భారీ వినాయక ప్రతిమలు తయారయ్యేది ఇక్కడే..
భారీ వినాయక ప్రతిమలు తయారు చేసేంది ఇక్కడే.. గత కొన్ని సంవత్సరాలుగా మహారాష్ట్ర, సోలాపూర్ కు చెందిన కళాకారులు అన్ని రకాల మోడల్స్ లో వినాయక ప్రతిమలు, దుర్గామాత విగ్రహాలు తయారు చేస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణగా కనువిందు చేస్తున్నాయి. అతి తక్కువ ధరల్లో అన్ని రకాల మోడల్స్ గణేష్ ప్రతిమలు తయారు చేస్తున్నామని మహారాష్ట్ర కళాకారుడు లక్ష్మణ్ లోకల్18 కి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కామారెడ్డి, కరీంనగర్, వేములవాడ రహదారికి అనుకొని ఉన్న కళాకార్ ఆర్ట్ ఆధ్వర్యంలో 5 ఫీట్ల నుంచి 14 ఫిట్ల వరకు మండప నిర్వహకుల అభిరుచికి అనుగుణంగా సకాలంలో తయారు చేసి అందిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. మిగతా దుకాణాలతో పోలిస్తే మా కళాకార్ ఆర్ట్ వద్ద తక్కువ ధరల్లో వినాయక ప్రతిమలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ ఉండటంతో తక్కువ ధరలు అందించడం సాధ్యమవుతుందని, దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి మండప నిర్వహకులు, సభ్యులు వచ్చి గణేష్ ప్రతిమలు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. దీంతో అధిక సంఖ్యలో మండప నిర్వహకులు విగ్రహాలు కొనేందుకు రావడంతో సందడి వాతావరణం నెలకొంది. గత కొన్ని ఏళ్లుగా మహారాష్ట్ర సోలాపూర్ కు చెందిన కళాకారులు ఇక్కడ గణేష్ ప్రతిమలే కాకుండా దుర్గామాత ప్రతిమలు కూడా తయారు చేస్తూ ఉపాధిని పొందుతున్నామని అన్నారు. రెండు మాసాలు పాటు ఇంటివద్ద అంటూ.. మిగతా 10 నెలలు విగ్రహాల తయారీలో నిమగ్నమవుతామని తెలిపారు. భారీ వినాయక ప్రతిమలు చూసేందుకు, కొనుగోలు చేసేందుకు మండప నిర్వహకులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. వినాయక చవితి వచ్చిందంటే చాలు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా.. ఊరు, వాడల్లో భారీ గణనాయకుల ప్రతిమలు మండపాల్లో నెలకొల్పి తొమ్మిది రోజులపాటు మండప నిర్వహకులు, ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్న తరుణంలో.. మండపాలన్నీ సందడిగా పండగ వాతావరణంలో దర్శనమిస్తాయి. ఇప్పటికే చాలా వరకు మండప నిర్వహకులు వినాయక ప్రతిమలను కొనుగోలు చేసి మండపాల్లో నెలకొల్పేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఇప్పటికే చాలా వరకు వినాయక ప్రతిమల అమ్మకాలు జరిపినట్లు కళాకారులు చెబుతున్నారు. మరికొన్ని ఆర్డర్స్ ఉన్నాయని, వాటిని రాత్రి, పగలు శ్రమించి తయారు చేస్తున్నట్లు లోకల్18కి చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మండప నిర్వహకులందరికీ ఎస్పీ అఖిల్ మహాజన్ సిరిసిల్ల పట్టణంతో పాటు వేములవాడ ప్రాంతాల్లో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నవరాత్రులు శాంతి భద్రతల పరిరక్షణకు, అందరూ కృషి చేయాలని కోరారు.
