సమస్య మరింత ఎక్కువవుతుంది. వర్షంలో తడవడం వల్ల జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. కురులు నిగారింపు కోల్పోతాయి. కుదుళ్లు బలంగా ఉన్నప్పుడే కురులు అందంగా కనిపిస్తాయి. పై పూతలకన్నా... ఆహారంలో మార్పుచేర్పుల వల్ల జుట్టు సమస్యలను దూరం చేయవచ్చు.


Today Panchangam 27 July 2024 ఈరోజు రేవతీ నక్షత్రం వేళ విజయ ముహుర్తం, రాహుకాలం ఎప్పుడొచ్చాయంటే...

today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, ఆషాఢ మాసంలోని సప్తమి తిథి నాడు, శనివారం ఈరోజున రాహుకాలం, దుర్ముహుర్తం, సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...


Shiva Blessed Zodiacs: ఈ రాశులంటే శివుకుడి చాలా ఇష్టం.. శ్రావణ మాసంలో వీరికి డబ్బే డబ్బు!

Shiva Blessed Zodiacs: శ్రావణ మాసంలో శివుడిని పూజించడం ఆనవాయిగా వస్తోంది. అయితే ఈ మహా శివుడు శ్రావణ మాసంలో కొన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతాడు. అయితే ఈ సమయంలో శివుడి అనుగ్రహం పొందే రాశులేంటో తెలుసుకోండి.


Silver Cleaning: సిల్వర్ వస్తువులు క్లీన్ చేసే 4 సింపుల్ ఇంటి చిట్కాలు..

Silver Cleaning: సిల్వర్ వస్తువులు క్లీన్ చేసే 4 సింపుల్ ఇంటి చిట్కాలు..


Mouni Roy Hot Pics: కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న మౌని రాయ్..

Mouni Roy Hot Pics: కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న మౌని రాయ్..


Aloo Chaat: స్ట్రీట్ స్టైల్ ఆలూ చాట్‌.. ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!

Aloo Chaat Recipe: ఆలూ చాట్‌ ఎంతో రుచికరమైన స్ట్రీట్ డిష్‌. దీని పిల్లలు,పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. కానీ బయట తయారు చేసే ఈ చాట్‌ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కానీ దీని మనం ఇంట్లోనే సలుభంగా తయారు చేసుకోవచ్చు. కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.


Weekly Horoscope | రాశి ఫలాలు ( 28.7.2024 నుంచి 3.8.2024 వరకు )

మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. పెట్టుబడులకు ప్రతిఫలాలు అందుతాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. బాల్యమిత్రులను కలుసుకుంటారు. ఆస్తి పంపకాలకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలం అవుతాయి. కుటుంబసభ్యులతో కలిసి విందులకు హాజరవుతారు. అనవసర భయాలకు దూరంగా ఉంటారు. దుర్గాదేవి స్తుతి మంచిది.


Shivaparvathi: శివపార్వతుల నుంచి భార్యాభర్తలు నేర్చుకోవాల్సిన విషయాలివే..

Shivaparvathi: పార్వతీదేవికి, శివునికి మధ్య ఉన్న అనుబంధం మనకు ఎంతో నేర్పుతుంది. పెళ్లైన ప్రతి జంట తమ జీవితంలో ఈ విషయాలను తప్పక పాటించాలి.


ఎప్పుడూ చికెన్, మటన్ కాదు.. అప్పుడప్పుడు పీతలు కూడా తినండి.. బోలెడు లాభాలు

మాంసాహారంలో సీఫుడ్‌ టేస్ట్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. చేపలు, రొయ్యలు, పీతలు సీఫుడ్స్‌లో ప్రధానమైనవి. వీటిలో పీతలు చాలా స్పెషల్. ఎప్పుడూ చికెన్, మటన్ తినేవారు అప్పుడప్పుడూ కొత్త టేస్ట్, ఫ్లేవర్ కోసం ఈ నాన్‌వెబ్ ఐటెమ్స్ తినడం మంచిది. వీటిలో శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి వివిధ రకాల వ్యాధులు రాకుండా కాపాడతాయి. పీతల్లో ఉండే న్యూట్రియెంట్స్, వాటి హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకుందాం.* పోషకాలుపీతల నుంచి సూక్ష్మ పోషకాలు, విటమిన్స్ లభిస్తాయి....


ఈ వర్షాకాలం ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాల్సిందే ఎందుకంటే..!

ఈ వర్షాకాలం కొన్ని రాశులపై చాలా గట్టి ప్రభావమే చూపించనుందట. ఈ ప్రభావాన్ని నివారించలేము కానీ కొన్ని నివారణలను తెలుసుకోవడం ద్వారా దీనిని తగ్గించవచ్చు. మరి, ఏ రాశివారిపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అనే విషయాలు తెలుసుకుందాం.. జోతిష్యశాస్త్రానికి మన శాస్త్రాల్లో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ జోతిష్యం ఆధారంగా.. ఒక మనిషి కి సంబంధించిన శుభ, అశుభ ఫలితాలు మనం తెలుసుకోవచ్చు. ఇలా ముందుగానే తెలుసుకోవడం వల్ల.. ఎక్కువ నష్టం జరగకుండా నివారించే అవకాశం ఉంటుంది. కాగా......


అప్పుల భారం నుంచి బయటపడేసే మార్గాలు ఇవే!

ఈరోజుల్లో చాలామంది లోన్, అప్పుల భారంతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారు కొన్ని మార్గాలు అనుసరించి ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. అవేంటో తెలుసుకుందాం.


అందాలతో ఐస్ చేస్తోన్న ఆషికా.. కేకపుట్టించే సొగస్సు!

అషికా రంగనాథ్ తన అందాలతో మత్తెక్కిస్తోంది.


రెండేళ్లుగా పడవలోనే అన్ని పనులు కానిచ్చేస్తున్న మహిళ.. బాయ్ ఫ్రెండ్ కూడా దొరికాడు..!

ప్రపంచంలో అందరి జీవితాలు ఒకేలా ఉండవు. ఒకరికి మంచి అనిపించింది ఇంకొకరికి వింతగా అనిపిస్తుంది. అందుకే బెస్ట్ లైఫ్ అనే కాన్సెప్ట్‌కు అర్థమే ఉండదు. ఇష్టం వచ్చినట్లు బతకడమే అసలైన సంతోషాన్ని ఇస్తుంది. కానీ పరిస్థితుల కారణంగా అందరికీ ఇలాంటి అదృష్టం దక్కదు. కొందరు మాత్రమే అన్ని అడ్డంకులను అధిగమించి నచ్చిన రంగంలో కెరీర్‌ వెతుక్కుంటారు, లైఫ్‌ను కూడా నచ్చినట్లు ఎంజాయ్ చేస్తారు. అలాంటి కొద్ది మందిలో ఇంగ్లాండ్‌కు చెందిన ఓ యువతి కూడా ఉంది.ఆమె ఒక పక్క...


Malavika Mohanan: ఎర్ర చీరలో నాభి అందాలతో మాళవిక మోహన్ అందాల రచ్చ.. లేటెస్ట్ పిక్స్ చూస్తే చూపు తిప్పుకోలేరేమో..

Malavika Mohanan: ఎర్ర చీరలో నాభి అందాలతో మాళవిక మోహన్ అందాల రచ్చ.. లేటెస్ట్ పిక్స్ చూస్తే చూపు తిప్పుకోలేరేమో..


శ్రావణ శుక్రవారం కాదు.. సోమవారం ఏ రాశివారు ఏం చేస్తే వారి బాధలు తీరతాయో తెలుసా?

ఈ సోమవారాల్లో శివయ్యను పూజించి ...కొన్ని పనులు చేయడం వల్ల.. జీవితంలో ఉన్న కష్టాలు తీరి.. కోరుకున్నవన్నీ జరుగుతాయట. మరి... ఏ రాశివారు ఏం చేస్తే.. వారు కోరుకున్నది జరుగుతుందో చూద్దాం.. శ్రావణ మాసం అనగానే ఎవరికైనా శుక్రవారాలే గుర్తుకువస్తాయి. ఈ శ్రావణ శుక్రవారాల్లో పెళ్లైన స్త్రీలంతా ఆ లక్ష్మీ అమ్మవారిని కొలుస్తారు. అయితే... ఈ శ్రావణ మాసంలో శుక్రవారాలు మాత్రమే కాదు.. సోమవారాలకు కూడా ప్రత్యేకత ఉంది. ఈ సోమవారాల్లో శివయ్యను పూజించి ...కొన్ని పనులు...


Horoscope: జూలై 27 రాశిఫలాలు.. ఈ రాశి వారి చిరకాల కోరిక నెరవేరుతుంది..!

Rasiphalalu today:పన్నెండు రాశుల్లో ఇవాళ (27, జూలై 2024 శనివారం) ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎవరికి అదృష్టం కలిసొస్తుంది? ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి? ఎవరిపై శని ప్రభావం ఉంటుంది? తెలుసుకుందాం. మేష రాశి (Aries):ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం అనేక విధాలుగా పెరుగుతుంది. లాభాలపరంగా వ్యాపారాలకు ఢోకా ఉండదు. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సోదరులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. కుటుంబ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తవుతాయి. వృషభ రాశి (Taurus):ఆదాయం నిలకడగా ఉంటుంది. ఒకటి రెండు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ, అనవసర ఖర్చులు మాత్రం అదుపు లేకుండా సాగిపోతాయి. ముఖ్యమైన పనులన్నీ నిరాఘంటంగా పూర్తవుతాయి. బంధువుల నుంచి విమర్శలు వస్తాయి. ఇష్టమైన మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలను కొనసాగించడం మంచిది. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం అవసరం. మిథున రాశి (Gemini):వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగ వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం బాగానే పెరుగుతుంది కానీ, అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. పిల్లల చదువుల విషయంలో శుభవార్త వింటారు. జీవిత భాగస్వామికి ధరపరంగా అదృష్టం పడుతుంది. కుటుంబసమేతంగా ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. దైవ కార్యాలకు సహాయ పడతారు. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనుల్ని పూర్తి చేస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. కర్కాటక రాశి (Cancer):కుటుంబసమేతంగా పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఒకరి ద్దరు సన్నిహితులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. మనసులోని కోరిక ఒకటి అనుకోకుండా నెరవేరుతుంది. వృత్తి జీవితం చాలావరకు బిజీగా సాగిపోతుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. నష్టదాయక పనుల జోలికి పోవద్దు. వ్యాపా రాలు అభివృద్ధి బాటపడతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సింహ రాశి (Leo):వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆదాయ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగిపోతాయి. వ్యాపారంలో పోటీదార్ల సమస్యలను అధిగమిస్తారు. ఇంటా బయటా అనుకూల తలు బాగా పెరుగుతాయి. ప్రస్తుతానికి ప్రయాణాల్ని వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్థిక ప్రయ త్నాలు సత్ఫలితాలనిస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కన్య రాశి (Virgo):జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకోకుండా సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. అన్ని రంగాల వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ముఖ్య మైన వ్యవహారాలన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలలో ఆశించిన ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగంలో అధికారులతో సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా ముందుకు సాగుతాయి. వృత్తి జీవితం బాగా బిజీ అవుతుంది. తుల రాశి (Libra):ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ప్రతిఫలం ఉంటుంది. పనులను పూర్తి చేయడంలో కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు రాకుండా చూసుకోవాలి. పిల్లల చదువుల విష యంలో ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయంలో ఊహించని పెరుగుదల ఉంటుంది. ప్రయాణాల వల్ల ఉపయోగం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్త అందుతుంది. వృశ్చిక రాశి (Scorpio):ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో సంబంధాలు మెరుగుపడతాయి. కొద్ది శ్రమతతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెల కొంటుంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. అన్ని వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ధనస్సు రాశి (Sagittarius):వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా మార్పులు చేపడతారు. కుటుంబానికి సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెడతారు. ఉద్యోగంలో బాధ్యతల నిర్వహణలో ఇతరులతో పోటీపడతారు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా కొనసాగుతుంది. ఆదాయానికి మించిన ఖర్చులుండే అవకాశముంది. జీవిత భాగస్వామితో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వ్యక్తిగత సమస్యలకు ఊహించని పరి ష్కారం లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇష్టమైన మిత్రుల మీద బాగా ఖర్చు పెడతారు. మకర రాశి (Capricorn):కుటుంబ సభ్యులతో విభేదించే అవకాశం ఉంది. ఒకరిద్దరు బంధువులతో అపార్థాలు తలెత్తవచ్చు. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. అధికారులకు మీ అభిప్రాయాలు స్వీకరిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకోని కార్యసిద్ధి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు అందుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దూర ప్రాంతం నుంచి అనుకోని శుభవార్త వింటారు. కుంభ రాశి (Aquarius):ఆదాయం కొద్దిగాను, ఖర్చులు భారీగానూ పెరిగే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాల వల్ల శారీరక శ్రమ బాగా పెరుగుతుంది. కొద్దిగా అనారోగ్య సమస్య బాధపెడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తి అవుతాయి. వృత్తి, వ్యాపారాలు ఎటువంటి ఒడిదుడు కులూ లేకుండా ముందుకు వెడతాయి. ఉద్యోగంలో అనుకోని ప్రోత్సాహకాలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రయాణాల్లో ఇబ్బంది పడతారు. మీన రాశి (Pisces):సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధి స్తారు. కొన్ని ముఖ్యమైన పనులు తేలికగా పూర్తవుతాయి. ఆదాయానికి లోటుండదు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. సంతానానికి సంబంధించి ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సత్ఫలితాల నిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో బంధువుల జోక్యం పెరిగి ఇబ్బంది పడతారు. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