2024-09-07T12:06:44Z
Horoscope: సెప్టెంబర్ 8 రాశిఫలాలు. వారి పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి
Rasiphalalu today:పన్నెండు రాశుల్లో ఇవాళ (8 సెప్టెంబర్, 2024 ఆదివారం) ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎవరికి అదృష్టం కలిసొస్తుంది? ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి? ఎవరిపై శని ప్రభావం ఉంటుంది? తెలుసుకుందాం. మేష రాశి (Aries):ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్థికంగా కొంత పురోగతికి కూడా అవకాశం ఉంది. స్థిరాస్తి వివాదం ఒకటి ఒక కొలిక్కి వస్తుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. వృత్తిలో కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టి ప్రయోజనం పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్ అందే అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. బంధుమిత్రులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం సజావుగా ఉంటుంది. వృషభ రాశి (Taurus):కొద్దిపాటి అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఆహార, విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరిగినా ఫలితం పొందుతారు. ఆదాయం నిలకడగా కొనసాగుతుంది. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. కొన్ని పనులు, ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. బంధుమిత్రులకు స్తోమతకు మించి సహాయపడతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. మిథున రాశి (Gemini):పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. కొందరు సన్నిహితుల నుంచి కొత్త ఉద్యోగానికి సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండకపోవచ్చు. ఉద్యోగంలో ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఊహించని ఆదాయ వృద్ధి ఉంటుంది. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. కర్కాటక రాశి (Cancer):అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు దాదాపు ఒక కొలిక్కి వస్తాయి. కొద్ది వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటేమీ ఉండదు. ప్రముఖుల నుంచి గుర్తింపు, సత్కారాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారులు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా, హుషారుగా ముందుకు సాగుతాయి. సింహ రాశి (Leo):సొంత పనులను పూర్తి చేయడం మీద, వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడం మీద శ్రద్ధ పెడతారు. పెండింగ్ పనులన్నిటినీ పూర్తి చేస్తారు. బంధువుల నుంచి అందిన శుభవార్త ఒకటి ఉత్సాహం కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ కొందరు స్నేహితులకు సహాయం చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కన్య రాశి (Virgo):ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి కేంద్రీకరిస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద శ్రద్ధ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకోకుండా కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆశించిన శుభవార్తలు వింటారు. తుల రాశి (Libra):కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులకు ఇతోధికంగా సహాయపడతారు. ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండదు. ఖర్చులు తగ్గించుకోవాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. వృశ్చిక రాశి (Scorpio):ఆర్థిక సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఆదాయం పెంచుకునే ప్రయత్నాలను కొనసాగిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు బాగా తగ్గే అవకాశం ఉంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన పనులను త్వరగా పూర్తవుతాయి. బంధువుల రాక వల్ల ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. దూరపు బంధువుల ద్వారా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ధనస్సు రాశి (Sagittarius):ఉద్యోగంలో మీ పనితీరు అధికారులకు సంతృప్తి కలిగిస్తుంది. అధికారులు కొత్త ప్రాజెక్టులను అప్ప గించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేపట్టి విజయాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలను కుటుంబ సభ్యుల సహాయంతో పూర్తి చేస్తారు. బంధువుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. జీవిత భాగస్వామితో కలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. మకర రాశి (Capricorn):వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. మిత్రులతో కలిసి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొందరు బంధువులకు అండగా నిలబడతారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. కొత్త ఉద్యోగావకా శాలు అందివస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుకుంటారు. కుంభ రాశి (Aquarius):వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. బాధ్యతలు బాగా పెరిగే సూచనలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు కాస్తంత నిదానంగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయడం మంచిది. ఉద్యోగపరంగా మంచి కంపెనీల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుకుంటారు. కొందరు స్నేహితుల వల్ల ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. అదనపు బాధ్యతల వల్ల ఒత్తిడి పెరిగి, విశ్రాంతి లభించదు. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. మీన రాశి (Pisces):కొందరు దూరపు బంధువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. పరిచయస్థులతో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. నూతన వస్తు లాభాలకు అవకాశం ఉంది. దీర్ఘకాలిక రుణాలను చాలావరకు తీర్చగలుగుతారు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను అమలు చేస్తారు. ఉద్యోగుల పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.