తెల్ల జిల్లేడు చెట్టు వేరు నుంచి ఉద్భవించిన గణపతి

మన దేవతాగణంలో ప్రథముడైన గణపతిని విజ్ఞాలను తొలగిపోయేందుకు ఆరాధించడం వేద కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం. ఎవరు ఏ దేవతను ఆరాధించిన ముందుగా కొలిచేది మాత్రం గణపతినే జ్ఞాన నిర్వాణ ప్రదాయకుడు వినాయకుడు. అలాంటి వినాయకుడిని ప్రకృతి స్వరూపుడిగా మనం ఆరాధిస్తాం.ఆయన ఆకృతిని ప్రకృతిలోని అంశాలకు ప్రతిఫలాలుగా సంభవిస్తాం. ఆ ప్రతీకగానే శ్వేతార్క మూలంగా అనగా తెల్ల జిల్లేడు వృక్షకాండంగా ఆ వినాయక మూర్తి ఆవిర్భవించాడు. ప్రకృతికి తనకి అభేదమని స్వామి చాటి చెప్పాడు. సహజ సిద్ధమైన స్వేతార్కముల గణపతి ఆలయం హనుమకొండ జిల్లా కాజీపేటలో కొలువై ఉంది. ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది.ఈ ఆలయం భక్తుల పాలిట ఆధ్యాత్మిక దామంగా వెలుగొందుతుంది. రెండంచెలుగా ఉండే ఆలయం సువిశాలంగా ఉంటుంది. శ్వేతం అనగా తెలుపు,అర్కము అనగా జిల్లేడు, మూలము అనగా వేరు. తెల్ల జిల్లేడు చెట్టు వంద సంవత్సరాలు పెరిగితే ఆ చెట్టు వేరు మూలంలో గణపతి రూపం తయారవుతుందని నారద పురాణంలో చెప్పబడింది. తెల్ల జిల్లేడు వేరు మొదల నుంచి ఉద్భవించింది కనుక ఇక్కడ శ్వేతార్క మూల గణపతి అంటారని ఆలయ అర్చకులు సాయి కృష్ణ శర్మ తెలిపారు.ఈ విగ్రహాన్ని చెక్కడం కానీ మలచడం కానీ చేయలేదు. స్వయంగా భూమి నుంచి పుట్టిన శ్వేతార్క గణపతికి నేత్రాలు, నుదురు, మోచేయి, అరచేయి, సుఖాసనం, కల్పం అన్ని స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే అయినవోలు అనంత మల్లయ్య శర్మ 2009లో ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఒకనాడు కాణిపాకంలోని గణపతి దేవాలయాన్ని దర్శించుకున్న మల్లయ్య శర్మ, కాణిపాకం నుంచి తిరిగి వచ్చాక కాజీపేట సమీపంలోని సాయిబాబా దేవాలయంలో పూజారిగా సేవ చేయడం ప్రారంభించాడు. 1999 ఏప్రిల్ 20న మల్లయ్య శర్మ నిద్రిస్తున్న సమయంలో తన కలలో శ్వేతార్క మూల గణపతి దర్శనమిచ్చాడు. నల్గొండలోని ఓ అడవి ప్రాంతంలో తెల్ల జిల్లేడు చెట్టు వేరులో ఉన్నట్లు అతనికి కలలో కనిపించగా, పీఠాధిపతుల సూచన మేరకు మరుసటి రోజు ఆ ప్రాంతానికి వెళ్లి ఆ స్వామి వారిని జిల్లేడు చెట్టు వేర్లలో కనుగొన్నాడు. ఆ స్వామి వారిని అక్కడి నుంచి కాజీపేటకు తీసుకువచ్చి ఈ ఆలయంలో ప్రతిష్టించి పూజలు చేయడం ప్రారంభించారు. 2009లో విష్ణుపురిలో ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో కనిపించేలా దేవాలయం నిర్మాణం చేసి ఐదుగురు పీఠాధిపతుల సమక్షంలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి ఆ విగ్రహానికి పద్దెనిమిదిన్నర కిలోల వెండి కవచాన్నీ అమర్చారు. ఆ గణపతి 64 రూపల్లో ఈ శ్వేతార్కముల గణపతి ఒక రూపమని అర్చకులు సాయి కృష్ణ శర్మ చెప్పారు. ఈ స్వామివారికి సర్వ అవయవాలు సంపూర్ణంగా ఉంటాయని,ఇలాంటి శ్వేతార్క మూల గణపతి ఆలయం ఆసియా ఖండంలోనే ఎక్కడా లేదన్నారు. నిత్యం ఎంతోమంది భక్తులు వచ్చి ఈ స్వామి వారిని దర్శించుకుంటారని తెలియజేశారు.


ఉప‌వాసం ఉంటే కలిగే లాభాలు ఇవే!

ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ స‌మ‌యానికి ఆహారం తీసుకోవాల‌ని మ‌నంద‌రికీ తెలుసు. అదే విధంగా ఉప‌వాసం ఉండ‌డంతో కూడా ఆరోగ్య ప్ర‌యోజ‌నాలున్నాయ‌ని అధ్యాయ‌నాలు తెలుపుతున్నాయి.


సింపుల్‌గా సంయుక్త.. క్యూట్ కదా!

సంయుక్త మీనన్ సింపుల్‌గా చాలా క్యూట్‌గా కనిపించింది.