2024-09-07T23:37:32Z
ఈ రాశుల వారికి అస్సలు సహనం ఉండదు.. వీరిని పెళ్లి చేసుకుంటే చుక్కలు కనిపిస్తాయి!
వివాహం అనేది ప్రతి మనిషి జీవితంలో ముఖ్య ఘట్టం. ఇద్దరు మనుషులు ఒక్కటై ఎన్నో కలలతో దాంపత్య బంధంలోకి అడుగుపెడతారు. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే కొంతమంది కపుల్స్ మధ్య మనస్పర్థలు చోటుచేసుకుంటాయి. దీంతో ఎప్పుడూ గొడవలు పడుతూ వివాహ బంధంలో సమస్యలు కొని తెచ్చుకుంటారు. జంటలో ఎవరో ఒకరికి సహనం, ఓపిక లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పుకోవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్ని రాశులకు చెందిన పురుషులు అస్సలు సహనంతో ఉండరు. వీరిలో కోపం, భావోద్వేగం వంటి లక్షణాలు సంబంధాలు విచ్ఛిన్నమయ్యేందుకు కారణం అవుతాయి. వీరి నడవడిక వైవాహిక జీవితాన్ని మరింత కష్టతరం చేస్తుంది. ఆ రాశులేంటో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం) మేషరాశి : మేషరాశి పురుషులు ఉద్రేకపూరితంగా ఉంటారు. నిర్లక్ష్యంతో వీరు తీసుకునే నిర్ణయాలు గందరగోళానికి దారి తీస్తాయి. వీరు వ్యక్తిగత స్వాతంత్య్రానికి ప్రాధాన్యత ఇస్తారు. భార్య అవసరాలను అస్సలు పట్టించుకోరు. అంతేకాదు, వీరి నుంచి నిబద్ధత ఆశించడం చాలా కష్టం. వీరితో ఎక్కువ కాలం పాటు స్థిరమైన సంబంధాన్ని కొనసాగించడం కష్టమనే చెప్పవచ్చు. ప్రతి విషయంలో పోటీ పడుతూ నిరంతరం భాగస్వామితో ఘర్షణ పడుతుంటారు. (ప్రతీకాత్మక చిత్రం) సింహ రాశి : సింహరాశికి చెందిన పురుషులు భాగస్వామి అవసరాల కంటే తమ సొంత అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. వారి కోరికల కోసం స్వార్థంగా ఆలోచిస్తారు. వీరిలో గర్వం, అహం బాగా ఉంటుంది. ఇది ఇద్దరి మధ్య విభేదాలకు దారి తీస్తుంది. వీరు తమ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడరు. మనసులో నెగిటివ్ ఫీలింగ్స్పెట్టుకొని భాగస్వామితో తరచూ తగాదా పడుతుంటటారు. వీరు తమ భావోద్వేగాలను, ఆలోచనా విధానాన్ని మెరుగుపర్చుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం) ధనుస్సు రాశి : ధనుస్సు రాశికి చెందిన పురుషులు స్వేచ్ఛగా ఉండేందుకు ఇష్టపడతారు. తమ భాగస్వామి నిబద్ధతతో ఉండాలని ఆలోచిస్తారు. అయితే, భాగస్వామితో నిజాయితీగా వ్యవహరించరు. ఇది భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలకు దారి తీస్తుంది. ధనస్సు రాశి వారు సురక్షితమైన, స్థిరమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడంలో అనేక సవాళ్లు ఎదుర్కొంటారు. వీరు తమ భాగస్వామి అవసరాలకు అనుగుణంగా ఆలోచనా విధానాన్ని మర్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడే, జీవితాంతం సమస్యలు లేకుండా తమ దాంపత్య జీవితాన్ని కొనసాగించగలరు. (ప్రతీకాత్మక చిత్రం) మకర రాశి : మకర రాశి పురుషులు సంబంధాలు, భాందవ్యాల కంటే తమ కెరీర్‌కు ప్రాధాన్యతనిస్తూ వర్క్హోలిక్గా ఉంటారు. కుటుంబానికి సరైన సమయం కేటాయించరు. ఎప్పుడూ ఆఫీసు పని, తమ సొంత పనులకే ప్రాధాన్యతనిస్తారు. తమ బాధ్యతను బాగా నిర్వహిస్తున్నప్పటికీ.. భాగస్వామితో సమస్యలు తెచ్చి పెడుతుంది. మకర రాశి వారు అత్యంత భావోద్వేగ లక్షణాలను కలిగి ఉంటారు. మకర రాశి వారు భార్య పట్ల ఆప్యాయత చూపిస్తూ పని, కుటుంబ బాధ్యతలను సమతుల్యం చేయడం అలవర్చుకోవాలి. అప్పుడే ఎటువంటి సమస్యలు లేకుండా దాంపత్య జీవితం కలకాలం వర్ధిల్లుతుంది. (ప్రతీకాత్మక చిత్రం) కుంభ రాశి : కుంభ రాశికి చెందిన పురుషులు చీటికీ మాటికీ భార్యతో తగాదా పడుతుంటారు. వారి వ్యక్తిగత స్వేచ్ఛకే ప్రాధాన్యతనిస్తారు. వీరిలో సహనం చాలా తక్కువగా ఉంటుంది. భార్యతో ప్రేమగా కాకుండా కోపంతో మాట్లాడుతుంటారు. తద్వారా ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి వైవాహిక బంధంలో సమస్యలు వస్తాయి. వీరు తమ భాగస్వామితో సురక్షితమైన సంబంధాన్ని నిర్మించడం సవాలుగా మారుతుంది. కుంభ రాశికి చెందిన పురుషులు తమ భాగస్వామి పట్ల ప్రేమ కురిపించాలి. అంతేకాదు, సహనంతో వ్యవహరించాలి. అప్పుడే, వారి మధ్య బంధం కలకాలం దృఢంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం) (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.) (ప్రతీకాత్మక చిత్రం).
2024-09-06T06:05:49Z
Weekly Horoscope: వారఫలాలు. సెప్టెంబర్ 8 నుంచి 14 వరకూ రాశిఫలాలు
Weekly Horoscope: ఈ వారం ఏ రాశి వారికి ఎలా కలిసొస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబ అంశాల్లో ఎలాంటి మార్పులు ఉంటాయి? అంతా సానుకూలమేనా? లేదంటే ఏవైనా ఇబ్బందులు ఉంటాయా? అనే విషయాల్ని రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 సెప్టెంబర్ 8 నుంచి 14 వరకూ వార రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) (Aries):గురు, బుధ, శనీశ్వరుల అనుకూల సంచారం కారణంగా వారంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సాధారణంగా ఏ పని తలపెట్టినా సజావుగా, సంతృప్తికరంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్థికంగా కొంత పురోగతికి కూడా అవకాశం ఉంది. స్థిరాస్తి వివాదం ఒకటి ఒక కొలిక్కి వస్తుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. వృత్తిలో కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టి ప్రయోజనం పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగు తాయి. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్ అందే అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. బంధుమిత్రులకు మేలు జరిగే పనులు చేస్తారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. వృషభ రాశి (కృత్తిక 2,3,4 రోహిణి, మృగశిర 1,2) (Taurus):రాశ్యధిపతి శుక్రుడు పంచమ స్థానంలో బలంగా ఉన్నందువల్ల అనుకూలతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి చాలావరకు బయటపడే అవకాశం ఉంది. కొద్దిపాటి అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఆహార, విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరిగినా ఫలితం పొందుతారు. ఆదాయం నిలకడగా కొనసాగుతుంది. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. కొన్ని పనులు, ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. బంధుమిత్రులకు స్తోమతకు మించి సహాయపడతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. మిథున రాశి (మృగశిర 3,4 ఆర్ద్ర, పునర్వసు 1,2,3) (Gemini):రాశ్యధిపతి బుధుడు తృతీయ స్థానంలో రవితో కలిసి ఉండడం వల్ల ఏ పని లేదా ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. కొందరు సన్నిహితుల నుంచి కొత్త ఉద్యోగానికి సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండకపోవచ్చు. ఉద్యోగంలో ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఊహించని ఆదాయ వృద్ధి ఉంటుంది. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణులవుతారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. కర్కాటక రాశి (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) (Cancer):ప్రధాన గ్రహాలైన గురువు, బుధ, కేతువులు అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాలతో పాటు కుటుంబపరంగా కూడా బాగా అనుకూలతలు పెరుగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు దాదాపు ఒక కొలిక్కి వస్తాయి. కొద్ది వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటేమీ ఉండదు. ప్రముఖుల నుంచి గుర్తింపు, సత్కారాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారులు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా, హుషారుగా ముందుకు సాగుతాయి. విద్యార్థులు ఎంత శ్రమ పడితే అంత మంచిది. ప్రేమ వ్యవహారాల్లో లేనిపోని అపార్థాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. సింహ రాశి (మఖ, పుబ్బ, ఉత్తర 1) (Leo):గురు, బుధ, రవుల బలం బాగా ఉంది. ఈ రాశ్యధిపతి రవి బుధుడితో కలిసి ఉన్నందువల్ల బాగా అనుకూల ఫలితాలనిస్తాడు. సొంత పనులను పూర్తి చేయడం మీద, వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడం మీద ఎక్కువగా శ్రద్ధ పెడతారు. పెండింగ్ పనులన్నిటినీ పూర్తి చేస్తారు. బంధువుల నుంచి అందిన శుభవార్త ఒకటి ఉత్సాహం కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ కొందరు స్నేహితులకు కొద్దిగా సహాయం చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకుపోతారు. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కన్య రాశి (ఉత్తర 2,3,4, హస్తు చిత్త 1,2) (Virgo):ధన, కుటుంబ స్థానంలో శుక్రుడు, భాగ్య స్థానంలో గురువు ఉండడం వల్ల ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి కేంద్రీకరిస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద శ్రద్ధ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకోకుండా కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. విద్యార్థులు బాగా కష్ట పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. తుల రాశి (చిత్త 3,4 స్వాతి, విశాఖ 1,2,3) (Libra):రాహువు, రవి, బుధుడు, రాశ్యధిపతి శుక్రుడు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల ముఖ్య మైన వ్యవహారాలు సకాలంలో పూర్తి కావడం, ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం కావడం వంటివి జరుగుతాయి. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొందరు బంధుమిత్రులకు ఇతోధికంగా సహాయపడతారు. ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. వ్యాపారాలు సంతృ ప్తికరంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండదు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. విద్యార్థులు ఆశించిన పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. వృశ్చిక రాశి (విశాఖ & అనూరాధ, జ్యేష్ఠ) (Scorpio):ఈ రాశికి ప్రస్తుతం గురు, శుక్ర, బుధ, రవులు అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఆదాయం పెంచుకునే ప్రయత్నాలను కొనసాగిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు బాగా తగ్గే అవకాశం ఉంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు త్వరగా పూర్తవుతాయి. బంధువుల రాక వల్ల ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. దూరపు బంధువుల ద్వారా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఆశించిన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగిపోతాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ధనస్సు రాశి (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) (Sagittarius):తృతీయ స్థానంలో శనీశ్వరుడు, భాగ్య స్థానంలో రవి, బుధుల అనుకూల సంచారం వల్ల మనసు లోని కోరికలు, ఆశయాల్లో ఒకటి రెండు నెరవేరు అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ పనితీరు అధికారులకు సంతృప్తి కలిగిస్తుంది.అధికారులు కొత్త ప్రాజెక్టులను అప్పగించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేపట్టి విజయాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలను కుటుంబ సభ్యుల సహాయంతో పూర్తి చేస్తారు. బంధువుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక విషయాల్లో జీవిత భాగస్వామితో కలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. విద్యార్థులు ఆశించిన స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) (Capricorn):ధన స్థానంలో ధనాధిపతి శని, తృతీయంలో రాహువు, పంచమంలో గురువు సంచారం కారణంగా అన్ని ముఖ్యమైన విషయాల్లోనూ అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. మిత్రులతో కలిసి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొందరు బంధువులకు అండగా నిలబడతారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సంతృప్తికరంగా పూర్త వుతాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. కొత్త ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులు సత్ఫలితాల కోసం బాగా కష్టపడాల్సిన అవసరం ఉంది. ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగిపోతాయి. కుంభ రాశి (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) (Aquarius):సప్తమ స్థానంలో రవి, బుధుల కారణంగా వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని కీలక మార్పులు చోటు చేసు కుంటాయి. బాధ్యతలు బాగా పెరిగే సూచనలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు కాస్తంత నిదానంగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయడం మంచిది. ఉద్యోగపరంగా మంచి కంపెనీల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుకుంటారు. కొందరు స్నేహితుల వల్ల ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. అదనపు బాధ్యతల వల్ల ఒత్తిడి పెరిగి, విశ్రాంతి కరువ వుతుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. మీన రాశి (పూర్వాభాద్ర ఓ ఉత్తరాభాద్ర, రేవతి) (Pisces):రాశ్యధిపతి గురువు తృతీయ స్థానంలో ఉన్నందువల్ల ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగుల పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి. కొందరు దూరపు బంధువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబంతో కలిసి ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. పరిచయస్థులతో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. నూతన వస్తు లాభాలకు అవకాశం ఉంది. దీర్ఘకాలిక రుణాలను చాలావరకు తీర్చగలుగుతారు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను అమలు చేస్తారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. కొందరు బంధుమిత్రులకు సహాయం చేస్తారు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం వృద్ధి చెందుతుంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
2024-09-07T23:22:27Z
యాపిల్, ఆరెంజ్ పళ్లపై ఈ స్టిక్కర్స్ ఎందుకుంటాయో తెలుసా? వెంటనే తెలుసుకొని జాగ్రత్త పడండి
ఆరోగ్యానికి పండ్లు మేలు చేస్తాయని, తరచూ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని తరచూ ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో తాజా పండ్లు లభించడం లేదు. పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు, తాజాగా కనిపించేందుకు, పక్వానికి రావడానికి రసాయనాలు వినియోగిస్తున్నారు. అందుకే పండ్లు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మార్కెట్లో కొనుగోలు చేసే కొన్ని రకాల పండ్లపై స్టిక్కర్లు ఉంటాయి. ముఖ్యంగా యాపిల్, నారింజ పండ్లపై వీటిని గమనించవచ్చు. వాటి గురించి పట్టించుకోకుండా కొనుగోలు చేస్తుంటారు. ఇంతకీ స్టిక్కర్లపై ఉన్న నంబర్లు దేనికి సంకేతం? ఇప్పుడు తెలుసుకుందాం. యాపిల్, ఆరెంజ్ పండ్లపై ఉన్న స్టిక్కర్లను పట్టించుకోకుండా వాటిని కొనుగోలు చేసి తినడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. పైగా మనలో చాలామంది స్టిక్కర్ల ఉన్న పండ్లు ఖరీదైనవి, తాజాగా ఉండేవి అని భావిస్తారు. అది వాస్తవం అది కాదు. పండించిన విధానానికి సూచిక : యాపిల్, ఆరెంజ్ పండ్లపై ఉన్న స్టిక్కర్లు వాస్తవానికి మన ఆరోగ్యానికి సంబంధించినవి. స్టిక్కర్లపై ఉండే నంబర్లు ఆ పండ్ల నాణ్యత, పండించిన విధానాన్ని తెలుపుతాయి. అంటే జన్యుమార్పిడి, రసాయనాలు లేదా సేంద్రీయంగా పండిచారా అనే విషయాన్ని సూచిస్తాయి. సాధారణంగా యాపిల్స్, ఆరెంజ్ పండ్లపై ఉండే స్టిక్కర్ల మీద మూడు రకాల నంబర్లు ఉంటాయి. 4 అంకెతో ప్రారంభమైతే రసాయనాలు : కొన్ని పండ్ల స్టిక్కర్ మీద 4889 లేదా 4047 వంటి నాలుగు అంకెల నంబర్ ఉంటుంది. 4 అంకెతో ప్రారంభమైతే ఆ పండ్లు పురుగు మందులు, రసాయనాలతో పడించారని అర్థం. పంట సమయంలో తెగుళ్ల నుంచి రక్షించడానికి పండ్లకు తరచుగా పురుగుమందులను పిచికారి చేసి ఉంటారు. ఈ పండ్లపై రసాయన అవశేషాలు ఉంటాయి. అందుకే ఇవి తక్కువ ధరకు లభిస్తాయి. 8తో ప్రారంభమైతే జన్యుమార్పిడి : మరికొన్ని పండ్లపై ఉండే స్టిస్కర్ మీద 86344 లేదా 80934 వంటి ఐదు అంకెల సంఖ్య ఉంటుంది. ఈ సంఖ్య 8తో ప్రారంభమవుతుంది. దాని అర్థం ఏంటంటే ఈ సంఖ్య ఉండే పండ్లు జన్యుపరంగా మార్పు చెందినవి, సహజమైనవి కావు. ఈ రకమైన పండ్లు సాధారణంగా పురుగుమందులతో పిచికారి చేసిన పండ్ల కంటే ఖరీదైనవి. వీటి వల్ల కొన్ని ప్రత్యేక లాభాలు, నష్టాలు కూడా ఉంటాయి. నంబర్ 9తో ప్రారంభమైతే? : మరికొన్ని పండ్లపై కూడా 5 అంకెల సంఖ్యతో స్టిస్కర్ ఉంటుంది. అయితే అది 9 అంకెతో ప్రారంభమవుతుంది. ఉదాహరణగా 98364 మాదిరి ఉంటుంది. 9 అంకెతో ప్రారంభమై ఐదు అంకెల సంఖ్య ఉన్న పండ్లు పురుగుమందులు లేదా రసాయనాలు ఉపయోగించకుండా సేంద్రియ పద్ధతిలో పండించారని అర్థం చేసుకోవాలి. వీటిని సహజసిద్ధంగా పండిస్తారు. తినడానికి సురక్షితమైనవి. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. వాటి ధర కూడా చాలా అధికంగా ఉండవచ్చు.