Knowledge Story: ఈ పాములతో జాగ్రత్త.. పగబడతాయి.. కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాయి..!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది జాతుల పాములలో ఏ పాము అత్యంత తెలివైనదో తెలుసా? పాములకు మెదడు ఉండదని నిపుణుల అభిప్రాయం. వారు ఎవరినీ గుర్తించలేరు ఎవరినీ స్పష్టంగా చూడలేవు. అయితే వీటన్నింటికీ భిన్నమైన పాము ఒకటి ఉంది, అది మనల్ని గుర్తించగలదు ఇతర పాముల కంటే బాగా చూడగలదు. సమయానికి అనుగుణంగా తన వ్యూహాన్ని కూడా మార్చగలదు. ఈ రకమైన పాము నిజంగా ప్రత్యేకమైనది ...ఫ్యాన్సీ. పాము మరెవరో కాదు, ఇండియన్ కోబ్రా కంటే భిన్నమైన కింగ్ కోబ్రా. ఇది పరిస్థితికి అనుగుణంగా తన వేట వ్యూహాన్ని మార్చుకోగలదు. వారు భూమిలో ప్రకంపనలను అనుభవించగలరు. ఇది 330 అడుగుల దూరం నుండి కూడా ఎవరైనా కదులుతుంటే సులభంగా గుర్తించగలదు. ఈ పాములు కదలికను గుర్తించినప్పుడు, వారు దానిని గుర్తించడానికి తమ నాలుకను కదిలిస్తాయి. నాలుక సరైన స్థానాన్ని సూచించడానికి నాలుక యాంటెన్నాలా పనిచేస్తుంది. సాధారణంగా, కింగ్ కోబ్రాస్ తమను పట్టుకున్నవారిని కాటేశాక.. దాని పరిమాణం వారి తల కంటే పెద్దదైనప్పటికీ, దానిని పూర్తిగా మింగేస్తాయి. కింగ్ కోబ్రాకు గొప్ప కంటి చూపు ఉంది. ప్రమాద సమయాల్లో పడగవిప్పి బయటకు తీయడానికి వారు తమ మెడ కండరాలు మరియు పక్కటెముకలను ఉపయోగిస్తాయి. ఆడ కింగ్ కోబ్రా తన గుడ్లను రక్షించుకోవడానికి గూడు కట్టుకునే ఏకైక పాము. అవి వాటి గుడ్లను ఆకులతో కప్పుతుంది ఈ సమయంలో, ఆడ నాగుపాములు తమ వద్దకు వచ్చే మనుషుల పట్ల చాలా దూకుడుగా ఉంటాయి, వాటికి హాని కలిగేస్తే కాటేస్తాయి. కింగ్ కోబ్రా భారతదేశంలోని అరణ్యాలలో , ఆగ్నేయాసియాలో కూడా కనిపిస్తుంది. కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాముగా పేరుగాంచింది. కింగ్ కోబ్రాస్ 25 సంవత్సరాల వరకు జీవించగలవు . గరిష్టంగా 19 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. కింగ్ కోబ్రాస్ చాలా తెలివైనవి. వారు పగటిపూట మరింత చురుకుగా ఉంటారు. పగటిపూట వారి కార్యకలాపాలు మరింత చురుకుగా ఉంటాయి. వారు రాత్రిపూట కూడా వేటాడవచ్చు. ఇది ఇతర పాముల కంటే మనుషులను బాగా గుర్తిస్తుందని అంటారు. ఇతర పాముల కంటే కింగ్ కోబ్రాకు జ్ఞాపకశక్తి ఎక్కువ అని నమ్ముతారు. ప్రసిద్ధ హెర్పెటాలజిస్ట్ డిట్మార్స్ కింగ్ కోబ్రాను అత్యంత తెలివైన పాముగా పరిగణించారు. పాములకు నాడీ వ్యవస్థ ఉన్నందున, అవి వాసన పడతాయి. అవి తన ప్రమాదాన్ని అర్థం చేసుకుంటాయి. ఇతర జంతువులతో పోరాడతాయి కూడా. ఇతర జంతువులను వేటాడగలవు. ఇవన్నీ చేయడానికి అవసరమైన తెలివితేటలు వారికి ఉన్నాయి.


ఆధ్యాత్మికం: మాట... మౌనానికి మునిమనవడు

ఆధ్యాత్మికం: మాట... మౌనానికి మునిమనవడు మౌనమే అన్నింటికంటే సమర్థవంతమైనది, ఎన్నో ఏళ్లుగా దీనిని తెలుసుకోలేకపోయారో దాన్ని కేవలం ఒక్క మౌనం ద్వారానే తెలుసుకోగలం .  కానీ, మౌనం నిర్మలంగా నిదానంగా, నిలకడగా ప్రవహిందే జ్ఞాన స్రవంతి! మౌనంగా ఉండేవాళ్లను 'మునులు' అంటారు. ఇక, మనోవాక్కాయ కర్మలను స్వాధీనం చేసుకొని సత్యంగా, శాంతంగా, భూతహితంగా, మితంగా.. కరుణాన్నితంగ...


మీరు ఉసిరికాయ తింటారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి!

ఉసిరికాయలో చాలా రకాల పోషకాలు ఉంటాయి. ఉసిరిలో అనేక రకాల విటమిన్లు ఉంటాయి. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా రకరకాల వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ఉసిరికాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. అంతే కాదు ఉసిరి శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది. దీని వల్ల చర్మం క్లియర్ అవుతుంది. ఉసిరికాయ ఎముకలు, కళ్లకు ఎంతో మేలు చేస్తుందని విద్యా గుప్తా పేర్కొంది. ఉసిరిలో ఉండే ఐరన్ మహిళల్లో రక్తహీనతను దూరం చేస్తుంది. ఉసిరిలో ఉండే విటమిన్ సి దంతాలు, చిగుళ్లను బలపరుస్తుంది. ఉసిరి జీర్ణక్రియను మెరుగుపరచడానికి, ఆమ్లత్వం నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఇది డయాబెటిక్ రోగులకు కూడా ఉపయోగపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా, వృద్ధాప్యం, జుట్టు నెరసిపోకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. ఉసిరికాయను వివిధ రకాలుగా తీసుకోవచ్చు. ఉసిరికాయను నేరుగా, ఊరగాయ, చట్నీ తయారు చేయడం ద్వారా లేదా ఎండబెట్టి దాని పొడిని తయారు చేయడం ద్వారా కూడా తినవచ్చు. రోజూ ఉదయం ఒక టీస్పూన్ ఉసిరి పొడిని గోరువెచ్చని నీటితో తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.


Shasha Raja Yoga: శశ రాజయోగం.. ఈ రాశులవారికి డబ్బుతో పాటు విపరీతమైన ఆదాయం..

Shasha Raja Yoga: శశ రాజయోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు వీరికి ఉద్యోగాల్లో ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.


Temple: గుడికి వెళ్తే ఈ పొరపాటు చేయొద్దు.. ముందు చేయాల్సిన పని ఇదే!

ప్రతి హిందూ దేవాలయాలు దగ్గర ఆ రెండుస్తంభాలు కచ్చితంగా ఉంటాయి. ఆ స్తంభాలులేని ఆలయం అంటూ ఉండదు. ఒకటి దీపోత్సవం, మరొకటి ధ్వజ ధ్వజస్తంభం. ఈ రెండు స్తంభాలప్రాముఖ్యత ఏమిటీ, ఇక్కడ నిర్వహించే కార్యక్రమాలు ఏవి..మొదట గుడిలో అడుగు పెట్టిన ప్రతి భక్తుడు ఎందుకు ధ్వజస్తంభాన్నినమస్కరించిన తరువాత మూల విగ్రహాన్ని నమస్కరిస్తారు.ఇలా దేవాలయాల బాట పట్టిన భక్తులకు ఆ రెండు స్థంభాలు చూసినప్పుడల్లా వచ్చే సందేహాలకు వివరణ ఏమిటని తీర్థం గ్రామానికి చెందిన ఆనంద్ తీర్థం రావ్...