2024-09-07T10:06:24Z
Horoscope: సెప్టెంబర్ 7 రాశిఫలాలు. వినాయక చవితి శుభాకాంక్షలతో!
Rasiphalalu today:పన్నెండు రాశుల్లో ఇవాళ (7 సెప్టెంబర్, 2024 శనివారం) ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎవరికి అదృష్టం కలిసొస్తుంది? ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి? ఎవరిపై శని ప్రభావం ఉంటుంది? తెలుసుకుందాం. మేష రాశి (Aries):రోజంతా ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. సకాలంలో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. కొద్ది ప్రయత్నంతో కుటుంబ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. వృషభ రాశి (Taurus):వృత్తి, ఉద్యోగాలు ఆశించిన విధంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యల కారణంగా కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. దైవకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. అనుకోకుండా ఒక శుభవార్త వింటారు. మిథున రాశి (Gemini):ఆర్థిక వ్యవహారాలను సంతృప్తికరంగా చక్కబెడతారు. చేపట్టిన ప్రతి పనీ సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతుంది. వృత్తి, ఉద్యోగాల మీద శ్రద్ధ బాగా పెంచుతారు. పిల్లల చదువులు సంతోషం కలిగిస్తాయి. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. కుటుంబ సమేతంగా ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. కుటుంబ సభ్యులు, తల్లితండ్రుల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. కర్కాటక రాశి (Cancer):వృత్తి, ఉద్యోగాల్లో పని భారం, ఒత్తిడి పెరిగినా, ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది కానీ, అనవసర ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాల్లో కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన స్పందన లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సింహ రాశి (Leo):కుటుంబపరమైన వ్యవహారాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఉద్యోగంలో అధికారుల తీరు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. లాభాలకు లోటుండదు. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో మెరుగైన ఫలితాలు అనుభవానికి వస్తాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. సప్తమ శని ప్రభావం వల్ల ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. కొద్దిగా ఒత్తిడి తప్పకపోవచ్చు. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కన్య రాశి (Virgo):వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. నెమ్మదిగా ఆర్థిక సమస్యల్ని పరిష్కరించుకుంటారు. గట్టి ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఉద్యోగ రీత్యా ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉన్నప్పటికీ, ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోక పోవడం మంచిది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. తుల రాశి (Libra):వృత్తి, ఉద్యోగాలకు ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. మీరిచ్చిన సలహాల వల్ల బంధుమిత్రులు ఆశించిన ప్రయోజనం పొందుతారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా ఆటంకాలుంటాయి. వృశ్చిక రాశి (Scorpio):పెండింగ్ పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. కొత్త ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇంటాబయటా అనుకూలతలు పెరుగుతాయి. మిత్రుల వల్ల ఇబ్బందిపడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఊపందుకుంటాయి. ధనస్సు రాశి (Sagittarius):అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆరోగ్యానికి లోటుండదు. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆధ్యాత్మికంగా యాక్టివిటీ పెరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. మకర రాశి (Capricorn):కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. వ్యక్తిగత వ్యవహారాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సి వస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో మీ మాటకు, చేతకు తిరుగుండదు. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. సమాజంలో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో చికాకులుంటాయి. కుంభ రాశి (Aquarius):ఇంటా బయటా పనిభారం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద ఎక్కువగా శ్రమపడతారు. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాలు బిజీగా సాగుతాయి. వ్యాపారాల్లో కూడా శ్రమ బాగా పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. మీన రాశి (Pisces):ప్రతి ప్రయత్నమూ, ప్రతి పనీ సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. గతంలో మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేసే అవకాశం ఉంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఆదాయం పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. బంధువుల నుంచి పెళ్లి సంబంధాల విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. పిల్లల చదువులు సంతృప్తికరంగా సాగిపోతాయి. ప్రేమ వ్యవహారాల్లో అసంతృప్తి ఉంటుంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.
2024-09-06T23:22:10Z
సెప్టెంబర్ 8 ధన జ్యోతిష్యం. వారికి అకస్మాత్తుగా భారీ మొత్తంలో డబ్బు అందుతుంది
(Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology (ధన జ్యోతిషం): ప్రముఖ జ్యోతిష్కులు భూమికా కలాం.. ప్రతి రోజూ ధన రాశి ఫలాలు ఇస్తున్నారు. ఏ రాశి వారికి ఎలాంటి ఆర్థిక ఫలాలు ఉంటాయో చెబుతున్నారు. సెప్టెంబర్ 8వ తేదీ, ఆదివారం నాడు అన్ని రాశుల ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):కొన్ని వ్యాపార పనుల కారణంగా, మీరు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు వ్యాపారానికి సంబంధించి కొంత ప్రయాణం కూడా చేయవచ్చు. ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. పరిహారం: లక్ష్మీదేవికి ఖీర్ సమర్పించండి. వృషభం (Taurus):ఈ రోజు మీరు దాతృత్వ పనుల కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు. దీని కారణంగా మీ కీర్తి ప్రతిచోటా వ్యాపిస్తుంది. అనవసర ఖర్చులకు, వివాదాలకు దూరంగా ఉండాలి. పరిహారం: ప్రతి రాత్రి నల్ల కుక్కకు చివరి రొట్టె పెట్టండి. మిథునం (Gemini):ఈరోజు అకస్మాత్తుగా భారీ మొత్తంలో డబ్బు అందుతుంది. దీని కారణంగా నైతికత పెరుగుతుంది. మీరు మీ జీవిత భాగస్వామి కోసం కొంత షాపింగ్ కూడా చేయవచ్చు. మీరు ఆదాయం, వ్యయం రెండింటినీ నియంత్రించాలి, లేకుంటే ఆర్థిక పరిస్థితి దెబ్బతినవచ్చు. ఈ రోజు మీరు ఏ పని చేసినా, దాని ఫలితాలను పొందే సమయం మీకు లభిస్తుంది. పరిహారం: మంగళవారం నాడు ఉపవాసం ఉండి, ఆంజనేయస్వామికి తమలపాకులు సమర్పించండి. కర్కాటకం (Cancer):ఈ రోజు వ్యాపారంలో కొన్ని కొత్త ప్రయత్నాలు చేస్తారు. అందులో విజయం సాధిస్తారు, మీ కీర్తి పెరుగుతుంది. సాయంత్రం అతిథుల రాక కారణంగా మీ ఖర్చు పెరుగుతుంది. వ్యాపారంలో ఉన్న సమస్యలను దూరం చేసుకోవచ్చు. పరిహారం: ఆంజనేయస్వామికి చోళాన్ని సమర్పించి, హనుమాన్ చాలీసా పఠించండి. సింహం (Leo):ఈ రోజు మీ రోజువారీ అవసరాలకు కొంత డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారంలో జరుగుతున్న సమస్యలు సోదరుడితో పంచుకుంటారు. ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఉద్యోగస్తులు పార్ట్ టైమ్ పని చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అందుకు ఈ రోజు తగిన సమయాన్ని కనుగొంటారు. వ్యాపారం చేసే వ్యక్తులు కొన్ని కొత్త ఒప్పందాలు పొందవచ్చు. పరిహారం: మంగళవారం నాడు ఉపవాసం ఉండి, ఆంజనేయస్వామికి పచ్చిమిర్చి సమర్పించండి. కన్య (Virgo):వ్యాపారంలో అధిక లాభాలు పొందడం ద్వారా మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. ఈరోజు మీరు మీ ఆదాయానికి మించి ఖర్చు చేస్తే, అది భవిష్యత్తులో ఇబ్బందిని కలిగిస్తుంది. కాబట్టి తెలివిగా డబ్బు ఖర్చు చేయండి. పరిహారం: బజరంగ్ బాన్ పఠించండి. ఆంజనేయస్వామికి బూందీని సమర్పించండి. తుల (Libra):ఈరోజు మీరు ఏ పని చేసినా అందులో పూర్తి విజయం సాధిస్తారు. ఉద్యోగంలో, మీకు అనుగుణంగా పని లభిస్తుంది. దాని కారణంగా మీరు సంతోషంగా ఉంటారు. మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ అధికారులు కూడా మిమ్మల్ని ప్రశంసించడం కనిపిస్తుంది. మీరు ఈరోజు ఆస్తిని కొనుగోలు చేయబోతుంటే, స్థిర, చర రెండు అంశాలను పరిశీలించండి. లేకుంటే నష్టం ఉండవచ్చు. పరిహారం: చీమలకు పిండి పోయండి. రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించండి. వృశ్చికం (Scorpio):ఈ రోజు శత్రువులు ఉద్యోగం, వ్యాపారంలో ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. మీరు జాగ్రత్తగా ఉండాలి. అందుకే కళ్లు, చెవులు తెరుచుకుని పని చేయాలి. వ్యాపారంలో లాభం కంటే ఎక్కువ ఖర్చుల కారణంగా మీరు ఆందోళన చెందుతారు. స్థానచలనం వాయిదా పడుతుంది. పరిహారం: ఆంజనేయ స్వామిని పూజించండి. ఐదు జాస్మిన్ ఆయిల్ ల్యాంప్స్ వెలిగించండి. ధనస్సు (Sagittarius):ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఈ రోజు మీరు శారీరక, ఆర్థిక బలాన్ని పొందుతారు. మీ ఆగిపోయిన పనులన్నింటినీ పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల అవసరాలు తీరుస్తారు, ఇది మీ ఖర్చులను మరింత పెంచుతుంది. వ్యాపారంలో ఒకరి సలహా అవసరం. ఉద్యోగస్తులు ఈరోజు ఇతర ఉపాధి కోసం చూస్తారు. పరిహారం: పేదలకు బట్టలు, ఆహారాన్ని దానం