తెల్ల నువ్వులు కాదు.. నల్ల నువ్వులతో ఎన్ని లాభాలు ఉన్నాయో..

నిజానికి ప్రతి ఒక్కరూ తెల్ల నువ్వులనే వాడుతుంటారు. కానీ నల్ల నువ్వులు కూడా వంటలను టేస్టీగా చేయడంతో పాటుగా మన ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి. అసలు నల్ల నువ్వులను తింటే ఏమౌతుందో తెలుసా? నువ్వులు తెలుపు లేదా నలుపు రెండు రంగుల్లోనూ ఉంటాయి. ఈ రెండు వాటి స్వంత ప్రయోజనాలను కలిగి ఉంటాయి. వీటి లక్షణాలను బట్టి తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులే సూపర్ ఫుడ్ కేటగిరీలోకి వస్తాయి. నల్ల నువ్వులు నిగెల్లా సాటివా మొక్కకు కాస్తాయి. ఈ నువ్వుల్లో యాంటీ...


కష్టం లేకుండా పనిని స్మార్ట్‌గా చేసేందుకు టిప్స్‌!

సానుకూల వాతావరణంలో పని చేయడంతో ఉత్పాదకత పెరుగుతుంది. తక్కువగా పని చేసినా మంచి ఫలితాలు పొందవచ్చు. స్మార్ట్‌వర్క్‌తో సులభంగా పనిని ఎలా పూర్తి చేయవచ్చో ఇక్కడ వివరించాం.


చీర కట్టుకున్నప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

ఆడవారి అందాన్ని పెంచడంలో చీరలు ముందుంటాయి. చీరల్లో అందంగా కనిపించేందుకు ఎలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలో తెలుసుకోండి.


రెండో శనివారం మాత్రమే ఎందుకు సెలవు ఇస్తారు.. 90% మందికి తెలియని రహస్యం ఇదే..!

సాధారణంగా స్కూళ్లు, కాలేజీలు, ఏదైనా ప్రొఫెషనల్ ఇన్ స్టిట్యూషన్ కు వారానికి ఒక్కసారైనా సెలవులు ఉంటాయి. ఇది పురాతన కాలం నుండి ఆచరణలో ఉంది. ఆదివారాల్లో స్కూళ్లు, కాలేజీలు, బ్యాంకులు, విద్యాసంస్థలకు సెలవు ఇస్తుంటారు. భారతదేశంతో సహా అనేక దేశాలలో, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మరియు కొన్ని ప్రైవేట్ సంస్థలు ప్రతి నెల రెండవ శనివారం సెలవు ఇస్తుంటారు. రెండో శనివారం సెలవు దినమని అందరికీ తెలుసు.. కానీ శనివారం సెలవు ఎందుకు వచ్చింది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? దీనికి కారణం ఉంది. 19వ శతాబ్దంలో ఒక బ్రిటీష్ అధికారికి సహాయకుడు ఉండేవాడంట.. అతడు తన వృద్ధులైన తల్లిదండ్రులను కలిసేందుకు సెలవుల్లో మాత్రమే పట్టణానికి వెళ్లేవాడంట. కొన్నిసార్లు అది సాధ్యం అయ్యేది కాదంట. దీంతో అతడిని చూసేందుకు వృద్ధులైన తల్లిదండ్రులు వచ్చేవారంట. ఈ విషయం తెలిసిన ఇంగ్లిష్ ఆఫీసర్ ప్రతి నెల రెండో శనివారం పట్టణానికి వెళ్లేందుకు అసిస్టెంట్ లీవ్ ఇచ్చాడంట. అప్పటి నుండి బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా రెండవ శనివారం సెలవు ఇవ్వడం ప్రారంభించింది. స్వాతంత్రం తర్వాత కూడా భారత ప్రభుత్వం ఈ సెలవుదినాన్ని పాటిస్తోంది. రెండో శనివారం సెలవు ఇవ్వడం వెనుక నిజం ఇదే. బ్రిటిష్ వారు ప్రారంభించిన 2వ శనివారం సెలవు ఇప్పటికీ అమలులో ఉంది. ఇక ఆదివారం సెలవు వెనకు కూడా కారణం ఉంది. క్రిస్టియానిటీ ప్రకారం దేవుడు ప్రపంచాన్ని 6 రోజుల్లో సృష్టించాడు. సృజనాత్మక చర్యతో విసిగిపోయిన ఆయన ఆదివారం విశ్రాంతి తీసుకున్నారు. దీంతో ఆదివారం క్రైస్తవులకు ప్రత్యేకమైన రోజుగా మారింది. క్రైస్తవ మతాన్ని అనుసరించిన బ్రిటీష్ వారు ప్రపంచంలోని అన్ని దేశాలను పాలించారు. దీంతో వారు దాదాపు అన్ని చోట్లా ఆదివారం సెలవు పెట్టారు. 1843 నుండి భారతదేశంలో ఆదివారపు సెలవులు అమలులోకి వచ్చాయి. చరిత్ర ప్రకారం, 321 మార్చి 7 న, క్రైస్తవ మతంలోకి మారిన మొదటి రోమన్ పాలకుడు అయిన చక్రవర్తి కాన్స్టాంటిన్ ఆదివారం ప్రజలు చర్చికి వెళ్ళడానికి ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాడు. ఆదివారం వారంలో 7 వ మరియు చివరి రోజు. 1844లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ పాఠశాలకు వెళ్లే విద్యార్థుల కోసం 'సండే హాలిడే'ను ప్రవేశపెట్టారు. ఈ రోజు యొక్క సందర్భం విద్యార్థులు కొన్ని సృజనాత్మక కార్యకలాపాలలో పాల్గొనడానికి.. రోజువారీ చదువుల నుండి విరామం తీసుకోవడానికి అనుమతిస్తుంది. భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు, భారతదేశంలోని మిల్లు కార్మికులు వారానికి ఏడు రోజులు కష్టపడాల్సి వచ్చేది. వారికి విశ్రాంతి తీసుకోవడానికి సెలవులు లేవు. కానీ బ్రిటిష్ అధికారులు మరియు కార్మికులు ప్రతి ఆదివారం ప్రార్థన చేయడానికి చర్చికి వెళ్ళేవారు.. కాబట్టి తరువాత మిల్లు కార్మికులకు కూడా ఆదివారం సెలవు ఇచ్చారు.


Lip Care Tips: గులాబీ రేకులు వంటి పెదవుల కోసం ఈ చిట్కాలు!

Lip Care Tips: గులాబీ రేకులు వంటి పెదవుల కోసం ఈ చిట్కాలు!


శ్రావణ మాసంలో తప్పక దర్శించుకోవాల్సిన శివాలయాలు!

శ్రావణ మాసంలో శివాలయాలను దర్శించడం ఎంతో పుణ్యమని చెబుతారు. ఈ నేపథ్యంలో ఈ మాసంలో సందర్శించాల్సిన ప్రసిద్ధ శివాలయాలు ఏంటో తెలుసుకుందాం.


భూమిలో వెలిసిన భద్రకాళి... ఈ అమ్మవారి మహిమలు మహిమాన్వితం

అక్కడ భూమిలో వెలిసిన స్వయంభు అమ్మవారిని దర్శిస్తే సకల దోషాలు నివారణ చెందుతాయట. ముఖ్యంగా ఏదో తెలియని అలజడి ఇబ్బందుల్లో ఉన్న మనుషులు ఆ అమ్మవారిని దర్శిస్తే చాలు తప్పక శాంతి చేకూరుతుందని ఎంతో విశ్వాసంతో ఆ జిల్లాలో భక్తులు చెబుతూ ఉంటారంట..కొన్ని వందల సంవత్సరాల కిందట భూమిలో ఉండి ఆపై ఆటలాడుకునే స్థలంలో క్రీడాకారులు అక్కడ అమ్మవారిని గుర్తించడం ఆపై నెమ్మది నెమ్మదిగా ఆలయం నిర్మించడం ఈరోజు ఆ జిల్లాలోనే మహిమాన్విత ఆలయంగా ఎదగడం వంటి చరిత్ర కూడా ఆ ఆలయానికి...


చుండ్రును నివారించే ఆహారాలు!

ముఖంపై చూపినంత శ్రద్ధ మనం హెయిర్‌పై చూపించం. హెయిర్‌పై శ్రద్ధ చూపించకపోవడంతో స్కాల్ప్ ఆరోగ్యం దెబ్బతింటుంది. చుండ్రు సమస్య తీవ్రంగా ఉంటుంది.


Varalakshmi Vratam 2024 వరలక్ష్మీ వ్రతం వేళ ఈ పనులు తప్పనిసరిగా చేయాలని గుర్తుంచుకోండి...

Varalakshmi Vratam 2024 ఈ ఏడాది ఆగస్టు నెలలో 16వ తేదీ రెండో శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకోనున్నారు. ఈ వ్రతాన్ని ఆచరించే వారు ఈ పనులు తప్పకుండా చేయాలి. అదేవిధంగా పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...


Mehendi: బెల్లం, టీ ఆకులతో ఇలా గోరింటాకును చేస్తే అయిదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది, ఎర్రటి రంగులో మెరిసిపోతుంది

Mehendi: శ్రావణ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం మహిళలకు ఆనవాయితీగా వస్తుంది. గోరింటాకు ఆకులను రుబ్బుకోనివారు అమ్మాయి తన చేతిలో గోరింటాకు తయారు చేసుకోవడానికి ఇష్టపడుతుంది. కాబట్టి ఇంట్లోనే ఇన్ స్టంట్ గోరింటాకు ఎలా చేయాలో తెలుసుకుందాం.


Glowing Skin: బియ్యం కడిగిన నీళ్లు ముఖానికి ఇలా రాసారంటే మెరవడం గ్యారంటీ..!

మన అందరి ఇళ్లలో అన్నం ప్రధానమైన ఆహారం. ఈ బియ్యమే కాదు బియ్యాన్ని కడిగే నీళ్లలో కూడా లెక్కలేనన్ని పోషకాలున్నాయి. బియ్యాన్ని బాగా కడిగి నానబెట్టిన నీరు మన శరీరం , చర్మ ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ రైస్ వాటర్ ప్రధానంగా కొరియన్ చర్మ సంరక్షణలో చాలా మంది ఉపయోగిస్తారు. ఇది ఫైన్ లైన్స్, ముడతలు తగ్గించి, చర్మానికి సహజమైన మెరుపునిస్తుంది. కాబట్టి ఇప్పుడు చాలా మంది తమ చర్మం జుట్టు అందాన్ని కాపాడుకోవడానికి రైస్ వాటర్ వాడుతున్నారు. రైస్ వాటర్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది: రైస్ వాటర్‌లో విటమిన్లు , మినరల్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి చర్మపు రంగును మెరుగుపరచడంలో సహాయపడతాయి. బియ్యం కడిగిన నీటిలో ఫెరులిక్ యాసిడ్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ అల్లాంటోయిన్ ఉన్నాయి, ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. బియ్యం నీళ్లను చర్మానికి పట్టించి కడిగేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. మంటను తగ్గిస్తుంది: రైస్ వాటర్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు విసుగు చెందిన చర్మాన్ని నయం చేస్తాయి. ఎగ్జిమా, మొటిమలు వంటి సమస్యలను తగ్గించడంలో మేలు చేస్తుంది. ఇది నల్ల మచ్చలు, మంట ఎరుపు వంటి చర్మ సమస్యలను కూడా సరిదిద్దుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తి: బియ్యం నీటిలో అమైనో ఆమ్లాలు, విటమిన్లు , ఖనిజాలు ఉంటాయి, ఇవి చర్మంలోని రంధ్రాల రూపాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా ప్రోత్సహిస్తుంది, మీ చర్మం మెరుస్తుంది. ముఖ్యంగా మొటిమల సమస్యలతో బాధపడేవారు రోజూ బియ్యం నీళ్లను ముఖానికి రాసుకోవచ్చు. మంచి ఫలితాలు పొందండి. చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది : రైస్ వాటర్‌లోని మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మాన్ని తేమగా మృదువుగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది సహజమైన టోనర్‌గా పనిచేస్తుంది, చర్మం యొక్క pH స్థాయిని సమతుల్యం చేస్తుంది . దానిని హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఇది మీ చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. యవ్వనంగా ఉండాలంటే... రైస్ వాటర్‌లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి అకాల వృద్ధాప్యానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. అలాగే రైస్ వాటర్‌ను చర్మంపై అప్లై చేయడం వల్ల చర్మంపై ఉండే ఫైన్ లైన్స్ , ముడతలు తగ్గుతాయి మరియు యవ్వన ఛాయను ప్రోత్సహిస్తుంది. ఇది మీ చర్మాన్ని ఎప్పటికీ యవ్వనంగా ఉంచుతుంది.


Dog Meat: మటన్ అని చెప్పి కుక్క మాంసం సరఫరా.. 4500 కిలోలు పట్టివేత!

Dog Meat: ప్రస్తుతం బిజీ బిజీ లైఫ్‌లో చాలా మంది హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లి తింటున్నారు. ఇక మరికొంత మంది వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఇంట్లో పొయ్యి వెలిగించకుండా.. బయటికి వెళ్లి తింటూ ఉంటారు. అందులో చాలా మంది నాన్ వెజ్ ప్రియులే ఉంటారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన తీవ్రంగా భయపెడుతోంది. ఎందుకంటే మటన్ అని చెప్పి.. కుక్క మాంసాన్ని హోటళ్లకు సప్లై చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా 4500 కిలోల కుక్క మాంసం పట్టుబడటం...