చేయండి. మకరం (Capricorn):ఈ రోజు సోదరులు, వ్యాపార సహచరుల మధ్య వైరం కారణంగా, అసౌకర్యంగా ఉంటుంది. మీరు దుకాణం లేదా ఇల్లు కొనాలని ఆలోచిస్తుంటే, మీ జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది. శత్రువులు మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు, వారు మీ పురోగతి చూసి కలత చెందుతారు. విద్యార్థులు ఈరోజు చదువులో కొంత డబ్బు కొరతను ఎదుర్కోవలసి ఉంటుంది. పరిహారం: హనుమాన్ చాలీసా 11 సార్లు పఠించండి. కుంభం (Aquarius):ఈరోజు వ్యాపారంలో లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది. కొన్ని వ్యాపార పర్యటనలు కూడా చేస్తారు. దీని వలన మీరు ప్రయోజనం పొందుతారు. విదేశాల నుంచి వ్యాపారం చేస్తున్న స్థానికులకు కొన్ని శుభవార్తలు అందుతాయి. స్నేహితుని సహాయంతో, మీరు నిలిచిపోయిన డబ్బులు పొందవచ్చు. ఇది ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది. పరిహారం: ఆంజనేయస్వామికి లడ్డూలను సమర్పించండి. మీనం (Pisces):ఈ రోజు ఉద్యోగస్తులకు పనిభారం, బాధ్యతలు పెరుగుతాయి. దీని కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తెలివితేటలు, గౌరవంతో, మీరు సాయంత్రం వరకు అన్ని పనులు పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు. మీకు ఏదైనా ఆస్తి సంబంధిత వివాదం ఉంటే, అది చట్టబద్ధం కావచ్చు. పరిహారం: మంగళవారం ఉపవాసం ఉండి, సుందరకాండ పఠించండి. Disclaimer:ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.
2024-09-07T23:52:44Z
Skin Care: ముల్తానీ మిట్టీ ఈ విధంగా రాశారంటే.. మీ ముఖం మరింత యంగ్‌గా మెరుస్తుంది..!
ముల్తానీ మిట్టి అనేది ఖనిజాలతో సమృద్ధిగా ఉండే మట్టి లాంటి పదార్థం. ముఖ్యంగా సహజ శోషక లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది చర్మంలోని జిడ్డును గ్రహించి, ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. తరచుగా ఎక్స్ఫోలియేటర్ లేదా ఫేస్ ప్యాక్‌గా ఉపయోగిస్తారు. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది చర్మం నుండి మలినాలను ,అదనపు నూనెను తొలగిస్తుంది, మీ చర్మం రిఫ్రెష్ అవుతుంది. ముల్తానీ మిట్టిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. పొడి చర్మం కోసం... ఒక గిన్నెలో 1 టీస్పూన్ ముల్తానీ మిట్టిని తీసుకోండి. పేస్ట్ చేయడానికి దీనికి కొద్దిగా పాలు జోడించండి. దీన్ని మీ ముఖం , మెడ అంతటా రాయండి. 10 నిమిషాలు ఆరనివ్వండి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మం మెరుస్తుంది. జిడ్డు చర్మం కోసం... ముల్తానీ మిట్టిని తీసుకుని దానికి కొన్ని చుక్కల రోజ్ వాటర్ వేయండి. ఒక పేస్ట్ తయారు చేసి, ఆపై మీ ముఖం మొత్తం అప్లై చేయండి. దీన్ని 10 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత కడిగేస్తే మీ ముఖంపై జిడ్డును నియంత్రిస్తుంది . బ్రేక్అవుట్లను తగ్గిస్తుంది. నల్ల మచ్చలను వదిలించుకోండి. 1 టీస్పూన్ ముల్తానీ మిట్టిని గ్లిజరిన్‌తో కలిపి పేస్ట్ చేయండి. దీన్ని మీ ముఖం మెడ అంతటా రాయండి. ఇప్పుడు, 10 నిమిషాలు ఆరనివ్వండి . చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేస్తే ముఖంపై ఉన్న నల్ల మచ్చలు పోయి చర్మం అందంగా మారుతుంది. మొటిమలను నివారించడానికి... ఒక గిన్నెలో 2 టీస్పూన్ల ముల్తానీ మేతి, 2 టీస్పూన్ల చందనం పొడి కొద్దిగా రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. దీన్ని మీ ముఖం , మెడ ప్రాంతంలో అప్లై చేసి 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. వారానికోసారి ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి . వృద్ధాప్య రూపాన్ని నివారించడానికి... ఒక గిన్నెలో సుమారు 4 టేబుల్ స్పూన్ల ముల్తానీ మిట్టిని తీసుకుని, 6 టేబుల్ స్పూన్ల మెంతి పొడి , 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం జోడించండి. ఈ పేస్ట్‌ని మీ ముఖం , మెడ ప్రాంతంలో అప్లై చేసి బాగా కడగాలి. ఇలా వారానికోసారి చేస్తే పాత రూపం మారి చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. గమనిక: సున్నితమైన చర్మం ఉన్నవారు ముల్తానీ మిట్టిని నీటితో భర్తీ చేయండి , పాలు, గ్లిజరిన్, కొబ్బరి నూనె లేదా రోజ్ వాటర్ వంటి మాయిశ్చరైజర్‌ను జోడించండి.
2024-09-07T04:21:42Z