నాగ పంచమి నాడు పొరపాటున కూడా ఈ పనులు చేసేరు..

ఈ ఏడాదిలో నాగపంచమి పండుగ ఆగస్టు 9వ తేదీ న అంటే శుక్రవారం నాడు వచ్చింది. ఈ రోజు పాముని, పరమేశ్వరుడిని నిష్టగా పూజిస్తారు. అయితే ఈరోజు తెలిసీ తెలియక కొన్ని పనులను చేస్తే మీకు పూజా ఫలం కూడా దక్కదు. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ప్రతి ఏడాది నాగ పంచమి పండుగను శ్రావణ మాసం శుక్లపక్షంలో ఐదో రోజున జరుపుకుంటారు. ఇతర పండుగలతో పాటుగా నాగపంచమిని కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు. నాగ పంచమి నాడు నాగదేవతను పూజించడం వల్ల మన బాధలన్నీ తొలగిపోతాయని నమ్మకం ఉంది. మరి...


Immunity Foods : ఈ ఫుడ్స్ తీసుకుంటే వర్షాకాలంలో వచ్చే సమస్యలన్నీ దూరం

Immunity Foods : వర్షకాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవడం చాలా ముఖ్యం. దానికోసం ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో తెలుసుకోండి.


ఆడవారు ఎక్కువగా సింగిల్‌గా ఉండడానికి కారణాలివే..

నేటి కాలంలో కొంతమంది మహిళలు సింగిల్‌గా ఉండడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీనికి చాలానే కారణాలున్నాయి. అవేంటో తెలుసుకోండి.


సముద్రం అడుగున ఏసుక్రీస్తు విగ్రహం.. దీనిని వెనుక రహస్యం ఏంటంటే..!

ఇటలీకి సమీపంలోని సముద్రంలో ఉన్న 15 మీటర్ల ఎత్తున్న క్రీస్తు విగ్రహం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇది డైవర్లకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. సామాన్యులు కూడా దీన్ని చూడటానికి ఇష్టపడతారు, చాలా మంది దాని దగ్గరకు వెళ్లి వివాహం చేసుకోవాలనుకుంటారు. క్రైస్ట్ ఆఫ్ ది అబ్యస్ విగ్రహం నీటి అడుగున ఉన్న శిల్పం. సముద్ర లోతుల్లో చేతులు చాచి నిలబడిన యేసుక్రీస్తు అద్భుతమైన విగ్రహం. ఇది డైవర్లకు మరియు సముద్ర జీవులకు శాంతి, భద్రతకు దీనిని చిహ్నంగా భావిస్తుంటారు. మధ్యదరా సముద్రంలో మునిగిపోయిన యేసుక్రీస్తు కాంస్య విగ్రహాన్ని క్రీస్తు ఆఫ్ ది అగాధం అంటారు. లోతుల్లో అన్వేషించే డైవర్లకు ఇది ఆశ మరియు భద్రతకు చిహ్నంగా పనిచేస్తుంది. క్రైస్ట్ ఆఫ్ ది అగాధాన్ని ఇటాలియన్ కళాకారుడు గైడో గాలెట్టి సృష్టించాడు. డైవర్లను గౌరవించడమే వారి ఉద్దేశం. క్రైస్ట్ ఆఫ్ ది ది అబ్యస్.. అసలు విగ్రహం ఇటలీ తీరంలో ఉన్నప్పటికీ, దానికి మరో రెండు ప్రతిరూపాలు తయారు చేశారంట. వాటిలో ఒకటి ఫ్లోరిడాలోని కీ లార్గో తీరంలో, మరొకటి గ్రెనడాలోని సెయింట్ జార్జ్ లో ఉంచారంట. ఇటలీలోని ఈ విగ్రహాన్ని చూడాలంటే మీకు తగినంత ధైర్యం ఉండాలి.. అది సముద్ర గర్భం నుండి 15 మీటర్ల లోతులో ఉంది. ఇటలీలోని క్రైస్ట్ ఆఫ్ ది అబ్యస్ ప్రతి సంవత్సరం వేలాది మంది డైవర్లను ఆకర్షిస్తుంది. నేడు ఈ ఐకానిక్ విగ్రహం ప్రపంచవ్యాప్తంగా ఉన్న డైవింగ్ ఔత్సాహికులను ఆకర్షిస్తున్న ఇష్టమైన డైవింగ్ గమ్యస్థానం. క్రైస్ట్ ఆఫ్ ది అబ్యస్ యొక్క క్రీస్తు చుట్టూ శక్తివంతమైన పగడపు దిబ్బ ఉంది. జాన్ పెన్నెకాంప్ కోరల్ రీఫ్ స్టేట్ పార్క్ లో ఉన్న క్రిస్ట్ ఆఫ్ ది అబిస్ యొక్క కీ లార్గో ప్రతిరూపాన్ని రంగురంగుల పగడపు నిర్మాణాలతో అందంగా అలంకరించారు, ఇది డైవర్లకు ఆకర్షణీయమైన నేపథ్యాన్ని అందిస్తుంది. క్రైస్ట్ ఆఫ్ ది అగాధం నీటి అడుగున వివాహాలకు ప్రసిద్ధ ప్రదేశం. డైవర్లు సాధారణంగా అబ్యస్ యొక్క క్రీస్తును అభిమానం, భక్తితో చూస్తారు. గౌరవం మరియు కృతజ్ఞతా ప్రదర్శనలో, డైవర్లు సాధారణంగా శిల్పానికి మరియు శిలువలు, మతపరమైన అవశేషాలు మరియు వ్యక్తిగత వస్తువులు వంటి చిన్న స్మారక చిహ్నాల విస్మయకరమైన నీటి అడుగున ప్రపంచానికి కనెక్షన్ కనుగొనడానికి ప్రయత్నిస్తారు. కళ, మతం, ప్రకృతి కారణంగా ఈ క్రీస్తు విగ్రహం సాంస్కృతిక చిహ్నంగా నిలిచింది. ఇది విభిన్న వ్యక్తులను ఏకతాటిపైకి తీసుకురావడానికి సహాయపడుతుంది. చాలా మంది డైవర్లు ఈ విగ్రహాన్ని చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సముద్రం అడుగున దృఢంగా నిలబడిన క్రీస్తు ఆఫ్ ది అబీస్ మానవాళి సవాళ్లను అధిగమించి విజయం సాధించే సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తోంది.


ఈ సెలబ్రెటీలు విడిపోయారు కానీ.. ఆ విషయంలో ఇంకా కలిసే ఉన్నారు..!

తమ జీవిత భాగస్వామితో చిన్న మనస్పర్థలు వచ్చినా, వారిలో కొన్ని విషయాలు నచ్చకపోయినా వెంటనే విడాకులు తీసుకుంటున్నారు. అలా విడాకులు తీసుకుంటున్న వారిలో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు చాలా మందే ఉన్నారు. ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకునే జంటలు బాగా పెరిగిపోతున్నారు. ఒకప్పుడు పెళ్లి చేసుకున్నాం అంటే ఆ బంధానికి కట్టుబడి ఉండేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. తమ జీవిత భాగస్వామితో చిన్న మనస్పర్థలు వచ్చినా, వారిలో కొన్ని విషయాలు నచ్చకపోయినా వెంటనే విడాకులు...


ఇవి పాటిస్తే చాలు.. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా హ్యాపీగానే ఉంటారు..

కొన్నిసార్లు మనసు చాలా బాధపడుతుంటుంది. ఎలాంటి కారణాలు లేకుండానే ఏడుపొస్తుంది. అలాంటప్పుడు హ్యాపీగా ఉండేందుకు ఏం చేయాలో తెలుసుకోండి.


జీలకర్రను ఎలా తింటే తొందరగా బరువు తగ్గుతారో తెలుసా?

మనకు తెలియదు కానీ.. జీలకర్ర మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. మీకు తెలుసా? దీన్ని ఉపయోగించి మనం ఫాస్ట్ గా బరువు కూడా తాగొచ్చు. ఇందుకోసం జీలకర్రను ఎలా తినాలంటే? బరువు తగ్గడానికి మనం ఎన్నో పద్దతులను ఫాలో అవుతుంటాం. రకరకాల వ్యాయామాలు చేస్తుంటాం. ఎందుకంటే బరువు పెరగడం వల్ల లేనిపోని సమస్యలు వస్తాయి. అయితే బరువును తగ్గించుకోవడానికి జీలకర్ర కూడా ఎంతో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీలకర్ర బరువును ఎలా తగ్గిస్తుందంటే? జీలకర్ర...


సంతోషకరమైన జీవితం గడపాలంటే.. ముందు ఈ పనులు చేయండి..!

మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి. చదువు, ఉద్యోగం, కుటుంబం, ఖర్చులు, పొదుపు, భవిష్యత్తు ఇలా ఏదో ఒక భయం, ఆందోళన జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. జీవితం కంప్యూటరైజ్డ్‌గా మారడంతో ప్రజలకు ఒత్తిడికి లోటు ఉండదు. అయితే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలనే విషయం మర్చిపోవద్దు. జీవితంలో ఎలాంటి బాధను ఎదుర్కొన్నా సానుకూలంగా ఉండేందుకు నిపుణులు సిఫార్సు చేసిన కొన్ని పద్ధతులు ఉన్నాయి.. వాటిని అనుసరించడం వల్ల మీ మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేటి ఆన్‌లైన్ ప్రపంచంలో ఇతరుల కోసం సమయాన్ని కేటాయించడం, వారితో మనసులోని మాటను మాట్లాడటం ఎవరూ ఇష్టపడరు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులు వంటి మీకు ప్రియమైన వారితో వ్యక్తిగతంగా సమయం గడపండి. మీరు వారితో కలిసి భోజనం చేయవచ్చు, బయటకు వెళ్లవచ్చు, ఆ రోజు జరిగిన విషయాలను చర్చించండి. చురుకుగా ఉండటం మీ శారీరక ఆరోగ్యానికే కాదు, మీ మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన మానసిక స్థితి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. స్విమ్మింగ్, సైక్లింగ్, వాకింగ్, జాగింగ్ క్రమం తప్పకుండా చేయడం మంచిది. ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలని పెద్దలు చెపుతుంటారు.. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుంది. కొత్తది నేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు, మీరు స్వయంచాలకంగా కొత్త వ్యక్తులను కలుసుకుంటారు స్నేహితులను చేసుకుంటారు. అయితే మీకు ఏది ఇష్టమో అదే నేర్చుకోండి. మీకు నచ్చని విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు పరిస్థితి మరింత దిగజారుతుంది. ఎవరైనా మనకు బహుమతి ఇస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. ఇతరులకు బహుమతులు ఇచ్చినప్పుడు కూడా అంతే ఆనందం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు వంటి వారికి చిన్నచిన్న బహుమతులు ఇచ్చి బోనస్‌గా ఆనందాన్ని పొందవచ్చు. జరిగిన వాటిని ఎప్పటికీ మార్చలేము... కానీ వాటిని దాటవేయవచ్చు. ఎప్పుడో చేసిన తప్పుకు పశ్చాత్తాపపడి ప్రయోజనం లేదు. అదేవిధంగా భవిష్యత్తు గురించి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ మనస్సును ఎల్లప్పుడూ వర్తమానంలో ఉంచుకోండి. అప్పుడే మీరు సంతోషంగా ఉంటారు.


Kamika Ekadashi 2024: కామికా ఏకాదశి ఎప్పుడు..?. ఆ రోజు ఏర్పడే ఈ అద్భుత యోగాలు మీకు తెలుసా..?

Kamika Ekadashi 2024: కామికా ఏకాదశి ఎప్పుడు..?. ఆ రోజు ఏర్పడే ఈ అద్భుత యోగాలు మీకు తెలుసా..?


Wine Shops Closed : మందుబాబులకు బ్యాడ్ న్యూస్, రెండ్రోజులు వైన్స్ షాపులు బంద్

Liquor Shops Close in Hyderabad: మందుబాబులకు బ్యాడ్ న్యూస్. వీకెండ్‌లో మందు పార్టీలతో మజా చేయాలనుకునే వారికి సిటీ పోలీసులు బ్రేకింగ్ న్యూస్ చెప్పేశారు. ఆది, సోమవారాలు రెండ్రోజుల పాటు సిటీలో మద్యం అమ్మకాలు జరపకూడదని ఆదేశించారు. వాస్తవానికి ఈ రోజుల్లో ఏ ఫంక్షన్ అయినా ముక్క, సుక్క ఉండాల్సిందే. సుక్క లేకుండా దాదాపు ప్రస్తుతం ఏ వేడుక జరగడం లేదు. వీకెండ్స్, పండగ రోజుల్లో అయితే అన్ని ప్రాంతాల్లో మద్యం ఏరులై పారుతుంది. ఇక కొందరికి అయితే చుక్క పొట్టలోకి...


Masala Kakarakaya: మసాలా కాకరకాయ కూర, డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ రెసిపీ

ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉన్నారు, ఒకటి కాకరకాయను అమితంగా ఇష్టపడేవారు, మరొకరు కాకరకాయను కూడా రుచి చూడలేరు. మీరు మొదటి కోవలోకి వస్తే, కొన్ని కొత్త కాకరకాయ రుచులను రుచి చూద్దాం. రాధా శ్రీవాస్తవ వంటకాలు చెబుతున్నారు.